మారుతీ-టాటా మోటార్స్‌కు మేలు చేసిన స్కోడా.. 19.68 కి.మీ మైలేజ్ ఇచ్చే కారుపై షాకింగ్ డెసిషన్

భారతీయుల అభిరుచులు మారుతున్న వేళ, కార్లు కొనుగోలు చేసే వారు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ల నుండి కాంపాక్ట్ SUVలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇవి సాధారణంగా హ్యాచ్‌బ్యాక్ ధరకే అద్భుతమైన ఫీచర్లు, మంచి మైలేజ్‌లను అందించడం కారణంగా చాలా మందికి ఇవి ఫేవరెట్ కార్లుగా అవతరిస్తున్నాయి. అంతేకాకుండా, 4 మీటర్ల లోపు SUV విభాగం మార్కెట్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఒకటి. ఈ నేపథ్యంలో ఎస్‌యూవీ వినియోగదారులను ఆకట్టుకోవడానికి స్కోడా సంస్థ స్కోడా కైలాక్ (skoda Kylaq) కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే తాజాగా కంపెనీ ఈ కారు ధరలో మార్పులు చేసింది. కొన్ని వేరియంట్ల ధరలను పెంచగా, మరికొన్ని వేరియంట్ల ధరల్లో మాత్రం తగ్గింపులు చేశారు.

పెరిగిన ధరలతో కొన్ని వేరియంట్లను కొనుగోలు చేయడం ఇప్పుడు మరింత భారం కానుంది. అయితే అదే సమయంలో తగ్గించిన ధర కారణంగా కొన్ని మోడళ్లను తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. స్కోడా ఇండియా తాజా నిర్ణయంతో కైలాక్ SUVలో వేరియంట్ల వారీగా ధరల పరంగా కొన్ని మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. పెరిగిన, తగ్గిన ధరలను వేరియంట్ల వారీగా ఈ కింది కథనంలో ఒకసారి చూద్దాం.

Skoda Kylaq Selected Variants Gets Price Cut

ఈ కొత్త ధరలు ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 8.25 లక్షల నుండి రూ. 13.99 లక్షల వరకు ఉన్నాయి. ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకునే ఈ కారు నాలుగు వేరియంట్లలో క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్+, ప్రెస్టీజ్‌లలో అందుబాటులో ఉంది. అతి తక్కువ ధరతో ప్రారంభమయ్యే SUV మొత్తంగా ఏడు కలర్స్‌లలో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఉదాహరణకు, ఎంట్రీ-లెవల్ క్లాసిక్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకునే వారు ఇకపై అదనంగా రూ. 36,000 చెల్లించాల్సి ఉంటుంది.

ఇదే విధంగా, సిగ్నేచర్ వేరియంట్‌లో లావా బ్లూ, డీప్ బ్లాక్ కలర్ ఆప్షన్లు కూడా రూ. 26,000 ఎక్కువగా ధర కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ల ధరలు కూడా రూ. 36,000 పెరిగాయి. మరోవైపు, కంపెనీ వినియోగదారులకు ఊరటనిచ్చేలా కొన్ని వేరియంట్లపై ధర తగ్గింపులు కూడా చేసింది. సిగ్నేచర్+ మాన్యువల్ వేరియంట్‌పై రూ.15,000 తగ్గింపు లభించగా, అదే వేరియంట్ ఆటోమేటిక్ మోడల్‌పై రూ.5,000 తగ్గించారు.

Skoda Kylaq Selected Variants Gets Price Cut And Some Increased

ప్రెస్టీజ్ వేరియంట్‌ విషయంలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్ పై రూ.46,000, ఆటోమేటిక్ మోడల్ పై రూ.41,000 వరకూ తగ్గింపులు లభిస్తున్నాయి. ప్రెస్టీజ్ మాన్యువల్ వేరియంట్‌ పాతది రూ.13.35 లక్షల వరకు ఉండగా, కొత్త ధర రూ.12.89 లక్షల వరకు అయింది. అలాగే, దీని ఆటోమెటిక్ పాత ధర రూ.14.40 లక్షలు కాగా, ఇప్పుడు అది రూ.13.99 లక్షల వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

స్కోడా కైలాక్‌ 1.0-లీటర్, 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 113 bhp పవర్, 179 nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌‌కు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, మరొకటి 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జోడించారు. ఇది డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో వేరియేషన్లు కోరుకునే వినియోగదారులకు తగిన ఎంపికను అందిస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌ లీటరుకు 19.68 కి.మీ, ఆటోమేటిక్ లీటరుకు 19.05 కి.మీ మైలేజీని ఇస్తుంది.

Skoda Kylaq

ఈ కారులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సర్దుబాటు చేయగల ఎలక్ట్రిక్ సీట్లు, డ్యూయల్-స్పోక్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, లెథరెట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 7, 2025, 7:30 [IST]
English summary
Skoda kylaq selected variants gets price cut and some increased details
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+