భారత సైన్యానికి ఎంతో ఇష్టమైన కారు.. 20 ఏళ్లు దాటినా తగ్గని క్రేజ్..కొనేందుకు పోటీ పడుతున్న జనాలు

భారతీయ SUV కార్ల మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కారు మహీంద్రా స్కార్పియో. గత 2002 నుంచి అమ్మకానికి ఉన్న మహీంద్రా స్కార్పియో కారును భారత పోలీసు అధికారులు, సైనికులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ రియల్ హీరోలకే కాకుండా, సినిమా హీరోలు, విలన్లకు కూడా మహీంద్రా స్కార్పియో అంటే చాలా ఇష్టం. మహీంద్రా స్కార్పియో కారు కండలు తిరిగినట్లు ఉండే దృఢమైన రూపమే దీనికి ప్రధాన కారణం.

విడుదలై 20ఏళ్లు గడిచిపోయినా నిన్ననే విడుదల చేసినట్లుగా మహీంద్రా స్కార్పియో కారును భారతీయ వినియోగదారులు ఇప్పటికీ పోటీ పడి కొంటున్నారు. తాజాగా విడుదలైన 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన మహీంద్రా స్కార్పియో కార్ల అమ్మకాల నివేదిక దీన్ని కన్ఫాం చేస్తుంది.

Mahindra Scorpio

ఈ అమ్మకాల నివేదిక ప్రకారం.. మహీంద్రా సంస్థ 2025 ఏప్రిల్‌లో మొత్తం 15,534 స్కార్పియో కార్లను విక్రయించింది. దీని ద్వారా 2025 ఏప్రిల్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో మహీంద్రా స్కార్పియో 5వ స్థానాన్ని దక్కించుకుంది.

అయితే కేవలం కొద్ది తేడాతోనే మహీంద్రా స్కార్పియో కారు 4వ స్థానాన్ని కోల్పోయింది. ఈ టాప్ 10 కార్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి ఎర్టిగా. దీని అమ్మకాల సంఖ్య 15,780 మాత్రమే. అంటే కేవలం 246 యూనిట్ల తేడాతోనే మహీంద్రా స్కార్పియో 4వ స్థానాన్ని కోల్పోయింది.

Mahindra Scorpio Sales

ప్రస్తుతానికి మహీంద్రా స్కార్పియో కారు మొత్తం 2 మోడళ్లలో విక్రయించబడుతోంది. అవి మహీంద్రా స్కార్పియో ఎన్, మహీంద్రా స్కార్పియో క్లాసిక్. ఇందులో మహీంద్రా స్కార్పియో ఎన్ కారు ధర ఎక్కువ.

దీని ప్రారంభ స్థాయి వేరియంట్ ధర 13.99 లక్షల రూపాయలు. అదే సమయంలో టాప్ వేరియంట్ ధర 25.15 లక్షల రూపాయలు. మరోవైపు మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కారు ప్రారంభ స్థాయి వేరియంట్ ధర 13.62 లక్షల రూపాయలు కాగా, టాప్ వేరియంట్ ధర 17.72 లక్షల రూపాయలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

Mahindra Scorpio Sales

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం: మహీంద్రా స్కార్పియో SUV కారు స్ట్రాంగ్ బాడీతో రూపొందించబడింది. అంతేకాకుండా పవర్ ఫుల్ ఇంజిన్ ఆప్షన్‌లు కూడా ఈ కారులో ఉంటాయి. ఇంకా ఈ కారు లోపలి భాగంలో మంచిస్పేస్ లభిస్తుంది. దీనితో పాటు ఆఫ్-రోడ్ సామర్థ్యాలలో కూడా మహీంద్రా స్కార్పియో అగ్రస్థానంలో ఉంది. ఇవన్నీ కలిసి వినియోగదారులు చెల్లించే డబ్బుకు తగిన విలువైన ఉత్పత్తిగా మహీంద్రా స్కార్పియోను మార్చాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, May 10, 2025, 12:15 [IST]
English summary
Scorpio mania continues makes it to top 5 selling cars in india
Read more on: #india #auto news #mahindra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+