మారుతి బ్రెజా సహా ఆ కార్లకు గట్టి పోటీ ఇస్తున్న స్కోడా కాంపాక్ట్ ఎస్‎యూవీ..ఫిబ్రవరిలో భారీగా పెరిగిన సేల్స్

భారత ఆటోమొబైల్ రంగం ఇటీవల కాలంలో బాగా వృద్ధి చెందింది. ఇక్కడ మిడ్ రేంజ్ కార్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. దీంతో అన్ని కంపెనీలు రూ.10లక్షల లోపు కార్లను మార్కెట్లో తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదే కోవలో స్కోడా ఆటో ఇండియా కూడా గతేడాది ఇండియాలో తన మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‎యూవీ అయిన స్కోడా కైలాక్‎ను లాంచ్ చేసింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి బడ్జెట్ ధరలోనే ఈ కారును తీసుకొచ్చింది.

ఈ స్కోడా కైలాక్ ను అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో తీసుకురావడంతో రికార్డు స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ ఎస్‎యూవీ బుకింగ్స్ ప్రారంభించిన పది రోజులకే 10వేల బుకింగ్స్ అందుకుంది. స్కోడా కంపెనీ ఫూణెలోని చకన్‎లో తన ఫ్యాక్టరీలో కొత్త స్కోడా కైలాక్ సబ్ ఫోర్ మీటర్ SUV ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. ఈ కారును కంపెనీ MQB A0 IN ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందిస్తున్నారు.

Skoda Kailoq Sales

స్కోడా కైలాక్ డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభం అయ్యాయి. దేశీయ మార్కెట్లో ఈ స్కోడా కైలాక్ కారుకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇటీవల ప్రధాన వాహన తయారీదారులు ఫిబ్రవరి నెలకు సంబంధించిన తమ కార్ల అమ్మకాల గణాంకాలను వెల్లడించాయి. స్కోడా కైలాక్ టాప్ 10 కాంపాక్ట్ SUVల జాబితాలో పదో స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి ఫ్రాంచైజీ 21,461 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

గత నెల (ఫిబ్రవరి 2025) కియా పికాంటో దాదాపు 3,636 యూనిట్లను విక్రయించింది. జనవరిలో అమ్ముడైన 1,242 యూనిట్లతో పోలిస్తే ఇది నెలవారీగా మంచి వృద్ధిని నమోదు చేసినట్లే. డిసెంబర్ 2024లో లాంచ్ కానున్న ఈ కారు కోసం 20,000 మంది కస్టమర్లు బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం స్కోడా కైలాక్ ఎస్‎యూవీ ధర దేశీయ మార్కెట్లో రూ.7.89లక్షల నుండి రూ.14.40 లక్షల (ఎక్స్ షోరూం) మధ్యలో ఉంది.

Skoda Kailoq Features

స్కోడా కైలాక్ పవర్ ఫుల్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. 6స్పీడ్ మాన్యువల్, 6స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్నాయి. ఈ కారు లీటరుకు 15 నుంచి 18కిలో మీటర్లకు మైలేజీని అందిస్తుంది. ఇందులో ఐదుగురు హాయిగా ప్రయాణించవచ్చు. లగేజీ కోసం ఈ ఎస్ యూవీలో 446లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ది బ్రిలియంట్ సిల్వర్, లావా బ్లూ, ఆలివ్ గోల్డ్, కార్బన్ స్టీల్ వంటి కలర్లలో కూడా లభిస్తుంది.

కొత్త కారులో ఎట్రాక్టివ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10-ఇంచ్), డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (8-ఇంచ్), ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.ఈ కారు మరింత అధునాతన ఎక్స్ టర్నల్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో స్ప్లిట్ LED హెడ్‌లైట్లు, స్లిమ్డ్-డౌన్ గ్రిల్, సిల్వర్ ఫాక్స్ బాష్ ప్లేట్ ఉన్నాయి.

Skoda Kailoq s February Sales Rise

ఈ కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సేఫ్టీ కోసం 6ఎయిర్ బ్యాగులు, ABS(యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ABD(ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), చైల్డ్ సీట్ మౌంట్స్, డిస్క/డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. స్కోడా కైలాక్ SUV మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 10, 2025, 17:00 [IST]
English summary
Skoda kailoq competes with maruti brezza february sales surge and features that will blow your mind
Read more on: #skoda #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+