ఈ రెండు కంపెనీల SUVలు మార్కెట్‌లో తోపు! అయితే ఏది కొంటే మంచిదో తెలుసా?

దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. వినియోగదారుల్లో చాలా మంది ఏరి కోరి మరీ వీటినే కొంటున్నారు. అందుకే టాప్ సెల్లింగ్ వాహనాల్లోనూ ఎస్‌యూవీలు అధిక సంఖ్యలో ఉంటున్నాయి. దిగ్గజ సంస్థలతో పాటు కొత్త సంస్థలు కూడా ఈ సెగ్మెంట్‌లో కొత్త మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. స్కోడా, మహీంద్రా సంస్థలు కూడా ఇటీవల కొత్త ఎస్‌యూవీలతో వచ్చేశాయి. అవే స్కోడా నుంచి కైలాక్ మోడల్, మహీంద్రా నుంచి XUV3X0 మోడల్. ఈ రెండూ కూడా సబ్- 4 మీటర్ ఎస్‌యూవీలు. కార్లలో ఉన్న పోలీకలు, తేడాలు ఏంటో చూసేద్దాం.

డైమెన్షన్స్: ఈ రెండు కార్ల డైమెన్షన్స్‌ను గనుక పరిశీలిస్తే... కైలాక్, XUV3XO కార్లు రెండూ 3.99 మీటర్ల పొడవుతో ఉంటాయి. అయితే... మహీంద్రా 2.60 మీటర్ల వీల్‌బేస్‌తో కాస్త పొడవుగా ఉండగా.. XUV3XO కారు వీల్‌బేస్ 2.56 మీటర్లుగా ఉంటుంది. వీటి వెడల్పు విషయానికి వస్తే XUV3XO కారు 1.82 మీటర్లుగా, కైలాక్ కారు 1.78 మీటర్లుగా ఉంటుంది.

Skoda Kylaq Vs Mahindra XUV3X0 SUVs

ఫీచర్లు & సాంకేతికత: ఈ రెండు ఎస్‌యూవీల్లో కూడా క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, USB- C ఛార్జింగ్ పోర్ట్స్, డ్యూయల్- డిజిటల్ స్క్రీన్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్‌డ్ డ్రైవర్‌ సీట్, ఫుల్ LED లైటింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. కైలాక్ కారులో పవర్‌డ్ ప్యాసెంజర్ సీట్, ఫ్రంట్ వెంటిలేషన్ ఉంటుంది. అదే సమయంలో XUV3XO కారులోని AX7 వేరియంట్... పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్, కూల్డ్ గ్లవ్ బాక్స్‌తో ఉంటుంది.

XUV3XO కారులోని AX7L లేదా AX5L వేరియంట్లలో లెవెల్- 2 ADAS దీని ప్రధానకార్షణగా చెప్పవచ్చు. కైలాక్ మోడల్ కంటే తక్కువ ధరలో లభించే మహీంద్రా XUV3XO వేరియంట్లలో... 360- డిగ్రీ కెమెరా, ఆటో- డిమ్మింగ్ IRVM, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉంటాయి. ఫీచర్లను విభజిస్తూ మహీంద్రా సంస్థ కార్లను తీసుకొస్తుండడంతో వీటి ఖర్చులు వేర్వేరుగా ఉంటాయి.

Skoda Kylaq Vs Mahindra XUV3X0 SUVs

ఇంజిన్ ఆప్షన్లు: ఈ రెండు ఎస్‌యూవీల్లో పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ కాస్త వేర్వేరుగా ఉన్నాయి. మహీంద్రా XUV3XO కారు రెండు పెట్రోల్ ఇంజిన్స్ తో వస్తుంది. అందులో ఒకటి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. ఇది 128bhp పవర్, 230Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరొకటి 1.5- లీటర్ డీజిల్ ఇంజిన్... ఇది 115bhp పవర్, 300Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇది మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్‌తో ఉంటుంది. ఇక స్కోడా కైలాక్ విషయానికి వస్తే ఇది సింగిల్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 114bhp పవర్, 178Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇవి మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో అనుసంధానించి ఉంటుంది.

ధర మాటేమిటి?: స్కోడా కైలాక్ కారు ధర రూ. 7.89 లక్షల నుంచి రూ.14.40 లక్షల మధ్య ఉంటుంది. అదే సమయంలో మహీంద్రా XUV3XO కారు ధర రూ.7.99 లక్షల నుంచి రూ.15.57 లక్షలుగా ఉంటుంది. దీంట్లో టాప్ వేరియంట్ ధర రూ.13.99 లక్షలుగా ఉంటుంది.

డ్రైవ్ స్పార్క్ వ్యాఖ్య: ఈ రెండింట్లో ఏ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనేది వారి వారి వ్యక్తిగత ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. దీంట్లోని ADAS లేదా ఇంజిన్ వెరైటీ వంటి ఫీచర్లు... ఈ ప్రాధాన్యతలను నిర్ణయిస్తాయి. ప్రతి మోడల్‌లోని సౌకర్యాలు వాటి ధరలను బట్టి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, February 1, 2025, 7:20 [IST]
English summary
Skoda kylaq vs mahindra xuv3x0 suvs features powertrain and price comparison details in telugu
Read more on: #auto news #comparison #cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+