ఇది కారు కాదు.. క్రేజ్‌కు కేరాఫ్ అడ్రస్.. దీని పేరు వింటేనే ప్రత్యర్థులకు దడ.. పైగా అప్ డేట్ అయి వస్తోంది
భారతీయ వాహన మార్కెట్లో తనదైన కొత్త వ్యూహాలతో ముందుకు దూసుకుపోతోంది చెక్ రిపబ్లికన్ కార్ల తయారీ సంస్థ స్కోడా. ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా మొదట వచ్చిన కుషాక్ పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఆ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్కోడా తన క్రేజీ కారును సరికొత్తగా ముస్తాబు చేస్తోంది.
మార్కెట్లోకి వచ్చి సుమారు నాలుగేళ్లు అయిన కుషాక్ ఇప్పుడు పోటీదారుల నుంచి గట్టి సవాల్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తన స్థానాన్ని తిరిగి పదిలం చేసుకోవడానికి, హ్యుందాయ్ క్రెటా వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు కుషాక్ ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. ఈ కారు డిజైన్, ఫీచర్లలో భారీ మార్పులతో వస్తుందని తెలుస్తోంది.

ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, ప్రస్తుత ఇంజిన్‌లతోనే గణనీయమైన కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ కొత్త కుషాక్‌లో సన్నని నిలువు స్లాట్‌లతో కూడిన కొత్త గ్రిల్, కనెక్ట్ చేయబడిన డీఆర్ఎల్ సెటప్‌తో రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు, లోవర్-సెట్ ఫాగ్ ల్యాంప్ అసెంబ్లీ ఉండే అవకాశం ఉంది.
కొత్త కొడియాక్ నుండి ప్రేరణ పొందిన కనెక్ట్ చేయబడిన టెయిల్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్, రియర్ బంపర్‌లు, కొత్తగా డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్‌తో ఈ ఎస్‌యూవీ మరింత లేటెస్టుగా కనిపించనుంది.

కారు వెలుపలే కాకుండా లోపల కూడా మార్పులు ఉంటాయని అంచనా. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త అప్‌హోల్‌స్టరీ, ట్రిమ్‌లు ఉంటాయి. ముఖ్యమైన ఫీచర్ అప్‌గ్రేడ్‌లలో లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), పనోరమిక్ సన్‌రూఫ్ ప్రధానంగా ఉంటాయి. ADAS ఫీచర్ ద్వారా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు లభిస్తాయి.
ఇక పనోరమిక్ సన్‌రూఫ్ మరింత మెరుగైన ట్రావెట్ ఎక్సపీరియన్స్ అందిస్తుంది. ఈ ఫీచర్లు క్రెటా వంటి పోటీదారులకు గట్టి సవాల్ విసిరే అవకాశం ఉంది. ప్రస్తుత మోడల్‌లో ఉన్న ఫీచర్లను కూడా కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో కొనసాగించనున్నారు.

10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్‌తో కూడిన ఆటో ఏసీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్‌గా), హిల్ హోల్డ్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్,సెన్సార్‌లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు కొత్త మోడల్‌లో కూడా ఉంటాయి.
మెకానికల్‌గా ఎటువంటి మార్పులు ఉండవు. ఇండియా కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన MQB A0 IN ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన కుషాక్‌లో ఉన్న అదే ఇంజిన్ ఆప్షన్లను స్కోడా కొనసాగిస్తుంది. అవి:1.0 లీటర్, 3-సిలిండర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్. ఇది 115 బీహెచ్‌పీ పవర్, 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో వస్తుంది.
1.5 లీటర్, 4-సిలిండర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్. ఇది 150 బీహెచ్‌పీ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డీఎస్జీ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో వస్తుంది.
ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్‌లోకి రానుంది. మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రిటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, టయోటా హైరైడర్ వంటి మోడళ్లకు కుషాక్ గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








