స్కోడా దెబ్బకు మిగతా కంపెనీలన్నీ సోడా తాగడం ఖాయం..కొత్త కారుతో మారుతి, టాటాలకు చుక్కలే

భారతీయ మార్కెట్‌లోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో స్కోడా కుషాక్ (Skoda Kushaq) ఒకటి. 2021లో తొలిసారిగా విడుదలైన ఈ కారు ఇప్పుడు కొత్త రూపంలో రాబోతోంది. స్కోడా సంస్థ కుషాక్ కారు ఫేస్‌లిఫ్ట్ (Facelift) మోడల్‌ను భారత రోడ్లపై ఇప్పటికే అనేకసార్లు టెస్టింగ్ చేసింది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ కొత్త మోడల్ వచ్చే నెల అంటే 2026 జనవరిలో విక్రయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనవరి రెండో భాగంలో ఈ కారు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కుషాక్ మోడల్ మార్కెట్‌లోకి వస్తే, మారుతి, టాటా వంటి సంస్థల కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Skoda Kushaq Facelift Launch in January 2026 ADAS and Panoramic Sunroof on the Way

ఫీచర్లలో మార్పులు
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో వినియోగదారులను ఆకర్షించేలా అనేక కొత్త ఫీచర్లను జోడించబోతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సింగిల్ ప్యాన్ సన్‌రూఫ్‌కు బదులుగా, పనోరమిక్ సన్‌రూఫ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఎస్‌యూవీ క్యాబిన్‌కు మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. దీంతో పాటు లెవల్ 2 ఏడీఏఎస్ (ADAS), 360-డిగ్రీ కెమెరా వంటి అధునాతన భద్రతా ఫీచర్లు కొత్తగా అందించే అవకాశం ఉంది.

ఇతర మార్పులలో ప్రస్తుతం ఉన్న 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు బదులుగా, పెద్దదైన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇవ్వొచ్చు. అలాగే, పాత మోడల్‌లో ఉన్న వైర్డ్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి బదులుగా, కొత్త మోడల్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ అందించే అవకాశం ఉంది.

అయితే, వైర్‌లెస్ సెల్‌ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు మాత్రం కొత్త మోడల్‌లోనూ యథావిధిగా కొనసాగవచ్చు.

Skoda Kushaq Facelift Launch in January 2026 ADAS and Panoramic Sunroof on the Way

ఇంజిన్లలో మార్పు లేదు
కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఫీచర్ల విషయంలో మెరుగుదల ఉన్నప్పటికీ, ఇంజిన్ ఆప్షన్లలో మాత్రం పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కుషాక్‌లో అందిస్తున్న 1.0-లీటర్ టీఎస్‌ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్, మరింత శక్తివంతమైన 1.5-లీటర్ టీఎస్‌ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు మాత్రమే ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోనూ కొనసాగుతాయి.

భద్రతకు ఫైవ్ స్టార్ రేటింగ్
స్కోడా కుషాక్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని భద్రత. ఈ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP), భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP) అనే రెండు సంస్థల క్రాష్ టెస్టులలోనూ పూర్తి 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందింది. కాబట్టి, అత్యంత సురక్షితమైన మిడ్-సైజ్ ఎస్‌యూవీని కోరుకునే కస్టమర్‌లకు కుషాక్ ఒక అద్భుతమైన ఎంపిక.

Skoda Kushaq Facelift Launch in January 2026 ADAS and Panoramic Sunroof on the Way

కొత్త ఫీచర్లు, మెరుగైన లుక్‌తో రాబోతున్న ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్, మార్కెట్‌లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా కర్వ్, టయోటా హైరైడర్ వంటి ప్రముఖ కార్లకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

నిస్సందేహంగా, స్కైడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ పానరోమిక్ సన్‌రూఫ్, ADAS వంటి అత్యాధునిక ఫీచర్లతో, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో మార్కెట్‌లోకి రావడం, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోని మారుతి, హ్యుందాయ్, కియా, టాటా వంటి దిగ్గజాల మధ్య పోటీని మరింత పదును పెట్టబోతోంది అని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, December 6, 2025, 10:48 [IST]
English summary
Skoda kushaq facelift launch in january 2026 adas and panoramic sunroof on the way
Read more on: #skoda #skoda kushaq #new car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+