Skoda Elroq EV: స్కోడా నుంచి ఎలక్ట్రిక్ కారు... దీనిలోని ఫీచర్లతో ప్రత్యర్థి కారు కంపెనీలకు వణుకు!

ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై భారత వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో అనేక వాహన తయారీ సంస్థలు ఈవీలతో ముందుకు వస్తున్నాయి. తాజాగా విదేశీ వాహన తయారీ సంస్థ స్కోడా కూడా ఓ కొత్త ఈవీని తీసుకురాబోతోంది. స్కోడ్ ఎల్రోక్(Skoda Elroq) పేరుతో రానున్న ఈవీని ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. గతేడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఈవీ వినియోగదారులను బాగా ఆకర్షించింది. ఇప్పుడు భారత్ లోనూ దీన్ని లాంఛ్ చేయాలనే ఆలోచనలో ఈ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. దీంట్లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, రేంజ్ తదితర విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఈ స్కోడా ఎల్రోక్ ఈవీ.. స్కోడా కారోక్ ఎస్‌యూవీకి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా తీసుకువచ్చారు. ఈ కారు పెట్రోల్, డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్స్‌తో ఉంటుంది. అయితే.. స్కోడా ఎల్రోక్‌ను భారత్‌లో లాంచ్ చేసే విషయంలో క్లారిటీ లేదు. ఈ ఎలక్ట్రిక్ కారులో 470 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉంటుంది. దీంట్లో ఎక్కువ లగేజ్‌ను క్యారీ చేయవచ్చు.

Skoda Elroq Launch

డిజైన్: స్కోడా ఎల్రోక్ ఈవీ 'టెక్- డెక్ ఫేస్' ఫీచర్ ఉంది. దీని రేడియేటర్ గ్రిల్ బ్లాక్ ప్యానెల్ ఉంటుంది. బానెట్‌పై లైన్స్, స్కోడా బ్యాడ్జ్ ఉండి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కారులో 0.26 సీడీ డ్రాగ్ కో-ఎఫీషియంట్ ఉంటుంది. ఇది 19 నుంచి 21 అంగుళాల blacked-out వీల్ ఆర్క్స్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు... 9 ఎక్స్‌టీరియర్ రంగుల్లో ఉంటుంది. Timiano Green అనేది దీంట్లో ఎక్స్‌క్లూజివ్ అని చెప్పవచ్చు.

ఫీచర్లు: ఈ ఎలక్ట్రిక్ కారు 13- అంగుళాల ఇన్‌ఫోటెయిన్మెంట్ డిస్‌ప్లే, ఏఐ- బేస్డ్ డిజిటల్ వాయిస్ అసిస్ట్, ఇంటిగ్రేటెండ్ ChatGPT, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆగ్యుమెంటెండ్ రియాలిటీ ఫంక్షన్స్, డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, యాంబియెంట్ వంటివి ఉంటాయి. ఈ కారు 10 ప్రామాణిక రంగుల్లో, ఐదు ప్రి-డిఫైన్డ్ మూడ్ సెట్టింగ్స్‌తో వస్తుంది.

Skoda Elroq Features

ఈ స్కోడ్ ఎల్రోక్ కారు బ్రేకింగ్ డ్యూటీస్‌ను పరిశీలిస్తే.. దీంట్లో ముందు వైపు ట్విన్- పిస్టన్ కాలిపర్స్‌తో వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇక వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. సేఫ్టీ కోసం ఈ కారు 9-ఎయిర్ బ్యాగ్స్‌తో వస్తుంది. అంతేగాకుండా దీంట్లో లేన్ అసిస్ట్ ప్లస్, అడాపిట్వ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఎమర్జెన్సీ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

బ్యాటరీ ప్యాక్: ఈ స్కోడా ఎలక్ట్రిక్ కారు.. మూడు బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తుంది. అవి 52 kWh, 59 kWh, 77 kWh. దీంట్లో ఎంట్రీ- లెవెల్ అయిన 52 kWh వేరియంట్.. సింగిల్ ఛార్జ్‌తో 170 కి.మీ.ల రేంజ అందిస్తుంది. దీంట్లో రియర్ యాక్సిల్ పై ఉండే ఎలక్ట్రిక్ మోటర్.. 167 bhp పవర్, 310 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Skoda Elroq Range

దీంట్లోని 59 kWh బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్‌తో 418 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. ఇక 77 kWh వేరియంట్... WLTP cycle తో 580 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. దీంట్లోని ఎలక్ట్రిక్ మోటార్ 282 bhp పవర్, 545 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కోడా ఎల్రోక్ ఈవీ... ఫోక్స్‌వేగన్‌కు చెందిన మాడ్యూలర్ ఎలక్రిఫికేషన్ టూల్ కిట్ (MEB) ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారు చేశారు. స్కోడా నుంచి ఎన్వ్యాక్ ఐవీ ఈవీ తర్వాత ఈ ఎల్రోక్ ఈవీ వచ్చే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 1, 2025, 12:34 [IST]
English summary
Skoda elroq electric car launching in india soon check expected features and price details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+