బుడ్డోడు అనుకున్నారు.. కానీ పెద్దోళ్లనే చెడుగుడు ఆడేశాడు..ముగ్గురు మొనగాళ్లతో మార్కెటును దున్నేశాడు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే పాత దిగ్గజాలకే సవాల్ విసురుతూ కియా (Kia) సంస్థ అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. కేవలం ఆరేళ్ల కాలంలోనే ఈ కొత్త కుర్రాడు పెద్ద పెద్ద కంపెనీలకు చెమటలు పట్టిస్తున్నాడు. దీనికి నిదర్శనం ఇటీవల విడుదలైన 2025 అక్టోబర్ నెల అమ్మకాల నివేదిక (Sales Report). ఈ నివేదిక ప్రకారం కియా ఇండియా సంస్థ ఈ నెలలో తన చరిత్రలోనే అత్యధికంగా కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ఈ అనూహ్య వృద్ధికి కారణమేంటి? కియా సంస్థ ఏకంగా 30 శాతం పెరుగుదలతో ఎలా దూసుకుపోతోంది? ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం.

భారత మార్కెట్లో అతి తక్కువ సమయంలోనే ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటిగా మారింది కియా. కాడివాడి పోర్టల్‌లో తాజాగా విడుదలైన కియా ఇండియా కంపెనీ ప్రస్తుత 2025 అక్టోబర్ నెలకు సంబంధించిన సేల్స్ రిపోర్ట్ దీనికి నిదర్శనం.

Shock for Maruti Hyundai Kia Records Highest Monthly Sales in October

దీని ప్రకారం చూస్తే కియా ఇండియా కంపెనీ ప్రస్తుత 2025 అక్టోబర్ నెలలో మొత్తంగా 29,556 కార్లను విక్రయించి సత్తా చాటింది. ఇది కియా ఇండియా కంపెనీకి అత్యధిక నెలవారీ అమ్మకాల సంఖ్య. ఇంతకు ముందు ఏ నెలలోనూ కియా ఇండియా కంపెనీ ఇంత ఎక్కువ కార్లను విక్రయించలేదు.

కియా కంపెనీ భారత మార్కెట్లో తన మొదటి కారును (కియా సెల్టోస్ ఎస్‌యూవీ) గత 2019లో మాత్రమే ప్రవేశపెట్టింది. కేవలం 6 సంవత్సరాలు మాత్రమే గడిచినప్పటికీ, కియా ఇండియా కంపెనీ భారీ అమ్మకాల సంఖ్యను నమోదు చేయడం ప్రారంభించింది.

Shock for Maruti Hyundai Kia Records Highest Monthly Sales in October

గత 2024 అక్టోబర్ నెలలో కియా ఇండియా కంపెనీ మొత్తంగా కేవలం 22,735 కార్లను మాత్రమే విక్రయించింది. ప్రస్తుతం ఆ సంఖ్య 29,556కి పెరిగింది, అంటే 6,821 కార్లు అదనంగా విక్రయించబడ్డాయి. దీని ద్వారా కియా ఇండియా కంపెనీ అమ్మకాల్లో 30 శాతం వృద్ధిని నమోదు చేసింది.

కియా ఇండియా కంపెనీ ఈ అద్భుతమైన విజయానికి 3 కార్లే ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. అవి కియా సోనెట్ (Kia Sonet), కియా కారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis), కియా సెల్టోస్ (Kia Seltos).

Shock for Maruti Hyundai Kia Records Highest Monthly Sales in October

ప్రస్తుత 2025 అక్టోబర్ నెలలో 12,745 కియా సోనెట్ కార్లు, 8,779 కియా కారెన్స్ క్లావిస్ కార్లు, 7,130 కియా సెల్టోస్ కార్లు విక్రయించబడ్డాయి. ఇందులో కియా కారెన్స్ క్లావిస్ కారు ఐసి ఇంజిన్, ఎలక్ట్రిక్ అనే 2 వెర్షన్లలో లభిస్తుంది. ఇక్కడ పేర్కొన్నది ఈ 2 వెర్షన్ల మొత్తం అమ్మకాల సంఖ్య.

కియా సోనెట్, కియా కారెన్స్ క్లావిస్, కియా సెల్టోస్ అనే 3 కార్లు కలిపి 28,654 యూనిట్ల అమ్మకాల సంఖ్యను నమోదు చేశాయి. మిగిలిన కార్లైన కియా సైరోస్ (Kia Syros), కియా కార్నివాల్ (Kia Carnival), కియా ఈవి6 (Kia EV6), కియా ఈవి9 (Kia EV9) వంటి కార్లన్నీ కలిపి 902 యూనిట్ల అమ్మకాల సంఖ్యను నమోదు చేశాయి.

దీని ద్వారానే ప్రస్తుత 2025 అక్టోబర్‌లో కియా ఇండియా కంపెనీ 29,556 అనే మొత్తం అమ్మకాల సంఖ్యను నమోదు చేసింది. దీని ద్వారా భారత మార్కెట్లోని ప్రముఖ కార్ల కంపెనీలైన మారుతి సుజుకి (Maruti Suzuki), టాటా మోటార్స్ (Tata Motors), మహీంద్రా (Mahindra), హ్యుందాయ్ (Hyundai), టయోటా (Toyota) వంటి కంపెనీలకు కియా ఒక పెద్ద పోటీదారుగా మారింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారత మార్కెట్లో కియా కంపెనీ విక్రయించే కార్లు, వినియోగదారులు చెల్లించే ధరకు విలువైన ఉత్పత్తిగా భావిస్తున్నారు. దీని కారణంగానే కియా కంపెనీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయపడుతోంది.

More from DriveSpark

Article Published On: Sunday, November 2, 2025, 9:43 [IST]
English summary
Shock for maruti hyundai kia records highest monthly sales in october
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+