ఆ కంపెనీ కార్ల అమ్మకాల్లో దీనిదే సగానికి పైగా వాటా.. జీఎస్టీ తర్వాత ఈ దీపావళికి ధర ఇంకా తగ్గించారు
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా మారి, బ్రాండ్ విక్రయాలలో 60 శాతానికి పైగా వాటాను అందిస్తున్న స్కోడా కైలాక్ ఎస్‌యూవీని కొనేవారికి గుడ్ న్యూస్. సాధారణంగా బాగా అమ్ముడయ్యే మోడళ్లకు కంపెనీలు ఆఫర్లు ఇవ్వవు.. కానీ ఈ దీపావళి పండుగ సీజన్‌లో స్కోడా ఇండియా, కైలాక్ ఎస్‌యూవీపై ఆకర్షణీయమైన తగ్గింపులను ప్రకటించింది.
కేవలం రూ.7.54 లక్షల ప్రారంభ ధరతో పాటు, లీటరుకు 20 కి.మీ మైలేజ్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న ఈ కారుపై ఏకంగా రూ.65,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. ఈ బంపర్ ఆఫర్ వివరాలు, స్కోడా కైలాక్ ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకుందాం.

మలయాళీ వ్యక్తి సూచించిన కైలాక్ అనే పేరుతో భారత మార్కెట్లోకి వచ్చిన స్కోడా కైలాక్ ఎస్‌యూవీ, ఊహించినట్లే దేశంలో బ్రాండ్‌కు అతిపెద్ద హిట్ మోడల్‌గా మారింది. ప్రస్తుతం స్కోడా మొత్తం విక్రయాలలో 60 శాతానికి పైగా వాటాను ఈ కారునే అందిస్తోంది. ఇంత పెద్ద విజయాన్ని సాధించినప్పటికీ, స్కోడా ఇండియా ఈ పండుగ సీజన్‌లో కైలాక్ కొనుగోలుదారుల కోసం బంపర్ ఆఫర్‌లను ప్రకటించింది.
ఈ దీపావళి పండుగ సందర్భంగా కైలాక్ ఎస్‌యూవీపై కస్టమర్‌లు రూ.65,000 వరకు డిస్కౌంట్లు, ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, లాయల్టీ బోనస్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కలిసి ఉంటాయి. ఈ తగ్గింపులు డీలర్‌షిప్‌లలో స్టాక్ లభ్యతను బట్టి మారవచ్చు.

కొత్తగా, సరసమైన ధరలో ఎస్‌యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. కైలాక్ ఎస్‌యూవీ జీఎస్టీ సంస్కరణల తర్వాత, ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.54 లక్షల నుండి లభిస్తోంది. ఇది భారతదేశంలో స్కోడా అందిస్తున్న అత్యంత చౌకైన ఎస్‌యూవీ.
కైలాక్ 1.0 లీటర్, త్రీ-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 115 బీహెచ్‌పీ ఎనర్జీనీ, 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌పై లీటరుకు 19.68 కి.మీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌పై లీటరుకు 19.05 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు, హైవే డ్రైవింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.

ప్రయాణికుల భద్రతకు స్కోడా ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే కైలాక్ క్రాష్ టెస్టుల్లో కూడా అద్భుతంగా రాణించింది. కైలాక్ ఎస్‌యూవీ భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో పెద్దలు, పిల్లల రక్షణలో 5-స్టార్ రేటింగ్ సాధించింది. స్టాండర్డ్‌గా వచ్చే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఫ్యామిలీకి పూర్తి భద్రతను అందిస్తాయి.
ఇందులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
కైలాక్ మాత్రమే కాకుండా, స్కోడా తమ ఇతర మోడళ్లపై కూడా ఈ దీపావళి సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించింది. కొడియాక్ ఎస్‌యూవీ రూ.4.5 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి.కుషాక్ ఎస్‌యూవీ మీద రూ.2.5 లక్షల వరకు తగ్గింపు, స్లావియా సెడాన్ పై రూ.2.25 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి.
ఆకర్షణీయమైన ధర, పండుగ డిస్కౌంట్లు, అద్భుతమైన మైలేజ్, పూర్తి భద్రతతో కూడిన స్కోడా కైలాక్ ఎస్‌యూవీ, మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్ వంటి దిగ్గజ ఎస్‌యూవీలతో పోటీ పడుతూ ఈ దీపావళికి సరైన ఎంపికగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications








