ఇండియాలో అత్యంత సేఫ్టీ కారు తక్కువ ధరలో లభిస్తుంది.. ఈ డేట్ గుర్తుపెట్టుకుని బుక్ చేసుకోండి

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కోడా ఇండియా (Skoda India) దేశీయంగా మంచి మార్కెట్ కలిగి ఉంది. చాలా కాలంగా అధునాతన ఫీచర్లతో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ, ఇతర కంపెనీలకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ క్రమంలో కొత్త వినియోగదారులను ఆకట్టుకోడానికి కంపెనీ ఇటీవలే కైలాక్ (kylaq) కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. లాంచ్ అయిన తక్కువ కాలంలోనే ఇది రికార్డు స్థాయిలో బుకింగ్స్‌ను సాధించింది. స్కోడా వెల్లడించిన దాని ప్రకారం, ఈ కారు బుకింగ్స్ ఓపెన్ చేసిన 10 రోజుల్లోనే ఏకంగా 10,000 మంది కస్టమర్లు బుకింగ్ చేసుకున్నారు. ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంత మంది కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం గమనార్హం. ఈ గణంకాలను చూసినట్లయితే భారతీయ మార్కెట్లో ఈ కారుకు ఉన్న డిమాండ్‌ను ఇది తెలియజేస్తుంది. కస్టమర్ల నుంచి భారీ స్పందన రావడంతో స్కోడా డిసెంబర్ మధ్యలో బేస్ వేరియంట్‌కు సంబంధించిన బుకింగ్స్‌ను నిలిపివేసింది.

అధిక బుకింగ్స్ కారణంగా ఈ ప్రక్రియను తాత్కాలికంగా ఆపేసిన స్కోడా త్వరలో బేస్ వేరియంట్‌కు సంబంధించిన బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించబోతుంది. కైలాక్ బుకింగ్స్ తిరిగి జనవరి 27న ఓపెన్ చేయబోతున్నారు. ఇది కస్టమర్లకు సంతోషం కలిగించే వార్తే. కైలాక్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ తేదీని గుర్తుపెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే ఈ కారుకు డిమాండ్ ఎక్కువగా ఉండటం కారణంగా వేగంగా బుకింగ్ చేసుకోవాలి.

Skoda Kylaq Launch

స్కోడా కైలాక్‌ ఇండియా మార్కెట్లో ప్రారంభ ధర రూ. 7.89 లక్షల (ఎక్స్-షోరూమ్)తో విడుదల అయింది. మధ్య తరగతి వారు ఇటీవల కాలంలో రూ.10 లక్షల లోపు ధరలో లభించే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కైలాక్‌ కారు ఈ రేంజ్‌లోనే అందుబాటులో ఉండటం పైగా అధునాతన ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్ కారణంగా ఈ కారును కొనుగోలు చేయడానికి చాలా మంది కస్టమర్లు ముందుకు వస్తున్నారు.

మరో కీలక విషయం ఏమిటంటే ఈ కారు ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు అత్యంత సురక్షితం అని తేలింది. ఇటీవల భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ రేటింగ్ బేస్ వేరియంట్‌కు కూడా వర్తిస్తుంది. ఈ కారుకు సంబంధించిన ఉత్పత్తిని కంపెనీ పూణేలోని తన ప్లాంట్‌లో మొదలుపెట్టింది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 7.89 లక్షలుగా ఉంది.

Skoda Kylaq Bookings Reopening

అదే, టాప్ వేరియంట్ ధర రూ.14.40 లక్షలు(ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 115 bhp పవర్, 178 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌‌ను జత చేశారు. అదే టాప్ వేరియంట్లలో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అదనపు ఆప్షన్‌గా ఇచ్చారు.

స్కోడా కైలాక్ సబ్-4 మీటర్ SUVలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX యాంకర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ (ESC),బ్రేక్ డిస్క్ వైపింగ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ , వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. ఇండియాలో అత్యంత సేఫ్టీతో కూడిన ఈ కారు తక్కువ ధరలో లభించడం కారణంగా చాలా మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Skoda Kylaq Sub Compact Base Variant Suv

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, January 25, 2025, 9:10 [IST]
English summary
Skoda kylaq sub compact entry level suv bookings reopening details
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+