అమ్మకాల్లో అదరగొడుతున్న స్కోడా కార్లు.. ఏకంగా 74 శాతం పెరిగిన సేల్స్‌.. ఎక్కువగా ఏ కారుని కొంటున్నారంటే?

క్రమక్రమంగా భారతీయ కస్టమర్లను ఆకట్టుకుంటూ వారికి చేరువైన విదేశీ కార్ల తయారీ సంస్థ స్కోడా. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన కొన్ని మోడళ్లకు భారత వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ కస్టమర్ బేస్‌ను మరింత బలపర్చుకోవడంపై దృష్టి సారించిందీ సంస్థ. ఇందులో భాగంగా వినియోగదారుల కోసం కొత్త కారు మోడళ్లను లాంఛ్ చేయనుంది. వాటిని అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల విడుదలైన స్కోడా జనవరి నెల సేల్స్ రిపోర్టర్ ఈ విషయాలు వెల్లడిస్తున్నాయి. ఇక వీటి పూర్తి వివరాలు ఏంటో చూసేద్దాం.

స్కోడా సంస్థ ఈ జనవరి నెలలో 2,377 కార్లను మాత్రమే విక్రయించింది. అయితే 2025 జనవరికి వచ్చే సరికి ఈ సంఖ్య 4,133కు పెరిగింది. ఇది 73.9శాతం వృద్ధి కావడం గమనార్హం. ఇది చాలా మంచి గ్రోత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Skoda Kylaq

జనవరి నెలలో భారత మార్కెట్లో బాగా అమ్మడైన టాప్-10 కార్ల సంస్థల్లో 9వ స్థానంలో స్కోడా నిలిచింది. అయితే... ఈ నెలలో స్కోడా సంస్థ 73.9శాతంతో అత్యధిక వృద్ధి శాతాన్ని నమోదు చేయడం గమనార్హం. మరే ఇతర కంపెనీ కూడా స్కోడా తరహాలో అధిక వృద్ధిని నమోదు చేయలేదు. రానున్న రోజుల్లో ఈ టాప్-10 స్థానాల్లో తమ వాహనాల సేల్స్‌తో స్కోడా మరింత పైకి ఎగబాకుతుందనడంలో ఆశ్చర్యం లేదు.

దీనికి కారణం ఈ కంపెనీ నుంచి త్వరలో రానున్న కైలాక్ మోడల్ అని చెప్పవచ్చు. ఈ స్కోడా కైలాక్ కారు డెలివరీలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయి. రానున్న నెలల్లో ఈ కారు మోడల్ సేల్స్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ స్కోడా కైలాక్ కారు ప్రారంభ ధర కేవలం రూ.7.89 లక్షలుగా ఉండడం బాగా కలిసొచ్చే విషయంగా చెప్పవచ్చు.

Skoda Kodiyaq

అదే సమయంలో ఈ కైలాక్ కారులో టాప్ వేరియంట్ ధర రూ.14.40 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్- షోరూమ్ ధరలు మాత్రమే. మరోవైపు స్కోడా సంస్థ నుంచి కారూక్ మోడల్ కారు కూడా భారత మార్కెట్లో విడుదలైంది. హ్యూందాయ్ వెన్యూ, కియా సోనెట్ కు పోటీనిచ్చేలా స్కోడా సంస్థ ఈ కొత్త కారును తీసుకువచ్చింది.

స్కోడా నుంచి రానున్న ఈ కైలాక్ మోడల్ కారు ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటినిచ్చేలా ఉంది. ఈ కారు టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రీజా, మహీంద్రా XUV 3XO, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లకు సేల్స్ విషయంలో సవాల్ విసరనుంది. ఇంకా మరెన్నో కార్లకు ఇది గట్టి పోటీని ఇస్తుంది.

Skoda 2025 January Sales Report

ఈ కైలాక్ మీకు చిన్న-పరిమాణ స్కోడా కుషాక్‌ని గుర్తు చేస్తుంది. అయితే కొన్ని కొత్త మార్పులు మాత్రం ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి కొత్త స్లిమ్డ్-డౌన్ గ్రిల్, DRLలు, హెడ్‌లైట్‌ల కోసం స్ప్లిట్ LED లైటింగ్ కాన్ఫిగరేషన్. కైలాక్ ఫ్రంట్ ఎండ్ కింది భాగంలో బ్లాక్ క్లాడింగ్, సిల్వర్ ఫాక్స్ బాష్ ప్లేట్ వంటివి ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ప్రీమియం కంపెనీ అయిన స్కోడా నుంచి కైలాక్ మోడల్ కారు.. అత్యంత సరసమైన ధరలో లభించే కారుగా చెప్పవచ్చు. ఈ కారు భారత వినియోగదారులను భారీగా ఆకర్షించే అవకాసం ఉంది. తద్వారా భారత మార్కెట్లో స్కోడా సంస్థ మరిన్ని మైలురాళ్లను చేరుకోనుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, February 6, 2025, 16:50 [IST]
English summary
Skoda january 2025 sales report recorded 74 percent growth highest ever check all details here
Read more on: #skoda #car sales #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+