ఇండియాలో అత్యంత సురక్షితమైన కారు.. మీ బడ్జెట్ ధరలోనే లభిస్తుంది.. క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 5 స్టార్ రేటింగ్
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో కారును కొనుగోలు చేసే వారు ప్రమాద సమయంలో రక్షణ అందించే వాటిని ఎంచుకుంటున్నారు. షోరూమ్‌కు వెళ్లినప్పుడు ముందుగా కారు లోపల ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుని తమకు నచ్చిన మోడల్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా కార్లు ఉన్నాయి. వీటిలో సేఫ్టీ ప్రమాణాలు ఉన్నప్పటికి అత్యుత్తమమైన దాన్ని ఎంచుకుంటున్నారు. కారును కొనడానికి వెళ్ళినప్పుడు సేఫ్టీ రేటింగ్ అనేది అతి ముఖ్యమైన అంశం. అలాగే, ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఇతర ఫీచర్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో కార్ల నాణ్యతను టెస్ట్ చేయడానికి భారత ప్రభుత్వం BNCAPని ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా క్రాష్ టెస్టింగ్ ఉండగా, దానికి ఏమాత్రం తీసిపోకుండా భారత క్రాష్ టెస్ట్‌లో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం తయారీదారులు తమ కార్లను BNCAP కింద టెస్టింగ్ చేస్తున్నారు. వీటిలో వచ్చిన మంచి రేటింగ్‌ను తమ ప్రమోషన్ కోసం వాడుతున్నారు.
కొత్తగా కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ప్రయాణికుల సేఫ్టీ పరంగా 5-స్టార్ భద్రతా రేటింగ్ సాధించిన మోడల్ కోసం చూసినట్లయితే, అలాంటి వారికి ఇక్కడ ఒక ప్రముఖ కారు గురించి వివరంగా అందించడం జరిగింది. ఆ ప్రముఖ మోడల్ పేరు టాటా కర్వ్ (Tata Curvv). ఈ కారు BNCAP నుండి పూర్తి 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందింది. ఇది వినియోగదారులకు రూ.9.99 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో రూ.10 లక్షల లోపు ధర కలిగిన కార్లను ప్రజలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యంత సురక్షితమైన కారు అయినటువంటి కర్వ్ కొత్త కస్టమర్లకు బెస్ట్ ఎంపిక అవుతుంది. టాటా కర్వ్ బడ్జెట్ ధరలో లభించే కూపే-SUV. ఇది భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో పిల్లలు, పెద్దల రక్షణకు సంబంధించి ఏకంగా 5-స్టార్ రేటింగ్‌ను పొందింది.
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా కర్వ్ పిల్లల ప్రయాణీకుల రక్షణకు సంబంధించి 49 పాయింట్లకు గానూ 43.66 పాయింట్లు సాధించింది. అదే విధంగా పెద్దల ప్రయాణీకుల రక్షణకు సంబంధించి 32 పాయింట్లకు 29.50 ను సాధించింది. డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌ను చూసినట్లయితే ఫ్రంటల్ ఆఫ్‌సెట్ రక్షణలో 16 పాయింట్లకు 14.65 స్కోర్‌ను నమోదు చేసింది. అలాగే ఫంక్షనల్ టెస్ట్‌లో 24 పాయింట్లకు 22.66 స్కోర్ పొందింది.

మామూలుగా టాటా మోటార్స్ భారతదేశంలో సేఫ్టీ కలిగిన కార్లను విడుదల చేస్తుంది. లోపల కూర్చున్న ప్రయాణికుల రక్షణకు ఈ కంపెనీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. భద్రత పరంగా రాజీ పడకుండా కంపెనీ కీలకంగా దృష్టి సారిస్తోంది. అందుకే జనాలు ఎక్కువగా ఈ కంపెనీ కార్లపై ఆసక్తి చూపిస్తుంటారు. టాటా కర్వ్ సైతం రక్షణలో ఎలాంటి రాజీ పడదు. దీనిలో అధునాతన ఫీచర్స్‌ను అందించారు.
టాటా కర్వ్‌లో లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), లేన్ డిపార్చర్ వార్నింగ్ (LDW),చుట్టు ప్రక్కల చూడటానికి 360 డిగ్రీల కెమెరా, లేన్ కీప్ అసిస్ట్ (LKA), బ్లైండ్ స్పాట్ డిటెక్షన్‌తో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఇతర అధునాతన సేఫ్టీ ఫీచర్స్‌ను అందించారు. డజన్ల కొద్ది ఉన్న సేఫ్టీ ప్రమాణాలతో టాటా కర్వ్ బెస్ట్ సెఫ్టీ కారుగా స్థానాన్ని పొందింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








