అదిరిపోయే సేఫ్టీ, అన్-లిమిటెడ్ ఫీచర్స్..కైలాక్ కొంటే ఫుల్ కిక్కు పక్కా..దీని జోరకు మిగతా కార్లన్నీ డల్లే
చెక్ రిపబ్లికన్ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda), భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్న SUV కారు కైలాక్ (Kylaq). మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి పెద్ద బ్రాండ్‌లు ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న కాంపాక్ట్ SUV విభాగంలోకి కైలాక్ ప్రవేశించినప్పటికీ, దానికి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు తక్కువ ధర, బెస్ట్ పర్పామెన్స్, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు కావడం వలన, వాహనం కొనాలనుకునే వినియోగదారులు కైలాక్‌ను ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
స్కోడా కైలాక్ విజయానికి వెనుక ఉన్న బలమైన అంశం GST రేటు తగ్గింపు. వాహనాలపై GST నిర్మాణాన్ని 28% నుంచి 18%కి తగ్గించడంతో ఈ కాంపాక్ట్ SUV ధర ఏకంగా రూ.70,000 నుంచి రూ.1.19 లక్షల వరకు తగ్గింది. ప్రస్తుతం కైలాక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.54 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.

కాగా టాప్ వేరియంట్ ధర రూ.12.79 లక్షలుగా ఉంది. కేవలం రూ.7.54 లక్షలకే స్కోడా వంటి ప్రీమియం బ్రాండ్ కారుకు యజమాని అయ్యే అవకాశం లభించడంతో, వినియోగదారులు కైలాక్‌ను కొనుగోలు చేయడానికి షోరూమ్‌ల వద్ద భారీగా క్యూ కడుతున్నారు.
కైలాక్ SUV డెలివరీలు 2024 జనవరి చివర్లో ప్రారంభమయ్యాయి. తాజాగా విడుదలైన నవంబర్ 2025 అమ్మకాల లెక్కలు చూస్తే కైలాక్ అమ్మకాల వేగం ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. గత 30 రోజుల్లో కంపెనీ మొత్తం 3,538 యూనిట్లను విక్రయించింది. చిన్న తయారీ సామర్థ్యం ఉన్న స్కోడా వంటి సంస్థకు ఇది చాలా పెద్ద సంఖ్య.

ఈ అద్భుతమైన అమ్మకాలు స్కోడా ఇండియాకు పెద్ద విజయాన్ని అందించాయి. ఈ మోడల్ క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ అనే నాలుగు వేరియంట్‌లలో లభిస్తోంది. కైలాక్‌ను చాలా మంది బేబీ కుషాక్(Kushaq) అని పిలుస్తున్నారు. దీని డిజైన్ వినియోగదారులకు బాగా నచ్చింది. LED DRLలు, హెడ్‌ల్యాంప్‌లను బేస్ వేరియంట్‌లో కూడా స్టాండర్డ్‌గా ఇవ్వడం దీని ప్రత్యేకత.
కారులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, బాక్సీ ప్రొఫైల్, బటర్‌ఫ్లై గ్రిల్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్రైలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, క్యాండీ వైట్, టొర్నాడో రెడ్ వంటి ఏడు విభిన్నమైన, ఆకర్షణీయమైన రంగుల్లో కారు లభిస్తోంది. ఇది వినియోగదారులకు ఒక ప్రీమియం SUV ఫీల్‌ను అందిస్తోంది.

కైలాక్ లోపలి భాగంలో, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా 6 విధాలుగా సర్దుబాటు చేయగల ఎలక్ట్రిక్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, లెదరెట్ అప్హోల్‌స్టరీ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా కైలాక్‌ను ఆకర్షణీయంగా మార్చాయి.
సేఫ్టీ విషయంలో కైలాక్ ఎక్కడా రాజీ పడలేదు. భరత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ చిన్న SUV ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి అనేక సేఫ్టీ ఫీచర్లను అందిస్తూ, కైలాక్ విశ్వసనీయతను పెంచింది.
కైలాక్ SUVలో 1.0 లీటర్, మూడు సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడింది. ఈ ఇంజన్ 115 bhp పవర్, గరిష్టంగా 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. మైలేజ్ పరంగా చూస్తే, మాన్యువల్ మోడల్ లీటరుకు 19.68 కి.మీ, ఆటోమేటిక్ మోడల్ లీటరుకు 19.05 కి.మీ మైలేజీ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
పనితీరు విషయంలో, ఈ SUV కేవలం 10.5 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 188 కి.మీ వరకు పరిమితం చేయబడింది. మార్కెట్‌లో మారుతి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటి వాటితో కైలాక్ తీవ్రంగా పోటీ పడుతోంది.


Click it and Unblock the Notifications








