మారుతి, టాటాకు దిమ్మతిరిగింది.. ఈ కొత్త కారు మార్కెట్ ను షేక్ చేస్తోంది.. అంతలా ఇందులో ఏముందంటే ?

కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV) కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు, సేఫ్టీ ఉన్న కారు కోసం చూస్తున్నారా ? అయితే, మార్కెట్‌లోకి ఒక కొత్త కారు వచ్చింది. ఇది మారుతి (Maruti), టాటా (Tata) వంటి పెద్ద కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తుంది.

అదే స్కోడా కైలాక్(Skoda Kylaq). ఈ కారు ఇప్పుడు మార్కెట్‌ను తలకిందులు చేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారతదేశంలో సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో చాలా పోటీ నెలకొని ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే చాలా కార్లు ఒకదానికొకటి చాలా గట్టి పోటీని ఇస్తున్నాయి. అయినప్పటికీ భారతీయ వినియోగదారులలో ఈ రకం కార్లకు మంచి డిమాండ్ ఉంది.

Skoda Kylaq Side

అందుకే, ఈ సెగ్మెంట్‌లో నిరంతరం కొత్త కార్లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ వరుసలో భారతదేశంలోని సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇటీవల ప్రవేశించిన కొత్త కారు స్కోడా కైలాక్ (Skoda Kylaq).

2024 నవంబర్ ప్రారంభంలోనే స్కోడా కైలాక్ మార్కెట్‌లోకి వచ్చింది. కానీ, 2025 జనవరి చివరిలో మాత్రమే స్కోడా కైలాక్ కారు డెలివరీలు మొదలయ్యాయి. అప్పటి నుండి స్కోడా కైలాక్ ప్రతి నెలా అమ్మకాల్లో దూసుకుపోతోంది. 2025 జనవరిలో 1,245స్కోడా కైలాక్ కార్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరిలో ఇది 3,636కార్లకు పెరిగింది. మార్చిలో ఈ సంఖ్య 5,327కు పెరిగింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఈ సంఖ్య మరింత పెరిగి 5,364 కు చేరుకుంది.

Skoda Kylaq Price

ఈ సంఖ్యలు భారతీయ వినియోగదారులు స్కోడా కైలాక్ కు ఎంత పెద్ద ఆదరణ ఇస్తున్నారో స్పష్టంగా చూపిస్తున్నాయి. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన స్కోడా కైలాక్ స్పెషాలిటీలే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు.

స్కోడా కైలాక్ కారులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ సెల్‌ఫోన్ ఛార్జర్, సింగిల్ ప్యాన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కారులో భద్రతకు (Safety) కూడా ఎలాంటి లోటు లేదు.

Skoda Kylaq

సేఫ్టీ విషయంలో అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి ముఖ్యమైన ఫీచర్లు. అంతేకాకుండా, భారత్ ఎన్‌సిఏపి (Bharat NCAP) సంస్థ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ కారు 5-స్టార్ రేటింగ్‌ను పొందింది.

పనితీరు విషయానికి వస్తే, స్కోడా కైలాక్ (Skoda Kushaq), స్కోడా స్లావియా (Skoda Slavia) కార్లలో అందించబడుతున్న అదే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ స్కోడా కైలాక్ కారులో కూడా అందిస్తున్నారు. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

భారత మార్కెట్లో స్కోడా కైలాక్ కారు ప్రారంభ వేరియంట్ ధర రూ. 8.25 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. భారతదేశంలో ప్రస్తుతం అమ్ముడవుతున్న స్కోడా కార్లలో కైలాక్ అత్యంత చౌకైన కారు ఇదే.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మహీంద్రా XUV 3XO (Mahindra XUV 3XO), టాటా నెక్సాన్ (Tata Nexon), కియా సోనెట్ (Kia Sonet), మారుతి బ్రెజ్జా (Maruti Brezza), హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) వంటి కార్లకు స్కోడా కైలాక్ గట్టి పోటీనిస్తోంది. మరి ఈ కొత్త కారు మార్కెట్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 27, 2025, 11:23 [IST]
English summary
Skoda kylaq the affordable new car giving maruti tata sleepless nights
Read more on: #skoda #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+