భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో స్కోడా అదుర్స్.. 5 స్టార్ రేటింగ్ సాధించిన కొత్త మోడల్ కారు

కారు కొనే ముందు ఎవరైనా సరే.. దాని లుక్, మైలేజ్‌తో పాటు చూసే ముఖ్యమైన అంశం సేఫ్టీ. అన్నీ బాగున్నప్పటికీ.. ఆ కారు సురక్షితం కాదు అని తేలినప్పుడు దాన్ని కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ప్రమాదాలు జరిగినప్పుడు.. ప్రాణాపాయం కలగకుండా ఆ కారులో ఉండే సేఫ్టీ ఫీచర్లు కాపాడుతాయి. కాబట్టి, సేఫ్టీని చూసి కారు కొనుగోలు చేస్తాం. అయితే ఈ కార్లు ఎంత మేరకు సురక్షితమో తేల్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్. ఈ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ ఏ కారైనా పొందితే అది సేఫ్టీ‌లో తిరుగులేనిది అని అర్థం. తాజాగా ఈ క్రాష్ టెస్టులో స్కోడా సంస్థ నుంచి కైలాక్ కారు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. దాని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో స్కోడా కైలాక్ ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి దేశంలో సేఫెస్ట్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఒకటిగా నిలిచింది. అంతకుముందు మహీంద్రా సంస్థ నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన మహీంద్రా XUV 3 OX ఓ కారును అధిగమించి ఈ ఘనత సాధించింది స్కోడా కైలాక్ కారు. ఈ కారును జనవరి 27 నుంచి మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది స్కోడా సంస్థ.

Skoda Kylaq Got 5 Star Rating

అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో స్కోడా కైలాక్ 32 పాయింట్లకు గాను 30.88 పాయింట్లు సాధించింది. ఇక చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు స్కోర్ చేసింది. భారత్ ఎన్‌క్యాప్ ప్రోగ్రాం కింద టెస్ట్ చేసిన మొదటి స్కోడా మాడల్‌గా కైలాక్ నిలిచింది. అయితే.. అంతకుముందు స్కోడా నుంచి స్కోడా కుషక్, స్లేవియా మోడల్ కార్లు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించాయి.

అడల్ట్ ఆక్యుపెంట్‌కు సంబంధించి ఫ్రంటల్ ఆఫ్‌సెట్ బ్యారియర్ టెస్టులో 16 పాయింట్లకు గాను కైలాక్ కారు 15.035 పాయింట్లు సాధించింది. ఈ ఫలితాలతో ఆక్యుపెంట్ కంపార్ట్మెంట్, ఫుట్‌వెల్ సుస్థిరం అని తేలింది. సైడ్ మూవింగ్ డిఫార్మెబుల్ బ్యారియర్ టెస్టులో ఈ ఎస్‌యూవీ 16 పాయింట్లుకుగాను 15.840 పాయింట్లు సొంతం చేసుకుంది.

Skoda Kylaq Got 5 Star Rating In Bncap Crash Test

చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విషయంలో ఫ్రంటల్ ఆఫ్‌సెట్ బ్యారియర్ టెస్టులో 16 పాయింట్లకు గాను 16 పాయింట్లు సాధించి ఔరా అనిపించింది. 1.5 నుంచి మూడేళ్ల వయసు పిల్లలకు సంబంధించి సైడ్ మూవింగ్ డిఫార్మెబుల్ టెస్టులో 8 పాయింట్లకు 8 పాయింట్లు స్కోర్ చేసింది. ఇక చైల్డ్ సీట్ అసెస్మెంట్ విషయంలో 13 పాయింట్లకు ఈ కారు 9 పాయింట్లు సాధించింది.

ఈ క్రాష్ టెస్టులు 2024 డిసెంబర్ నెలలో నిర్వహించగా దాని ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. స్కోడా కైలాక్ కారుకు సంబంధించి అన్ని వేరియంట్లకు ఈ ఫైవ్ స్టార్ రేటింగ్స్ వర్తిస్తాయి. ప్రయాణికల సేష్టీ విషయంలో ఈ కారు నమ్మదగినది అని ఈ టెస్ట్ ద్వారా తెలిసింది.

Skoda Kylaq Got 5 Star Rating In Bncap Crash Test

స్కోడా కైలాక్ సేఫ్టీ ఫీచర్లు: స్కోడా కైలాక్ కారు 6 ఎయిర్ బ్యాగ్స్‌తో వస్తుంది. దీంతోపాటు ఇందులో ABS, ESC, EBD వంటివి కూడా ఉంటాయి. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, మోటార్ స్లిప్ రెగ్యులేషన్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టం, బ్రేక్ డిస్క్ వైపింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉంటాయి. కారులో 35కి పైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని స్కోడా సంస్థ చెబుతోంది.

స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ TSI ఇంజిన్ తో ఉంటుంది. ఇది 6- స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6- స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో అనుసంధానించి ఉంటుంది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.7.89 లక్షల నుంచి రూ. 14.4 0 లక్షల మధ్య ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 16, 2025, 10:22 [IST]
English summary
Skoda kylaq got 5 star rating in bharat ncap crash test know its full safety features here
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+