రూ.7.89 లక్షల కారు కోసం క్యూ కట్టిన కస్టమర్లు.. బుకింగ్స్‌లో సునామీ.. స్కోడా కొత్త మోడల్‌కు ఊహించని డిమాండ్

దిగ్గజ కార్ల తయారీ కంపెనీ స్కోడా ఇండియా (Skoda India) అధునాతన ఫీచర్లతో కూడిన కార్లను లాంచ్ చేయడంలో ఇతర తయారీదారులతో ఎప్పుడు పోటీ పడుతుంది. భారతీయ వినియోగదారులను ఆకట్టుకోడానికి ప్రతి ఏడాది కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో కంపెనీ ఇటీవల కైలాక్ (kylaq) కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్ 2 నుంచి ఈ కారు బుకింగ్స్‌ను స్కోడా కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. దీని ఆకట్టుకునే డిజైన్, ఫీచర్స్‌తో చాలా మంది వినియోగదారులను ఆకర్షించి భారీగా బుకింగ్స్‌ను అందుకోవడం మొదలుపెట్టింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, స్కోడా కైలాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇప్పటి వరకు దాదాపు 20,000 మంది బుకింగ్ చేసుకున్నారు. లాంచ్ అయిన తక్కువ కాలంలోనే ఏకంగా ఇన్ని బుకింగ్స్ అందుకోవడంపై కంపెనీ సంతోషం వ్యక్తం చేస్తుంది.

కైలాక్ బుకింగ్స్ ఓపెన్ అయిన 10 రోజుల్లోనే ఏకంగా 10,000 మంది కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచారు. ఈ సంఖ్యలను చూసినట్లయితే భారతీయ మార్కెట్లో కైలాక్‌కు ఉన్న డిమాండ్‌ను ఇది తెలియజేస్తుంది. ఆ తరువాత బుకింగ్స్‌కు ఎక్కువ స్పందన రావడంతో బేస్ వేరియంట్‌కు సంబంధించిన బుకింగ్స్‌ను స్కోడా డిసెంబర్ మధ్యలో తాత్కాలికంగా నిలిపివేసింది. కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికే ఈ కారును తీసుకువచ్చింది.

Skoda New Compact Suv Kylaq

వినియోగదారుల నుంచి అనుకున్నదాని కంటే మరింత ఎక్కువ స్పందన రావడంతో రానున్న రోజుల్లో దీనికి మరింత డిమాండ్ పెరుగుతుందని స్కోడా అంచనాలు వేసింది. డిసెంబర్ మధ్యలో నిలిసివేసిన బుకింగ్స్‌ను తిరిగి ఓపెన్ తరువాత కస్టమర్ల నుంచి స్పందన ఏమాత్రం తగ్గలేదు. రెండు నెలల్లోనే 20 వేల బుకింగ్స్ సాధించి రోడ్లపై పరుగులు పెట్టకముందే సేల్స్‌లో దూసుకుపోయేలా ఉంది. ఇండియా మార్కెట్లో స్కోడా కైలాక్‌ ప్రారంభ ధర రూ. 7.89 లక్షల(ఎక్స్-షోరూమ్).

దీని టాప్ వేరియంట్ ధర రూ.14.40 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంది. ఆకట్టుకునే డిజైన్, అధునాతన ఫీచర్స్ కారణంగా కైలాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. ఇది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో, 115 bhp పవర్, 178 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జత చేశారు. టాప్ వేరియంట్లలో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఉంటుంది.

Skoda New Kylaq Design

కైలాక్ ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ముందు స్ప్లిట్ LED హెడ్‌లైట్లు, సిల్వర్ ఫాక్స్ బాష్ ప్లేట్‌, స్లిమ్డ్-డౌన్ గ్రిల్ వంటి వాటిని కలిగి ఉంది. మైలేజ్ విషయానికి వస్తే, 15 నుంచి 18 కి.మీల వరకు వస్తుందని స్కోడా ఇండియా పేర్కొంది. ఇది టోర్నడో రెడ్ కలర్, ఆలివ్ గోల్డ్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, లావా బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ కారులో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. లోపల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 446 లీటర్ల బూట్ స్పేస్, కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్ వంటి పలు ఫీచర్స్ ఉన్నాయి.

Kylaq 20000 Bookings

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, January 30, 2025, 16:13 [IST]
English summary
Skoda new compact suv kylaq got 20000 bookings within two months
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+