నౌకల్లో తరలివెళ్తున్న ఇండియా కార్లు.. రికార్డు స్థాయిలో ఎగుమతులు!

భారతదేశం ప్రస్తుతం కార్ల తయారీకి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఎదుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని కార్ల కర్మాగారాలు నిరంతరం ఉత్పత్తి చేస్తూ, దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు కూడా పెద్ద సంఖ్యలో కార్లను ఎగుమతి చేస్తున్నాయి. స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Skoda Auto Volkswagen India) ఈ విషయంలో ముందుంది.

చెక్ రిపబ్లిక్‌కు చెందిన స్కోడా ఆటో, జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడిన స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా కార్లను తయారు చేసి విక్రయిస్తోంది. ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయడం వల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గడంతో పాటు, ఒకే రకమైన టెక్నాలజీతో అనేక మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

Skoda Auto Volkswagen India

అంతేకాకుండా.. స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు భారతదేశాన్ని తమ కార్ల ఉత్పత్తి కేంద్రంగా భావిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడిన ఈ సంస్థల కార్ల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ వివరాలను ముంబై పోర్ట్ తాజాగా విడుదల చేసింది.

స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియాకు మహారాష్ట్రలో రెండు పెద్ద కార్ల ఉత్పత్తి కర్మాగారాలు ఉన్నాయి. ఇక్కడ తయారైన స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కార్లు గత 20 సంవత్సరాలకు పైగా ముంబై పోర్ట్ ద్వారానే విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

Skoda Volkswagen India

భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ప్రపంచ దేశాలు ఉపయోగించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 'మేడ్-ఇన్-ఇండియా' కార్యక్రమాన్నినిరంతరం అమలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా సంస్థ సహకారం ఎంతో ముఖ్యమైనది.

ముంబై పోర్ట్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు తమ పోర్ట్ నుంచి అత్యధిక సరుకును విదేశాలకు ఎగుమతి చేసిన సంస్థల్లో స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఒకటిగా నిలిచింది. ఈ భాగస్వామ్య సంస్థ ఇప్పటివరకు భారతదేశం నుంచి మొత్తం 6 లక్షల 75 వేలకు పైగా కార్లను విదేశాలకు పంపింది.

ముఖ్యంగా 2023లో 2022తో పోలిస్తే దాదాపు 38శాతం ఎక్కువ స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కార్లు భారతదేశం నుంచి ఎగుమతి చేయబడ్డాయి. 2023లో భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కార్లలో దాదాపు 30శాతం విదేశాలకు ఎగుమతి అయ్యాయి.

Skoda Kylaq

అలాగే, 2024లో 2023తో పోలిస్తే స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కార్ల ఎగుమతి 20శాతం అధికంగా ఉంది. అంతేకాకుండా, 2024లో భారతదేశంలో తయారైన మొత్తం స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కార్లలో 40శాతం ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఈ గణాంకాలన్నీ ముంబై పోర్ట్ ద్వారా అధికారికంగా విడుదల చేయబడ్డాయి.

స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గత 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు 43 వేలకు పైగా కార్లను భారతదేశంలో ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసింది. భారతదేశంలో తయారైన ఈ మేడ్-ఇన్-ఇండియా కార్లు ఆసియా ఖండంతో పాటు ఆఫ్రికా, ఉత్తర అమెరికా దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మాత్రమే కాకుండా, మరికొన్ని ఆటోమొబైల్ సంస్థలు కూడా భారతదేశాన్ని ఒక ముఖ్యమైన ఉత్పత్తి కేంద్రంగా గుర్తిస్తున్నాయి. ఎందుకంటే, భారతదేశంలో వాహనాలను ఉత్పత్తి చేయడం, వాటిని ఇతర దేశాలకు రవాణా చేయడం ఇతర దేశాలతో పోలిస్తే సులభంగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 3, 2025, 11:20 [IST]
English summary
Skoda auto volkswagen india leads car exports from india boosting make in india initiative
Read more on: #skoda #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+