జనాలు ఈ కారును తెగ కొంటున్నారు.. సేఫ్టీలో 5-స్టార్, ధర కూడా అందుబాటులోనే!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో పెరుగుతున్న పోటీకి తగినట్టుగా, స్కోడా ఇండియా (Skoda India) తన బలాన్ని మరింత బలపరచుకుంటోంది. దేశీయంగా SUVల డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్త మోడళ్లను వరుసగా మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే స్కోడా ఇండియా గత సంవత్సరం నవంబర్ 2024లో ఎంతో అట్టహాసంగా కైలాక్ (Kylaq) అనే కాంపాక్ట్ SUVని విడుదల చేసింది. 4 మీటర్ల లోపు సైజులో వచ్చిన ఈ కారు, ప్రీమియం ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ పనితీరుతో SUV సెగ్మెంట్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది. విడుదలైనప్పటి నుంచి కైలాక్ మార్కెట్లో మంచి స్పందనను తెచ్చుకుంది. యూత్ నుంచి ఫ్యామిలీ కస్టమర్ల వరకు అందరినీ ఆకట్టుకోవడంలో ఈ SUV విజయవంతమైంది.

తాజాగా విడుదలైన సేల్స్ నివేదికల ప్రకారం, స్కోడా కైలాక్ కారు 2025 జూలై నెలలో బలమైన సేల్స్‌ను నమోదు చేసింది. సమీక్ష నెలలో స్కోడా 3,377 కైలాక్ యూనిట్లను విక్రయించింది. ఇది దీనికి ముందు నెలతో పోలిస్తే మెరుగైన వృద్ధి. స్కోడా భారతీయ మార్కెట్లో SUV సెగ్మెంట్‌లో తనదైన స్థానం సంపాదించుకుంటూ ముందుకు సాగుతోందనడానికి ఈ ప్రసిద్ధ మోడల్ అమ్మకాలు ఒక నిదర్శనంగా చెప్పవచ్చు.

Skoda Kylaq July 2025 Sales 3377 Units Recorded

SUV మార్కెట్లో ఉన్న గట్టి పోటీ పరిస్థితుల్లో కూడా ఈ వృద్ధి గణనీయమైందిగా భావిస్తున్నారు. స్కోడా కైలాక్ ప్రత్యేకతల్లో ఒకటి దాని ధర. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర కేవలం రూ. 8.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది స్కోడా లైన్‌అప్‌లో అత్యంత సరసమైన కారు. లగ్జరీ బ్రాండ్ అయిన స్కోడా నుంచి ఇంత ఆకర్షణీయమైన ధర వద్ద SUV లభించడం వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది.

ఇక కేవలం ధర మాత్రమే కాదు, భద్రతా ప్రమాణాల పరంగా కూడా కైలాక్ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. గ్లోబల్ మార్కెట్లోనూ సేఫ్టీకి ప్రాధాన్యతనిచ్చే స్కోడా, కైలాక్‌లో అత్యుత్తమ భద్రతా ఫీచర్లను సమీకరించింది. అందుకే ఇది ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా పరిగణించబడుతోంది.ఈ కారు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో కాలిక్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించడం దీని ప్రత్యేకతను మరింత బలపరుస్తోంది.

Skoda Kylaq July 2025 Sales 3377 Units Recorded

స్కోడా ఎప్పటినుంచో భద్రతపై రాజీ పడని కంపెనీగా ప్రసిద్ధి చెందగా, కైలాక్ దీనిని ముందుకు తీసుకెళ్లింది. దీనిలో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్, ప్రయాణికుల రక్షణతో పాటు, ఏ రోడ్ కండిషన్‌లోనైనా వాహనం స్థిరంగా ఉండేలా ఫీచర్లు పనిచేస్తాయి. ఈ కారణంగానే స్కోడా కైలాక్‌ను ప్రస్తుతం తన సెగ్మెంట్‌లో అత్యంత భద్రత కలిగిన కాంపాక్ట్ SUVలలో ఒకటిగా పరిగణిస్తున్నారు.

పనితీరు పరంగా కూడా కైలాక్ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 115 PS శక్తి, 178 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిటీ డ్రైవింగ్‌లోనూ, హైవే రైడ్స్‌లోనూ స్మూత్, పవర్‌ఫుల్ అనుభవం అందించడానికి ఈ ఇంజిన్ ప్రత్యేకంగా ట్యూన్ చేయబడింది. గేర్‌బాక్స్ ఆప్షన్స్ విషయానికొస్తే, ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

Skoda Kylaq July 2025 Sales 3377 Units Recorded

స్కోడా కైలాక్ SUV కేవలం భద్రత, పనితీరు పరంగానే కాకుండా ఫీచర్లలోనూ ప్రీమియం అనుభవాన్ని ఇస్తోంది. వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇందులో ఆధునిక టెక్నాలజీ, లగ్జరీ ఎలిమెంట్స్‌ను సమీకరించారు. దీనిలో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఆప్షన్లతో మరింత స్మార్ట్‌గా పనిచేస్తుంది. డ్రైవర్‌కు కావలసిన సమాచారాన్ని క్లియర్‌గా చూపించే 8-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, August 18, 2025, 13:10 [IST]
English summary
Skoda kylaq july 2025 sales 3377 units recorded full details here
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+