వేసవిలో మీ కారు ఇంజిన్ వేడెక్కుతోందా? ఇలా చేసి మీ కూలింగ్ సిస్టమ్‌ను కాపాడుకోండి!

మీ ఫోర్ వీలర్ కేవలం ఓ ప్రయాణ సాధనం మాత్రమే కాదు.. అది మీ కుటుంబంలో ఓ సభ్యుడి లాంటిది. దాని ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా భగభగ మండే వేసవిలో మీ కారు ఇంజిన్‌ను చల్లగా ఉంచుతుంది కూలెంట్. దీని స్థాయిని నిర్లక్ష్యం చేస్తే మీ కారుకు ఎలాంటి దుర్గతి పడుతుందో తెలిస్తే... షాక్ అవుతారు. కూలెంట్ తగ్గిపోతే మీ జేబు ఖాళీ కావాల్సిందే.

వేసవి తాపం పెరిగిపోతోంది. బయట నిప్పుల వాన కురుస్తోంది. ఇలాంటి సమయంలో మనల్ని మనం చల్లగా ఉంచుకునేందుకు చేయని ప్రయత్నాలు ఉండవు. ఏసీలు, కూలర్లు, చల్లటి పానీయాలు వీలైనంత వరకు ఉపయోగిస్తుంటాం. మరి మీ కారు ఇంజిన్ పరిస్థితి ఏంటి? అది కూడా వేడిని తట్టుకోలేక విలవిల్లాడుతుంది.

Car Coolant Power

దానిని చల్లగా ఉంచేది ఏంటో తెలుసా ? అదే కూలెంట్! దురదృష్టవశాత్తూ చాలామంది డ్రైవర్లు వేసవిలో కూలెంట్ స్థాయిని సరిగ్గా పట్టించుకోరు. ఇది ఎంత పెద్ద తప్పో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ కారులో కూలెంట్ స్థాయి పడిపోతే లేదా పూర్తిగా ఖాళీ అయిపోతే ఎలాంటి ఘోరమైన నష్టాలు జరుగుతాయో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

1. ఇంజిన్ ఓవర్‌హీటింగ్ - వేడితో విలవిల!: కూలెంట్ ప్రాథమిక, అత్యంత ముఖ్యమైన పని మీ కారు ఇంజిన్‌ను సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచడం, అంటే చల్లగా ఉంచడం. ఒకవేళ మీ కారులో కూలెంట్ స్థాయి తగ్గిపోతే లేదా పూర్తిగా లేకపోతే, ఇంజిన్ చాలా త్వరగా వేడెక్కుతుంది.

Car Coolant Price

ఈ అధిక వేడి కారణంగా ఇంజిన్‌లోని వివిధ కదిలే భాగాలు ఒకదానితో మరొకటి రాసుకుంటాయి. దీనివల్ల అవి తీవ్రంగా అరిగిపోతాయి లేదా పూర్తిగా పాడైపోతాయి. కారు గుండె లాంటి ఇంజిన్ సీజ్ అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో! ఓ సారి ఊహించుకోండి. ఇది జరిగితే మీ జేబుకు వేలకు వేలు చిల్లు పడుతుంది. కొన్నిసార్లు ఇంజిన్‌ను పూర్తిగా మార్చాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.

2. హెడ్ గాస్కెట్ పేలిపోవడం : కూలెంట్ తక్కువగా ఉండటం వల్ల ఇంజిన్ ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. దీని ఫలితంగా హెడ్ గాస్కెట్ పేలిపోయే ప్రమాదం పెరుగుతుంది. హెడ్ గాస్కెట్ అనేది ఇంజిన్ ముఖ్యమైన భాగాలను సీల్ చేసే ఒక పదార్థం.

ఇది పేలితే కూలెంట్, ఇంజిన్ ఆయిల్ ఒకదానితో మరొకటి కలిసిపోతాయి. ఇది జరిగితే ఇంజిన్‌లో తీవ్రమైన సమస్యలు వస్తాయి. దీనికి భారీగా డబ్బు ఖర్చు చేసి మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. సుమారు రూ.5,000 నుండి రూ.10,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు కావచ్చు!

Car Coolant Benifit

3. రేడియేటర్, వాటర్ పంప్ డ్యామేజ్ : రేడియేటర్, వాటర్ పంప్ అనేవి కూలింగ్ సిస్టమ్‌లోని ముఖ్యమైన పార్టులు. ఇవి కూలెంట్ సహాయంతోనే సమర్థవంతంగా పనిచేస్తాయి. కూలెంట్ లేకపోతే వాటర్ పంప్ డ్రై రన్ చేస్తుంది. అంటే అది తిరుగుతూనే ఉంటుంది కానీ లిక్విడ్ ఉండదు.

దీనివల్ల దానిలోని భాగాలు అరిగిపోతాయి లేదా పూర్తిగా విరిగిపోతాయి. అలాగే, రేడియేటర్ కూడా అధిక వేడిని తట్టుకోలేక పగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ రెండు భాగాలు పాడైపోతే వాటిని మార్చడానికి కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది.

4. ఇంజిన్ కు శాశ్వత నష్టం: మీరు చాలా కాలం పాటు మీ కారును కూలెంట్ లేకుండానే నడిపితే, మీరు ఊహించని నష్టం జరుగుతుంది. ఇంజిన్ బ్లాక్ లేదా సిలిండర్ హెడ్‌లో పగుళ్లు ఏర్పడవచ్చు. ఒకసారి ఈ పగుళ్లు వస్తే, ఇంజిన్‌ను రిపేర్ చేయడం చాలా కష్టం లేదా అసాధ్యం కూడా కావచ్చు. చివరికి మీరు మొత్తం ఇంజిన్‌ను మార్చాల్సిన దుస్థితికి చేరుకోవచ్చు.

5. హఠాత్తుగా కారు ఆగిపోవడం : కూలెంట్ లేకపోవడం వల్ల ఇంజిన్ ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది. దీనివల్ల మీ కారు ఎక్కడంటే అక్కడ, నడిరోడ్డుపై కూడా హఠాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇది కేవలం మీ కారుకు మాత్రమే నష్టం కలిగించదు. మిమ్మల్ని, ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, April 11, 2025, 10:02 [IST]
English summary
Running on empty coolant brace yourself for a heap of car troubles
Read more on: #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+