వీటిలో ఒక్క కారును కొన్న అందరూ మిమ్మల్ని చూసి కుళ్లుకుంటారు.. చేతికి వచ్చాయంటే మీరు అదృష్టవంతులే
భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా స్కోడా కార్లు ఎప్పటినుంచో మంచి డిమాండ్‌ను పొందుతున్నాయి. దశాబ్దాలుగా ఆకట్టుకునే డిజైన్‌లు, నాణ్యమైన నిర్మాణం, నమ్మకమైన పనితీరుతో ఈ బ్రాండ్ వినియోగదారుల మనసు గెలుచుకుంది. కాలానికి అనుగుణంగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో తన మోడళ్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, మార్కెట్లో తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది. ఇటీవల స్కోడా, భారత మార్కెట్లో అడుగుపెట్టిన 25వ వార్షికోత్సవం, అలాగే ప్రపంచవ్యాప్తంగా 130 సంవత్సరాల విజయగాథను పురస్కరించుకొని, ప్రత్యేక ఉత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా, స్కోడా ఆటో ఇండియా తన మూడు ప్రముఖ మోడళ్లకు పరిమిత ఎడిషన్ వెర్షన్‌లను విడుదల చేసింది. ఇవి కేవలం లుక్ పరంగా మాత్రమే కాకుండా, ప్రత్యేక కలర్ స్కీమ్‌లు, ప్రత్యేక డిజైన్ టచ్‌లు, అదనపు ప్రీమియం ఫీచర్లతో మరింత ప్రత్యేకతను పొందాయి.
స్కోడా కుషాక్, స్లావియా, కైలాక్ మోడళ్లను ప్రత్యేక పరిమిత ఎడిషన్‌ల రూపంలో కొత్త లుక్‌తో పరిచయం చేసింది. ప్రతి మోడల్ ఉత్పత్తి కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయడంతో వీటి విలువ మరింత పెరిగింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లు ప్రత్యేకంగా 25వ వార్షికోత్సవ బ్యాడ్జ్‌తో, మరింత ప్రీమియం అనుభూతిని కలిగించేలా తయారయ్యాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్ల ద్వారా స్కోడా, తన వారసత్వాన్ని, భవిష్యత్తు ఆవిష్కరణలను తెలియజేస్తుంది.

ఈ ఎడిషన్లు కుషాక్, స్లావియా కోసం మోంటే కార్లో ట్రిమ్‌లపై, కైలాక్ కోసం ప్రెస్టీజ్, సిగ్నేచర్+ ట్రిమ్‌లపై ఆధారపడి రూపుదిద్దుకున్నాయి.డిజైన్, ఫీచర్ల పరంగా ఈ లిమిటెడ్ ఎడిషన్లు ప్రత్యేకంగా మెరుస్తాయి. వీటికి అదనంగా, ఉచితంగా ఇచ్చే యాక్సెసరీస్ కిట్‌లో 360-డిగ్రీ కెమెరా, పుడిల్ ల్యాంప్స్, అండర్ బాడీ లైటింగ్, ప్రత్యేక బాడీ గార్నిష్‌లు ఉంటాయి. ఈ కిట్ కారుకి ప్రీమియం లుక్‌తో పాటు, మరింత ఫంక్షనల్ అప్‌గ్రేడ్‌ను అందిస్తుంది.
కుషాక్ మోంటే కార్లో లిమిటెడ్ ఎడిషన్ అందాన్ని చూసి ఎవరైనా కళ్ళు తిప్పుకోలేరు. శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్(MT/AT)తో MT ధర రూ. 16.39 లక్షలు (ఎక్స్-షోరూమ్), AT ధర రూ.17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), 1.5-లీటర్ టర్బో పెట్రోల్ పవర్‌ట్రెయిన్ ధర రూ.19.09 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి లభిస్తుంది. డీప్ బ్లాక్, టోర్నాడో రెడ్ ప్రీమియం కలర్ ఆప్షన్లు దీని స్పోర్టీ లుక్‌ను మరింత హైలైట్ చేస్తాయి.

స్లావియా మోంటే కార్లో లిమిటెడ్ ఎడిషన్ కూడా కుషాక్ మాదిరిగానే స్టైల్‌కి, పనితీరుకి కాంబినేషన్‌గా నిలుస్తుంది. 1.0-లీటర్ టర్బో పెట్రోల్(MT/AT), 1.5-లీటర్ DSG వేరియంట్లలో లభించే ఈ మోడల్, స్పోర్టీ లుక్‌తో ప్రీమియం ఫీల్‌ను ఇస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ధర రూ.15.63 లక్షలు, ఆటోమెటిక్ ధర రూ.16.73 లక్షలు, 1.5-లీటర్ DSG ధర రూ. 18.33 లక్షలు. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు.
కైలాక్ లిమిటెడ్ ఎడిషన్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ శక్తితో రోడ్డుపై మంచి పనితీరు అందిస్తుంది. ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ మోడల్‌ను ఏడు కలర్స్‌లలో పొందవచ్చు. ఫీచర్స్‌లో 360-డిగ్రీ కెమెరా, పుడిల్ ల్యాంప్స్, వార్షికోత్సవ బ్యాడ్జింగ్ వంటి ప్రీమియం టచ్‌లు ఉన్నాయి. కైలాక్ యానివర్సరీ ఎడిషన్ ధరలు రూ. 11.25 లక్షల నుంచి రూ. 12.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.



Click it and Unblock the Notifications








