ఇంత తక్కువ ధరకు స్కోడా కారు.. అందుకే జనాలు షోరూమ్‌లకు ఎగబడ్డారు!

ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత చౌకైన స్కోడా కారు ఏది అని అడిగితే, చాలామంది కైలాక్ (Skoda kylaq) అని చెప్పే అవకాశమే ఎక్కువ. దీనికి కారణం కేవలం ధర తక్కువగా ఉండటం మాత్రమే కాదు, స్కోడా లైన్‌అప్‌లో ఇతర మోడళ్లతో పోలిస్తే, ఈ కారు అందించే ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కూడా వినియోగదారులను గట్టిగా ఆకట్టుకుంటాయి. కాబట్టి, ఇది మార్కెట్లో మంచి ఆదరణను పొందుతోంది. ఇటీవలి సెప్టెంబర్ 2025 అమ్మకాలు కూడా ఈ డిమాండ్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో స్కోడా కైలాక్ 4,398 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీని ఫలితంగా, ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన స్కోడా కారుగా కైలాక్ నిలిచింది.

ఈ అమ్మకాలను సెప్టెంబర్ 2024తో పోల్చడం సాధ్యం కాదు, ఎందుకంటే కైలాక్ కస్టమర్ డెలివరీలు జనవరి 2025 నుండి మాత్రమే ప్రారంభమయ్యాయి. కానీ, నెలవారీ పోలిక చేయవచ్చు. ఆగస్టు 2025లో స్కోడా కైలాక్ 3,099 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది. ఈ సంఖ్యను సెప్టెంబర్ 2025తో పోల్చితే, ఈ నెలలో 4,398 యూనిట్లకు పెరిగింది. అంటే, కేవలం ఒక నెలలో 1,299 యూనిట్లు అదనంగా అమ్ముడయ్యాయి, ఇది 41.92 శాతం వృద్ధి.

Skoda Kylaq September 2025 Sales Recorded 4398 Units Full Details Inside

కైలాక్ కారు భారతీయ వినియోగదారుల కోసం స్కోడా బ్రాండ్ తీసుకొచ్చిన అత్యంత ఆకర్షణీయమైన, ధరకు అనుగుణమైన ఎంపికగా మారింది. తక్కువ ధర, ఆకట్టుకునే డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన పనితీరు కలిపి, కైలాక్ మార్కెట్లో మంచి స్థానాన్ని సంపాదించడానికి కారణమయ్యాయి. నెలవారీ అమ్మకాల్లో కూడా ఇది స్పష్టంగా ప్రత్యక్షమై, బ్రాండ్ కోసం సానుకూల మార్కెట్ రిస్పాన్స్‌ను నిరూపిస్తుంది.

మార్కెట్లో స్కోడా కైలాక్ ప్రస్తుత ప్రారంభ ధర కేవలం రూ. 7.55 లక్షలు ఎక్స్‌ఫోరూమ్ గా ఉంది. ధర తక్కువగా ఉన్నప్పటికీ, ఈ కారు పనితీరు పరంగా చాలా శక్తివంతంగా ఉంది. స్కోడా కైలాక్ 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికతో అందుబాటులో ఉంది, ఇది నగర, హైవే డ్రైవింగ్ రెండింటికీ సరైన శక్తిని అందిస్తుంది. ఇది రెండు గేర్‌బాక్స్ ఎంపికలతో 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ లలో లభిస్తుంది.

Skoda Kylaq September 2025 Sales Recorded 4398 Units Full Details Inside

వినియోగదారులు తమ డ్రైవింగ్ సౌలభ్యానికి అనుగుణంగా గేర్‌బాక్స్ ఎంపిక చేసుకోవచ్చు, ఇది స్కోడా కాలిక్‌కు మరింత ఆకర్షణీయతను ఇస్తుంది. అంతేకాక, ఇంటీరియర్ ఫీచర్లు కూడా ఈ కారు విజయవంతమయ్యే కారణంగా నిలిచాయి. స్కోడా కైలాక్ సన్‌రూఫ్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ సెల్‌ఫోన్ ఛార్జర్ వంటి ఆధునిక ఫీచర్లను అందిస్తుంది. ఇవే కాకుండా డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.

కైలాక్ కారు వినియోగదారులకు తక్కువ ధరలో అధునాత్మక ఫీచర్స్, శక్తివంతమైన ఇంజిన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ అనుభవం అందించేలా రూపొందించబడ్డాయి. ఈ కారణంగా, స్కోడా కైలాక్ మార్కెట్లో మంచి ఆదరణను పొందుతున్న అత్యంత విజయవంతమైన మోడల్గా మారింది. భారత మార్కెట్లో స్కోడా కైలాక్ కారు భద్రత పరంగా కూడా ఎంతో విశ్వసనీయతను చూపుతోంది.

Skoda Kylaq September 2025 Sales Recorded 4398 Units Full Details Inside

Bharat NCAP క్రాష్ టెస్ట్స్లో ఇది పిల్లలు, పెద్దల ప్రయాణీకుల రక్షణ కోసం పూర్తి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ను సాధించడంతో, మార్కెట్లో సేఫ్టీ పరంగా ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. ఇది మంచి సేఫ్టీ రేటింగ్, ఆధునిక ఇంజిన్, సౌకర్యవంతమైన గేర్‌బాక్స్ ఎంపికల కలయికతో, వినియోగదారులకు సురక్షితమైన, నమ్మకమైన,ఆధునిక డ్రైవింగ్ అనుభవం అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 22, 2025, 15:38 [IST]
English summary
Skoda kylaq september 2025 sales recorded 4398 units full details inside
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+