విడుదలకు ముందే ఈ కారు కోసం ఎగబడ్డారు.. ఇప్పుడు లాంచ్.. ఈ కొత్త కారులో అంతగా ఏముందో మరి?

చెక్ ఆటోమేకర్ స్కోడా మళ్లీ మార్కెట్లో దుమ్ము రేపేలా తన సరికొత్త మోడల్‌ ఆక్టేవియా RS (Skoda Octavia Rs)‌ను ఆవిష్కరించింది. ఈ కారు ఆటోమొబైల్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. స్పోర్టీ డిజైన్, అధునాతన సాంకేతికత, ట్రాక్-బ్రెడ్ ఇంజనీరింగ్ ఈ మూడు అంశాల సమ్మేళనంగా ఈ కొత్త ఆక్టేవియా RS రూపొందించబడింది. దీనిని చూసినప్పుడే ఆకర్షణ కలిసిన ఒక స్పోర్ట్స్ మెషీన్ అనిపిస్తుంది. స్కోడా ఆక్టేవియా RS ధరను రూ.49.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ధర ప్రకటించకముందే ఈ కారుమొదటి బ్యాచ్‌లోని 100 యూనిట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. అంటే, ఈ మోడల్‌పై ఉన్న డిమాండ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

కేవలం కొన్ని రోజులలోనే అన్ని యూనిట్లు బుక్ అయిపోయాయి. కంపెనీకి వచ్చిన మంచి డిమాండ్‌తో, స్కోడా మరోసారి ప్రీమియం స్పోర్టీ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని బలపరుచుకుంది. ఈ కారును బుక్ చేసుకున్న కస్టమర్లకు ఇప్పటికే కంపెనీ నుండి కాన్ఫర్మేషన్ కాల్స్ వెళ్లడం ప్రారంభమైంది. ఇక డెలివరీల విషయానికి వస్తే, నవంబర్ 6, 2025న మొదటి ఆక్టేవియా RS యూనిట్లు కస్టమర్లకు అందజేయబడనున్నాయి.

Skoda Octavia Rs Car Launched In India At Rs 49 99 Lakh More Details

దీని రూపకల్పనలో స్కోడా తన సంతక డిజైన్ భాషను కొనసాగిస్తూ, దానికి కొత్త శక్తి, స్పోర్ట్స్ స్టైలింగ్‌ను జోడించింది. ఎరోడైనమిక్ లైన్స్, యాగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్, రెడ్ బ్రేక్ క్యాలిపర్స్, సిగ్నేచర్ RS బ్యాడ్జ్ ఇవన్నీ కలిసి ఈ కారు లుక్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఇంటీరియర్‌లో స్పోర్ట్స్ సీట్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు డ్రైవింగ్ అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్తాయి.

కొత్త స్కోడా ఆక్టేవియా RS కారు కేవలం లుక్‌లోనే కాదు, పనితీరులోనూ ఒక పవర్‌హౌస్‌లా నిలుస్తుంది. దీని పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 2.0-లీటర్ TSI టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 245bhp పవర్, 370Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, అంటే ప్రతి యాక్సిలరేషన్‌లో ఆ శక్తిని డ్రైవర్ స్పష్టంగా అనుభూతి చెందగలడు. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్కు జత చేశారు.

Skoda Octavia Rs Car Launched In India At Rs 49 99 Lakh More Details

ఇది గేర్ మార్పులను చాలా స్మూత్‌గా, వేగంగా నిర్వహిస్తుంది. ఫలితంగా, కేవలం 6.7 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు. ఇది ఆక్టేవియా RS‌ను కేవలం సెడాన్‌గా కాకుండా, ఒక స్పోర్ట్స్ మెషీన్‌గా నిలబెడుతుంది. అంతేకాకుండా, ఈ పవర్‌ట్రెయిన్‌ను ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్(VAQ)తో కూడిన ఫ్రంట్-వీల్ డ్రైవ్ లేఅవుట్తో కలిపారు. దీంతొ అద్భుతమైన ట్రాక్షన్, కార్నరింగ్ స్టెబిలిటీని ముఖ్యంగా హై-స్పీడ్ టర్న్స్, స్పోర్టీ డ్రైవింగ్ సమయంలో.అందిస్తుంది.

ఇది డ్రైవర్‌కు మరింత కంట్రోల్, కంఫర్ట్, కాన్ఫిడెన్స్ ఇవ్వడమే కాకుండా, రోడ్డు మీద కారు పట్టు కోల్పోకుండా కొనసాగించేలా చేస్తుంది. యూరోపియన్ స్థాయి సేఫ్టీ ప్రమాణాలను ప్రతిబింబించేలా కొత్త స్కోడా ఆక్టేవియా RS రూపుదిద్దుకుంది. చెక్ బ్రాండ్ ఈ కారు భద్రత విషయంలో ఏ మాత్రం రాజీపడలేదు. ఇందులో 10 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ఆధునిక భద్రతా ఫీచర్లను అందించారు.

Skoda Octavia Rs Car Launched In India At Rs 49 99 Lakh More Details

అదనంగా, MSR (మోటార్ స్లిప్ రెగ్యులేషన్), ASR(ట్రాక్షన్ కంట్రోల్), EDL(ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్), HBA (హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్), DSR (డ్రైవర్ స్టీరింగ్ రికమెండేషన్), RBS (రెయిన్ బ్రేక్ సపోర్ట్), ESBS (ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్), MCB (మల్టీ కొలిషన్ బ్రేక్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి పలు సాంకేతిక భద్రతా వ్యవస్థలను కూడా చేర్చారు. ఇవన్నీ కలిసి డ్రైవర్, ప్రయాణికులకు అత్యున్నత స్థాయి రక్షణను కల్పిస్తాయి.

More from DriveSpark

Article Published On: Friday, October 17, 2025, 13:48 [IST]
English summary
Skoda octavia rs car launched in india at rs 49 99 lakh more details
Read more on: #skoda #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+