ఫార్చ్యూనర్‌కు కూడా సాధ్యం కాని ఘనత..ప్రత్యర్థులను పక్కకు నెట్టి ఎవరెస్ట్ ఛాలెంజ్ పూర్తి చేసిన స్కోడా
వాహనాలు కేవలం మనల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు చేర్చడమే కాదు, కొన్నిసార్లు అవి చేసే ప్రయాణాలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఒక అరుదైన ఘనతను చెక్ రిపబ్లిక్ బ్రాండ్ అయిన స్కోడా తన కొడియాక్ ఎస్‌యూవీతో సాధించింది. ఏకంగా ఎవరెస్ట్ పర్వతం నార్త్ ఫేస్ బేస్ క్యాంప్‌కు చేరుకొని స్కోడా ఆటో ఇండియా ఒక కొత్త చరిత్రను సృష్టించింది.
ఎవరెస్ట్ నార్త్ ఫేస్ బేస్ క్యాంప్‌కు చేరుకున్న భారతదేశం నుండి మొదటి పెట్రోల్ ఎస్‌యూవీగా స్కోడా కొడియాక్ నిలిచింది. ఈ అరుదైన ఘనతను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించాయి. ప్రతికూల వాతావరణం, మంచు గడ్డకట్టే చలి, కఠినమైన రహదారులు వంటి సవాళ్లను దాటుకుంటూభారతదేశం, నేపాల్, చైనా దేశాల మీదుగా 6,000కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఎవరెస్ట్ నార్త్ ఫేస్ బేస్ క్యాంప్‌కు చేరుకుంది.

ఈ సాహసోపేతమైన ప్రయాణం కొడియాక్ ఎస్‌యూవీ అడ్వాన్సుడ్ టెక్నాలజీ, యూరోపియన్ డిజైన్ ఎంత పవర్‌ఫులో చూపిస్తుంది. ఈ అరుదైన ఘనత కేవలం వాహనం ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చూపడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా భారతీయ వాహనాల పనితీరుకు ఇది ఒక గొప్ప విజయానికి ప్రతీక అని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.
స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో స్పోర్ట్‌లైన్, ఎల్&కే అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 46.89 లక్షలు, రూ. 48.69 లక్షలు. నిస్సాన్ ఎక్స్-ట్రైల్, టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్, జీప్ మెరిడియన్ వంటి ఫుల్-సైజ్ ఎస్‌యూవీలతో కొడియాక్ పోటీపడుతుంది.

కొడియాక్ 2.0 లీటర్, 4 సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7-స్పీడ్ డీఎస్‌జీ, ఏడబ్ల్యూడీ సిస్టమ్‌తో జత చేయబడింది. ఈ ఇంజిన్ 201 బీహెచ్‌పీ పవర్‌ను, 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. స్కోడా కొడియాక్‌ను రెండో తరం వెర్షన్‌లో పూర్తిగా రీడిజైన్ చేశారు.
కొడియాక్‌లో అదిరిపోయే ఫీచర్లున్నాయి. 13అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హెడ్-అప్ డిస్‌ప్లే, స్కోడా స్మార్ట్ డయల్స్, రోటరీ నాబ్‌లు, క్లైమేట్, మీడియా ఫంక్షన్ల కోసం డిజిటల్ స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ప్రీమియం 14-స్పీకర్ క్యాంటన్ సౌండ్ సిస్టమ్, యాంబియెంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

భద్రత విషయంలో కూడా కొడియాక్ చాలా నమ్మకమైనది. లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) తో ఇది వస్తుంది. దీంతో పాటు, 9 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ అసిస్ట్ వంటి ఫీచర్లను కూడా ఈ ఎస్‌యూవీలో స్కోడా అందించింది.
భారతదేశంలో ఎస్‌యూవీలకు, ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్‌కు డిమాండ్ పెరుగుతున్నందున స్కోడా కొడియాక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్కోడా భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించి 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. కొడియాక్ చేసిన ఎవరెస్ట్ ఛాలెంజ్ కంపెనీ పురోగతికి, ఆవిష్కరణకు, విశ్వసనీయతకు ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

కొడియాక్ సాహసం స్కోడా చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని లిఖించింది. ప్రస్తుతం కొడియాక్‌తో పాటు, కైలాక్, స్లావియా, కుషాక్ మోడళ్లను కూడా స్కోడా ఇండియాలో అందిస్తోంది. కస్టమర్లకు మరింత చేరువయ్యే వ్యూహంలో భాగంగా, కంపెనీ భారతదేశం అంతటా తన ఉనికిని విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా 172కి పైగా నగరాల్లో 300కి పైగా కస్టమర్ టచ్ పాయింట్‌లతో స్కోడా బలంగా ఉంది.
2025లో స్కోడా ఆటో ఇండియా తమ అతిపెద్ద హాఫ్ ఇయర్లీ అమ్మకాలను నమోదు చేసింది. 36,194 యూనిట్లను విక్రయించింది. ఇది 2024 మొదటి అర్ధభాగానికి పోలిస్తే 134% వృద్ధిని సూచిస్తుంది. అంతేకాకుండా, భారతదేశంలోని మొదటి ఏడు కార్ల తయారీదారులలో ఒకటిగా మారడానికి కూడా స్కోడాకు సాధ్యమైంది.


Click it and Unblock the Notifications








