యూత్‌లో సూపర్ హిట్, అమ్మకాల్లో టాప్ గేర్.. 23 ఏళ్లుగా అదే జోరు కొనసాగిస్తున్న స్కార్పియో
భారతదేశంలో మహీంద్రా స్కార్పియో కారుకు పరిచయం అవసరం లేదు. ఇది ఒక స్టార్ హీరో రేంజ్‌లో జనంలోకి దూసుకెళ్లింది. అప్పట్లో ఫ్యాక్షన్ సినిమా అంటే స్కార్పియోలు గాల్లోకి ఎగరాల్సిందే. అవి ఎంత ఎగిరితే ఆ సినిమా అంత హిట్ అన్నంత పాపులారిటీ సంపాదించుకున్నాయి.
ప్రస్తుతం ఈ కారు రెండు వెర్షన్లలో దడదడలాడిస్తోంది. అవి మహీంద్రా స్కార్పియో ఎన్, మహీంద్రా స్కార్పియో క్లాసిక్. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరం మొదటి ఆరు నెలల (జనవరి-జూన్) స్కార్పియో కారు అమ్మకాల రిపోర్ట్ ఇప్పుడు విడుదలైంది.

ఈ నివేదిక ప్రకారం మహీంద్రా సంస్థ 2025వ సంవత్సరం మొదటి అర్ధభాగంలో మొత్తం 85,648 స్కార్పియో కార్లను విక్రయించింది. ఈ సంఖ్య గత 2024సంవత్సరం మొదటి అర్ధభాగంలో 85,326గా ఉంది. అంటే, మహీంద్రా స్కార్పియో అమ్మకాల్లో పెద్దగా వృద్ధి లేదా తగ్గుదల కనిపించలేదు. గత 2024వ సంవత్సరం మొదటి అర్ధభాగంలో లాగే, దాదాపు ప్రస్తుత 2025వ సంవత్సరం మొదటి అర్ధభాగంలో కూడా మహీంద్రా స్కార్పియో కారు అమ్మకాలు కొనసాగాయని చెప్పవచ్చు.
ఇక్కడ పేర్కొన్న గణాంకాలు మహీంద్రా స్కార్పియో (మహీంద్రా స్కార్పియో ఎన్ + మహీంద్రా స్కార్పియో క్లాసిక్) కారు మొత్తం అమ్మకాలు. భారత మార్కెట్లో ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో ఎన్ కారు ప్రారంభ వేరియంట్ ధర రూ.13.99 లక్షలుగా ఉంది. అదే సమయంలో, దీని టాప్ వేరియంట్ ధర రూ.25.62 లక్షలుగా ఉంది. మహీంద్రా స్కార్పియో ఎన్ కారు 7 సీటర్ ఆప్షన్‌లో లభిస్తుంది.

మరోవైపు, మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కారు ప్రారంభ వేరియంట్ ధర రూ.13.77 లక్షలుగా ఉంది. అదే సమయంలో దీని టాప్ వేరియంట్ ధర రూ.17.72 లక్షలుగా ఉంది. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కారు 9 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ వార్తలో పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.
భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో కారు 2002వ సంవత్సరం నుండి విక్రయించబడుతోంది. అంటే, దాదాపు 23 సంవత్సరాలుగా ఈ కారు విక్రయాల్లో ఉంది. నిరంతర అప్‌డేట్‌లు, ఇతర కారణాల వల్ల మహీంద్రా స్కార్పియో కారు అమ్మకాలు ఇప్పటికీ అద్భుతంగా ఉన్నాయి. భారత మార్కెట్లో టాటా హారియర్, ఎంజీ హెక్టర్ వంటి కార్లకు, మహీంద్రా స్కార్పియో ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారత మార్కెట్లో ఒక స్ట్రాంగ్, పటిష్టమైన ఎస్‌యూవీ కారును కొనాలనుకునే కస్టమర్లకు మహీంద్రా స్కార్పియో ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. పవర్ ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, అద్భుతమైన ఫీచర్లు, ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలైన సీటింగ్ అమరిక వంటివి ఈ కారు బలాలు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








