అబ్బో చూస్కో మర్లా.. ఇంత పెద్ద కంపెనీ అయ్యిండి సేఫ్లీ లోపమా.. 25000కార్లను రీకాల్ చేసిన స్కోడా కంపెనీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తన వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. దేశీయ మార్కెట్‌లో సక్సెస్ ఫుల్ గా అమ్ముడవుతున్న స్కోడా స్లావియా, కుషాక్, కైలాక్ మోడళ్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఏకంగా 25,000 యూనిట్లను వెనక్కి పిలుస్తున్నట్లు ప్రకటించింది. ఇంత పెద్ద సంఖ్యలో కార్లను రీకాల్ చేయడానికి గల కారణం ఏమిటంటే...
ఈ మూడు మోడళ్ల కార్ల వెనుక సీటులో ఒక సమస్యను గుర్తించారు. ప్రమాదవశాత్తు కారు ముందువైపు నుంచి ఢీకొంటే, వెనుక సీటు బెల్ట్ బకిల్ లాచ్ ప్లేట్ విరిగిపోయే అవకాశం ఉంది. దీనివల్ల వెనుక సీటులో ప్రయాణిస్తున్న వారికి తీవ్రమైన గాయాలు కావచ్చు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్కోడా కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

స్కోడా ఆటో తెలిపిన వివరాల ప్రకారం, మే 24, 2024 నుండి ఏప్రిల్ 1, 2025 మధ్య ఉత్పత్తి చేయబడిన స్లావియా, కుషాక్, కైలాక్ కార్లను మాత్రమే వెనక్కి పిలుస్తున్నారు. సమస్య ఉన్న కార్ల యజమానులను కంపెనీ స్వయంగా సంప్రదిస్తుంది. అంతేకాకుండా, ఈ లోపాన్ని ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా రిపేర్ చేసి ఇచ్చే అవకాశం ఉంది.
స్కోడా కుషాక్ (Skoda Kushaq): ఇది SUV తరహా కారు. దీని ధర రూ.10.99 లక్షల నుండి రూ.19.01 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బో పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇది 18.09 నుండి 19.76 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది.

ఈ 5-సీట్ల కారులో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
స్కోడా స్లావియా (Skoda Slavia): ఇది సెడాన్ తరహా కారు. దీని ధర రూ.10.34 లక్షల నుండి రూ.18.24 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. లీటరుకు 18.73 నుండి 20.32 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. 10-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జర్, కీ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

స్కోడా కైలాక్ (Skoda Kylaq): ఇది కూడా SUV తరహా కారు. దీని ధర రూ.7.89 లక్షల నుండి రూ.14.40 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. లీటరుకు 15 నుండి 18 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








