ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి అమ్మకాలను చూడలేదు.. ఈసారి దుమ్ములేపిన స్కోడా
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచిని సరిగ్గా అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా తన వ్యూహాన్ని రూపొందించిన కంపెనీల్లో స్కోడా (Skoda) ఇప్పుడు ముందువరుసలో నిలుస్తోంది. యూరోపియన్ బ్రాండ్ అయినప్పటికీ, మేడ్ ఇన్ ఇండియా, ఫర్ ఇండియా అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన కుషాక్, స్లావియా, తాజా కైలాక్ మోడళ్లతో స్కోడా భారత వినియోగదారుల మనసు గెలుచుకుంది. ఈ మోడళ్ల వలన కంపెనీ కేవలం బ్రాండ్ ఇమేజ్‌ను కాకుండా, అమ్మకాల పరంగా కూడా బలమైన స్థానం సంపాదించింది. 2025 అక్టోబర్ నెలలో స్కోడా ఆటో ఇండియా తన చరిత్రలోనే అత్యధిక అమ్మకాల నెలగా రికార్డు సృష్టించింది. ఈ నెలలోనే 8,252 యూనిట్లు విక్రయించబడటం గమనార్హం. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, స్కోడా బ్రాండ్‌పై భారత వినియోగదారుల విశ్వాసానికి ప్రతీక.
ఇక జనవరి నుండి అక్టోబర్ 2025 వరకు మొత్తంగా 61,607 కార్లను మార్కెట్‌లో విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. సంవత్సరపు పది నెలల వ్యవధిలోనే స్కోడా తనకు తానే రికార్డు సృష్టించింది. ఈ స్థిరమైన వృద్ధికి ముఖ్య కారణం, కైలాక్. ఇది కంపెనీ మొట్టమొదటి సబ్-4 మీటర్ SUV. భారత మార్కెట్‌కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ మోడల్, కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో గట్టి పోటీతో స్కోడా అమ్మకాలను గణనీయంగా పెంచింది.

కుషాక్, స్లావియా ఇప్పటికే తమ విభాగాల్లో స్థిరమైన స్థానం సంపాదించగా, కైలాక్ ఆ ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. ధర, డిజైన్, ఫీచర్ల సమతుల్యతతో ఈ SUV యువతను, అలాగే ఫ్యామిలీ బాయర్లను ఆకర్షిస్తోంది. మొత్తం మీద, స్కోడా ఆటో ఇండియా ఇప్పుడు కేవలం యూరోపియన్ బ్రాండ్ కాదు, భారత వినియోగదారుల అంచనాలను అర్థం చేసుకున్న, వాటిని నెరవేర్చగల సక్సెస్‌ఫుల్ తయారీదారుగా మారింది.
ఒకప్పుడు అధిక మెయింటెనెన్స్ ఖర్చులు, స్పేర్ పార్ట్‌ల అందుబాటు సమస్యలు, సర్వీస్ ఖర్చుల కారణంగా చాలామంది వినియోగదారులు దూరంగా ఉంచిన స్కోడా బ్రాండ్ ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో తిరిగి నిలబడింది. గత కొన్ని సంవత్సరాల్లో కంపెనీ చేసిన వ్యూహాత్మక మార్పులు, ముఖ్యంగా ఇండియా 2.0 ప్రాజెక్ట్ అమలు, స్కోడాకు తిరుగులేని పునరుజ్జీవనం తీసుకువచ్చాయి. ఇప్పుడు స్కోడా షోరూమ్‌ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఒకప్పుడు ప్రశాంతంగా కనిపించిన షోరూమ్‌లు ఇప్పుడు వినియోగదారులతో కిక్కిరిసిపోతున్నాయి. కుషాక్, స్లావియా, కైలాక్ వంటి మోడళ్లు భారత మార్కెట్‌లో స్కోడాకు గట్టి స్థానం తెచ్చిపెట్టాయి. ఈ మేడ్-ఇన్-ఇండియా మోడళ్ల ద్వారా కంపెనీ ఇప్పటివరకు 2 లక్షలకుపైగా యూనిట్లు విక్రయించడం గమనార్హం. ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా స్కోడా తన కార్లను భారత రోడ్ల పరిస్థితులు, వినియోగదారుల అభిరుచులు, ధరల సెన్సిటివిటీని దృష్టిలో ఉంచుకుని రూపొందించింది.
ఫలితంగా, బ్రాండ్‌కి ఉన్న ఎక్స్‌పెన్సివ్ టు మెంటైన్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఇటీవలి కాలంలో అమల్లోకి వచ్చిన GST తగ్గింపు కూడా స్కోడాకు అనుకూలంగా మారింది. పన్ను నిర్మాణం 28% నుండి 18%కు తగ్గడంతో, స్కోడా మోడళ్ల ధరలు కొంత మేర తగ్గాయి. దీని వల్ల మరింత మంది వినియోగదారులు కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. ఈ మార్పులన్నీ కలసి స్కోడా ఆటో ఇండియాకు ఒక కొత్త దశను తెచ్చాయి.

అమ్మకాల పరంగా మంచి వేగాన్ని అందుకున్న స్కోడా ఆటో ఇండియా, ఇదే ఊపుతో రానున్న నెలల్లో మరిన్ని కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటికే మార్కెట్ స్పందనను, వినియోగదారుల అభిరుచులను బట్టి తమ ఉత్పత్తి వ్యూహాన్ని రూపొందించుకుంది. త్వరలోనే మధ్యతరగతి కుటుంబాలను ఆకట్టుకునే విధంగా మరిన్ని కాంపాక్ట్ SUVలు, సెడాన్‌లు, ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేసే అవకాశముంది.


Click it and Unblock the Notifications








