Hyundai : ఫుల్ ట్యాంక్ చేస్తే హైదరాబాద్ టూ- విజయవాడకు రెండుసార్లు వెళ్లిరావొచ్చు

Hyundai : ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ ను ఎలక్ట్రిక్ కార్లు ఏలుతున్నా.. పెట్రోల్ కార్లకు మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ ప్రపంచ మార్కెట్‌లో ఒక సంచలన కారును విడుదల చేసింది. ఈ హైబ్రిడ్ SUVని ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే నేరుగా హైదరాబాద్ - విజయవాడకు రెండుసార్లు వెళ్లిరావొచ్చు. మధ్యలో ఎక్కడా పెట్రోల్ నింపాల్సిన అవసరం లేదు.

ఈ కారు హ్యుందాయ్ మోటార్స్ హైబ్రిడ్ SUV - హ్యుందాయ్ పాలిసేడ్(Hyundai Palisade). ప్రస్తుతం హ్యుందాయ్ భారతదేశంలో హైబ్రిడ్ కార్లను విక్రయించడం లేదు. కానీ, భారత రాష్ట్ర ప్రభుత్వాలు హైబ్రిడ్ కార్లను ప్రోత్సహిస్తున్న తీరు చూస్తుంటే.. వాటి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, హ్యుందాయ్ కూడా తన హైబ్రిడ్ కారును ఇండియాకు తీసుకురావచ్చు. ఇటీవల కంపెనీ తన హైడ్రోజన్ కారు హ్యుందాయ్ నెక్సో(Hyundai Nexo)ను కూడా ఇండియాలో టెస్ట్ చేయడం ప్రారంభించింది.

Hyundai Palisade 2026

హ్యుందాయ్ పాలిసేడ్ రేంజ్ : హ్యుందాయ్ మోటార్స్ ఈ హైబ్రిడ్ కారు హ్యుందాయ్ పాలిసేడ్. కంపెనీ ఇటీవల దీని సెకండ్ జనరేషన్ మోడల్‌ను గ్లోబల్ స్థాయిలో ప్రదర్శించింది. ఈసారి కారు డిజైన్ నుంచి ఫీచర్ల వరకు అనేక మార్పులు చేశారు. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఈ కారు ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే దాదాపు 1,000కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. భారతదేశంలో ఢిల్లీ నుండి పాట్నా దూరం కూడా దాదాపు అంతే ఉంటుంది.

హ్యుందాయ్ పాలిసేడ్ ఫీచర్లు : హ్యుందాయ్ పాలిసేడ్ హైబ్రిడ్ ఒక 7-సీటర్ కారు. అయితే ఇందులో 8 మంది కూడా కూర్చోవచ్చు. ఇది 3-రో సీటింగ్ కలిగి ఉంది. దాని పాత వెర్షన్ తో పోలిస్తే ఈ సారి 2.5 అంగుళాలు పొడవుగా ఉంది. ఇది మరింత బోల్డ్ గ్రిల్, LED DRLలు, ఫ్లాట్ హెడ్‌ల్యాంప్‌లు, యాక్టివ్ ఎయిర్‌ఫ్లోను కలిగి ఉంది.

Hyundai Palisade Run

ఈ కారు ఇంటీరియర్‌ను చాలా ప్రీమియంగా తయారు చేశారు. హోలిస్ట్రీకి లెదరైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇందులో 12.3 అంగుళాల డ్యూయల్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. కూల్డ్ వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రతి సీటింగ్ లైన్‌లో 100W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి. ఈ కారులో మీకు బోస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ లభిస్తుంది.

హ్యుందాయ్ పాలిసేడ్ ఇంజన్ పవర్ : హ్యుందాయ్ పాలిసేడ్‌లో కంపెనీ మొదటిసారిగా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందించింది. దీని కోసం రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. అలాగే 2.5 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ కూడా ఉంది. దీని ఇంజన్ 262 బీహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే హైబ్రిడ్ సిస్టమ్‌తో కలిపి దీని పవర్ 329 బీహెచ్‌పికి పెరుగుతుంది.

Hyundai Palisade Side

ఈ కారులో ఒక స్టే మోడ్ (Stay Mode) కూడా ఉంది. ఇది కారును చాలా వరకు ఎలక్ట్రిక్ కారు ఎక్స్పీరియన్స్ ని కలిగిస్తుంది. పార్కింగ్ సమయంలో కూడా కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్‌ను ఎక్కువసేపు ఉపయోగించడానికి ఇది అనుమతిస్తుంది. ఒకవేళ ఈ కారు భారతీయ మార్కెట్‌లోకి వస్తే ఇది మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara) హైబ్రిడ్ కారుతో పోటీపడుతుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, April 25, 2025, 7:02 [IST]
English summary
Shocking range hyundai hybrid suv can go non stop from delhi to patna on a single tank
Read more on: #hyundai #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+