ధరలో రెండూ దగ్గరదగ్గరే..కానీ సేఫ్టీలో ఏది బెస్ట్.. టాటా కర్వ్ వర్సెస్ సిట్రాన్ బసాల్ట్
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? స్టైల్‌తో పాటు సేఫ్టీ కూడా ఉండాలని అనుకుంటున్నారా ? మార్కెట్‌లో కొత్తగా వస్తున్న కూపే ఎస్‌యూవీల గురించి తెలుసుకోవాలని ఉందా? టాటా మోటార్స్ 'కర్వ్' (Curvv) అనే కొత్త కారుతో బరిలోకి దిగుతోంది.
అయితే, ఇప్పటికే ఈ విభాగంలో సిట్రాన్ బసాల్ట్(Basalt) అనే కారును విడుదల చేసింది. ఈ రెండు కార్లు ఒకదానికొకటి పోటీ పడనున్నాయి. మరి సేఫ్టీ, ధర విషయంలో ఏ కారు బెస్ట్ అనేది ఈ వార్తలో తెలుసుకుందాం.

భారతదేశంలో టాటా మోటార్స్ ఎస్‌యూవీ కూపే సెగ్మెంట్‌లో కర్వ్ (Curvv) అనే కారును పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ విభాగంలో ఇంతవరకు సిట్రాన్ కంపెనీ తప్ప మరే ఇతర బ్రాండ్ కూపే ఎస్‌యూవీని కలిగి లేదు. సిట్రాన్ బసాల్ట్ (Citroen Basalt), టాటా కర్వ్ నేరుగా పోటీ పడనున్నాయి. ఎస్‌యూవీ లుక్‌తో పాటు సెడాన్ స్టైల్ కోరుకునే కారు కొనుగోలుదారులకు ఈ రెండు కార్లు మంచి ఆప్షన్లుగా నిలుస్తాయి.
వాహన భద్రతా తనిఖీ సంస్థ 'భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం' (Bharat NCAP) ప్రకారం సిట్రాన్ బసాల్ట్ పెద్దల సేఫ్టీ విభాగంలో 32 పాయింట్లకు 26.19 పాయింట్లను సాధించింది. పిల్లల సేఫ్టీ విభాగంలో 49 పాయింట్లకు 35.90 పాయింట్లను సాధించింది. ఈ విధంగా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది.

ప్రయాణికుల (డమ్మీ) తల , మెడ భాగాలకు ఈ కారులోని సేఫ్టీ ఫీచర్లు మంచి రక్షణను అందించాయని నివేదిక పేర్కొంది. సిట్రాన్ బసాల్ట్ ఎస్‌యూవీ కూపేలో ప్రధానంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), రేర్ పార్కింగ్ సెన్సార్ల వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
వాహన భద్రతా తనిఖీ సంస్థ 'భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం' (Bharat NCAP) పరీక్షలో టాటా కర్వ్, 5-స్టార్ భద్రతా రేటింగ్ పొందింది. పెద్దల సేఫ్టీలో 32 పాయింట్లకు 29.5 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు 43.66 పాయింట్లు సాధించింది.

టాటా కర్వ్ పరీక్షలో ముందు వైపు కూర్చున్న ప్రయాణికులు (డమ్మీ) సురక్షితంగా ఉండగా, డ్రైవర్ కుడి కాలుకు కనీస రక్షణ లభించింది. పిల్లల సేఫ్టీలో టాటా కర్వ్ ఎస్‌యూవీ మంచి పనితీరును కనబరిచింది. కర్వ్ ఎస్‌యూవీలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), TPMS తో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి.
సిట్రాన్ బసాల్ట్ ధర: సిట్రాన్ బసాల్ట్ ఎస్‌యూవీ కూపే ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.13.83 లక్షల వరకు ఉంది. ఇది బసాల్ట్ 1.2 పీయూ, బసాల్ట్ ప్లస్, బసాల్ట్ టర్బో ప్లస్, బసాల్ట్ టర్బో ఏటీ ప్లస్, బసాల్ట్ టర్బో మాక్స్ సహా అనేక వేరియంట్‌ల ఎంపికను కలిగి ఉంది.
టాటా కర్వ్ ధర: టాటా కర్వ్ ఎస్‌యూవీ కూపేలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. డీజిల్ ఇంజిన్ ధరలు రూ.11 లక్షల నుంచి రూ.19 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ ధరలు రూ.10 లక్షల నుంచి రూ.19 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: సేఫ్టీ విషయంలో టాటా కర్వ్ 5-స్టార్ రేటింగ్‌తో సిట్రాన్ బసాల్ట్‌ను (4-స్టార్) అధిగమించింది. ధరల విషయానికి వస్తే, సిట్రాన్ బసాల్ట్ ప్రారంభ ధర తక్కువగా ఉన్నప్పటికీ, టాటా కర్వ్ మరింత విస్తృతమైన ధరల శ్రేణిలో డీజిల్ ఆప్షన్ కూడా అందిస్తోంది. మీరు సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే టాటా కర్వ్ మంచి ఎంపిక కావచ్చు. బడ్జెట్ తక్కువగా ఉండి, కూపే ఎస్‌యూవీని కోరుకుంటే సిట్రాన్ బసాల్ట్‌ను చూడొచ్చు.


Click it and Unblock the Notifications








