ఒక్క కారుకి అంత డిమాండ్ ఉందా? 25 ఏళ్లలోనే కంపెనీ రికార్డులు తారుమారు.. ఆ మోడల్ వెనుకున్న మాయ ఏమిటి?
ప్రస్తుతం వాహన తయారీ కంపెనీలు వరుసగా తమ అమ్మకాలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల సంస్థ స్కోడా కూడా తన సేల్స్ వివరాలను వెల్లడించింది. గత ఆరు నెలల్లో స్కోడా భారత ఆటోమొబైల్ రంగంలో ఎప్పుడూ లేని విధంగా తన విజయపథాన్ని మరింత బలంగా నిరూపించింది. ఈసారి అద్భుతమైన విక్రయ గణాంకాలతో కొత్త రికార్డును నెలకొల్పింది. 2025 ఏడాది జనవరి నుండి జూన్ వరకు స్కోడా మొత్తం 36,194 వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఇది ఏకంగా 134 శాతం పెరుగుదలను సాధించింది. 2022లో గరిష్ఠంగా 28,899 కార్లు అమ్ముడవడం ఒక చరిత్రగా నిలిచింది. అయితే, ఈసారి ఆ రికార్డుని కూడా బద్దలు కొట్టి స్కోడా తన సామర్థ్యాన్ని దేశవ్యాప్తంగా చూపించింది.
ఈ గణనీయమైన అమ్మకాల పెరుగుదల కారణంగా, కంపెనీ తొలిసారిగా భారతదేశంలోని టాప్ 7 కార్ బ్రాండ్ల జాబితాలో స్థానం సంపాదించింది. ఇది 25 ఏళ్ల పరిశ్రమ కార్యకలాపాలకు, స్థిరమైన నమ్మకానికి, వినియోగదారుల విశ్వాసానికి ప్రతీక అని చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేయడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం, అధునాతన టెక్నాలజీని అందించడం వంటి అంశాలే ఈ అత్యుత్తమ ఫలితాల వెనక ప్రధాన కారణాలు.

ప్రత్యేకించి ఈ ఏడాది స్కోడా అమ్మకాలు సుస్థిరంగా పెరగడం భారత మార్కెట్‌లో కంపెనీ ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. గత ఆరు నెలల్లో స్కోడా తన సుదీర్ఘ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. 2022లో సృష్టించిన రికార్డును అంటే ఆరునెలల్లో 28,899 కార్లు అమ్మిన ఘనతను ఈసారి అధిగమించింది. జూన్ 2025తో ముగిసిన ఆరు నెలల్లో మొత్తం 36,194 వాహనాలను విక్రయిస్తూ, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సేల్స్‌ను నమోదు చేసింది.
ఈ కంపెనీ చాలా ఏళ్లుగా అంతర్జాతీయంగా వాహనాలను తయారు చేసి విక్రయిస్తుంది. భారత్‌లో కూడా తన సత్తా చాటడానికి చాలా కృషి చేస్తుంది.ఈ తరుణంలో స్కోడా కి ఇది ఒక కీలక మలుపు. ఎందుకంటే, 25 ఏళ్లుగా ఇండియన్ మార్కెట్‌లో నిశ్చలంగా కొనసాగుతూ, ఇప్పుడు తొలిసారిగా దేశంలోని టాప్ 7 కార్ బ్రాండ్ల జాబితాలో స్థానం సంపాదించడం స్కోడా స్థిరమైన డిమాండ్‌ను ఆటో పరిశ్రమకు తెలిసేలా చేసినట్లయింది.

ఇండియాలో ఇన్ని అమ్మకాలు నమోదు చేయడానికి ప్రధానంగా కైలాక్(Kylaq) కీలక పాత్ర పోషించింది. స్కోడా మొట్టమొదటి కాంపాక్ట్ SUVగా, కేవలం 4 మీటర్ల కంటే తక్కువ పొడవు కలిగి ఉండి, భారత వినియోగదారుల అవసరాలకు సరిగ్గా సరిపోయేలా రూపకల్పన చేయబడింది. కైలోక్‌కి వచ్చిన విశేష స్పందన, దాని ప్రాక్టికల్ సైజ్, ఆకర్షణీయమైన డిజైన్, ఆక్టేవియా తరహా రిఫైన్మెంట్..ఈ మూడు కలసి స్కోడా అమ్మకాల దూకుడు కొనసాగించడానికి బలమైన ఆధారంగా నిలిచాయి.
అన్ని వర్గాల వారు కొనుగోలు చేయగలిగే విధంగా అందుబాటు ధరలో లభించడం, మెయింటనెన్స్ తక్కువగా ఉండటం వంటి వల్ల స్కోడా తన కొత్త కైలాక్ కాంపాక్ట్ SUVను ప్రధానంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో భారీగా విక్రయిస్తోంది. 2024 నవంబర్‌లో మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ కారు భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దాదాపుగా పూర్తిగా దేశీయంగానే తయారు చేయబడింది.

కంపెనీ ప్రసిద్ధ MQB A0 IN ప్లాట్‌ఫామ్‌పై దీన్ని నిర్మించింది. ఈ కాంపాక్ట్ SUVలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. సిటీ డ్రైవ్ నుంచీ పొడవైన రోడ్ల ప్రయాణాల వరకు అందరికీ సరిపడేలా, ఈ పవర్‌ట్రెయిన్ విశ్వసనీయమైన పనితీరును అందిస్తోంది. వినియోగదారులకు సరసమైన ధరలో, ఆకర్షణీయమైన SUV అనుభూతిని అందించడమే ఈ మోడల్ విజయ రహస్యం. ఇది మాత్రమే కాకుండా, స్కోడా తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండవ తరం కోడియాక్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన ఈ ఫ్లాగ్‌షిప్ SUV, ఇప్పుడు మరింత ప్రీమియమ్ రూపంలో స్పోర్ట్ లైన్, L,K అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కోడియాక్‌లో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ అధునాతన SUV ధర రూ.46.89 లక్షలు (ఎక్స్-షోరూమ్).


Click it and Unblock the Notifications








