షోరూంలకు ఎగబడి మరి జనం కళ్లు మూసుకొని కొనేస్తున్నారు.. మార్కెట్లో టాప్ లో ఉన్నవన్నీ ఈ కంపెనీ కార్లే

మన ఇండియన్ కార్ కస్టమర్ల మనసుల్లో టయోటా(Toyota) కంపెనీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. టయోటా కార్ల గురించి నెగెటివ్ కామెంట్లు చాలా తక్కువగా వినిపిస్తాయి. అందుకే టయోటా ప్రతి నెల అద్భుతమైన అమ్మకాల సంఖ్యను నమోదు చేయగలుగుతుంది. ఇటీవల 10లక్షల కిలోమీటర్లకు పైగా ఎలాంటి ఇబ్బంది లేకుండా టయోటా కార్లు నడిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రజలు ఈ కంపెనీ కార్లను కళ్ళు మూసుకుని నమ్ముతున్నారు.

ఈ కోవలోనే 2025 మే నెలలో కూడా టయోటా కంపెనీ అమ్మకాల్లో అదిరిపోయే వృద్ధిని సాధించింది. టయోటా కంపెనీ2025 మే నెలకు సంబంధించిన సేల్స్ రిపోర్ట్(Sales Report) ఇప్పుడు విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం.. టయోటా కంపెనీ అమ్మకాలలో ఎంత వృద్ధిని సాధించిందో, టయోటా నుంచి రాబోయే కొత్త విశేషాల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం.

Toyota Cars

టయోటా(Toyota) కంపెనీ 2025 మే నెలలో మొత్తం 30,864కార్లను అమ్మింది. ఇందులో 29,280 కార్లు భారతదేశంలోనే అమ్ముడయ్యాయి. మిగిలిన 1,584 కార్లను భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేశారు. కానీ, గత 2024 మే నెలలో టయోటా కంపెనీ మొత్తం 25,273 కార్లను మాత్రమే అమ్మింది. అంటే, ఈసారి అమ్మకాల్లో ఏకంగా 22 శాతం వృద్ధి సాధించింది. టయోటా కంపెనీ ప్రస్తుతం భారత మార్కెట్‌లో మొత్తం 12 కార్లను అమ్ముతోంది.

అవి.. గ్లాన్జా (Glanza), అర్బన్ క్రూజర్ టైజర్ (Urban Cruiser Taisor), అర్బన్ క్రూజర్ హైరైడర్ (Urban Cruiser Hyryder), రూమియన్ (Rumion), ఇన్నోవా క్రిస్టా (Innova Crysta), ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross), ఫార్చ్యూనర్ (Fortuner), లెజెండర్ (Legender), వెల్ఫైర్ (Vellfire), హిలక్స్ (Hilux), కామ్రి (Camry), ల్యాండ్ క్రూజర్ 300 (Land Cruiser 300). అయితే ఈ లిస్ట్‌లో ఒక్క ఎలక్ట్రిక్ కారు (EV) కూడా లేదు.

Toyota Cars

అయితే, ఈ లోటు త్వరలోనే తీరనుంది. అవును, భారత మార్కెట్ కోసం టయోటా కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారు 2025 సంవత్సరం చివరి లోపు అమ్మకానికి రానుందని సమాచారం. బహుశా ఆ కారు టయోటా అర్బన్ క్రూజర్ BEV (Toyota Urban Cruiser BEV) అయి ఉండవచ్చని చెబుతున్నారు.

ఈ ఎలక్ట్రిక్ కారులో మొత్తం 2 బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయని తెలుస్తోంది. అందులో ఒకటి చిన్న బ్యాటరీ, మరొకటి పెద్ద బ్యాటరీ అయి ఉండవచ్చు. ఈ రెండు బ్యాటరీలలో, పెద్ద బ్యాటరీతో కారు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి.

Toyota Cars

గత జనవరి నెలలో జరిగిన 2025 ఆటో ఎక్స్‌పో (Auto Expo) వాహన ప్రదర్శనలో టయోటా అర్బన్ క్రూజర్ BEV ఎలక్ట్రిక్ కారును కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. ఇప్పుడు దాన్ని ప్రొడక్షన్ స్టేజ్‌కు తీసుకువచ్చి అమ్మకానికి సిద్ధం చేయడానికి టయోటా కంపెనీ వేగంగా సిద్ధమవుతోంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టయోటా కార్లు కస్టమర్ల మధ్య మంచి నమ్మకాన్ని పొందాయి. కొన్ని టయోటా కార్లు 10 లక్షల కిలోమీటర్లకు పైగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచిన సందర్భాలను చూశాం. భారత మార్కెట్‌లో టయోటా కంపెనీ అమ్మకాలు చాలా బాగా జరుగుతున్నాయనడానికి ఇది చాలా ముఖ్యమైన కారణమని డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.

More from DriveSpark

Article Published On: Monday, June 2, 2025, 16:10 [IST]
English summary
Runs over 10 lakh kms without issues people blindly trust this companys cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+