షోరూమ్‌లో అడుగుపెట్టకముందే అమ్ముడైపోయిన కారు..గంటల్లోనే 100కార్లు బుక్కయ్యాయి

చెక్ రిపబ్లికన్ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda)కు ప్రస్తుతం భారత మార్కెట్లో టైం బాగుంది. కుషాక్, స్లావియా వంటి మోడల్స్ మంచి అమ్మకాలు నమోదు చేస్తుండగా, తాజాగా ప్రవేశపెట్టిన ఆక్టావియా RS పెర్ఫార్మెన్స్ సెడాన్ డెలివరీలను కూడా ప్రారంభించి స్కోడా అదరగొడుతోంది. స్పీడ్, పవర్‌ను ప్రేమించే డ్రైవింగ్ లవర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సెడాన్ బుకింగ్‌లు ప్రారంభించిన మొదటి రోజునే పూర్తిగా అమ్ముడైపోయింది. ఈ కారు ఫస్ట్ ఓనర్స్ గ్యారేజీలకు వచ్చి చేరింది.

స్కోడా ఆక్టావియా RS ఎక్స్-షోరూమ్ ధర రూ.49.99 లక్షలు ఉన్నప్పటికీ, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులతో కలిపి దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.63.93 లక్షల వరకు ఉంటుంది. ఈ కారును విదేశాల్లో పూర్తిగా తయారు చేసి, భారత్‌కు దిగుమతి చేసుకోవడం వలన ధర ఇంత ఎక్కువగా ఉంది. అయినా సరే ధర గురించి పట్టించుకోకుండా కొనుగోలు చేయడానికి భారతీయులు ఆసక్తి చూపుతున్నారు.

Skoda Octavia RS Deliveries Begin Why This 261 BHP Sedan With 10 Airbags Sold Out in Hours

మొదటి బ్యాచ్‌లోని 100 కార్లు కేవలం కొన్ని గంటల్లోనే అమ్ముడయ్యాయి. అంతేకాదు తర్వాత రాబోయే 100 కార్లు కూడా ఇప్పటికే బుక్ అయినట్లు తెలుస్తోంది. ఆక్టావియా RS అత్యంత ముఖ్యమైన అంశం దాని అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఈ సెడాన్ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లోని ప్రసిద్ధ EA888 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

ఇది గరిష్టంగా 261 బీహెచ్‌పి పవర్, 370 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది జత చేయబడింది. పెర్ఫార్మెన్స్ లెక్కల ప్రకారం...ఈ కొత్త స్కోడా ఆక్టావియా RS కేవలం 6.4 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడు గంటకు 250 కి.మీ వరకు ఉంటుంది.

Skoda Octavia RS Deliveries Begin Why This 261 BHP Sedan With 10 Airbags Sold Out in Hours

ఇంతటి వేగాన్ని కంట్రోల్ చేసేందుకు, స్కోడా కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించింది. ఇందులో డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ లేనప్పటికీ, హ్యాండ్లింగ్‌ను మెరుగుపరచడానికి ఫ్రంట్ ఆక్సిల్‌లో ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్ ఉంది. ఇది హై-స్పీడ్‌లో కూడా గ్రిప్‌ను, ట్రాక్షన్‌ను మెరుగ్గా ఉంచుతుంది.

స్టార్ట్ బటన్‌ను ఎక్కువసేపు నొక్కితే ఎమోషన్ స్టార్ట్ అనే ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఇది ఇంజిన్‌ను నేరుగా 2,100 ఆర్‌పిఎం వరకు పెంచి థ్రిల్లింగ్ సౌండ్‌ను ఇస్తుంది. ఆక్టావియా RS డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో స్పోర్టీ బంపర్‌లు, డ్యూయల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు, వెనుక భాగంలో లిప్ స్పాయిలర్, 18-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి (19-అంగుళాల వీల్స్‌కు అప్‌గ్రేడ్ ఆప్షన్ కూడా ఉంది).

Skoda Octavia RS Deliveries Begin Why This 261 BHP Sedan With 10 Airbags Sold Out in Hours

క్యాబిన్ లోపల కూడా క్వాలిటీ, అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, 10.25 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, మసాజ్/హీటింగ్/కూలింగ్ ఫంక్షన్లతో కూడిన ఫ్రంట్ స్పోర్ట్స్ సీట్లు, లేన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో స్కోడా ఎక్కడా రాజీ పడలేదు. ఆక్టావియా RS మోడల్‌లో ఏకంగా 10 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. వీటితో పాటు EBD తో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), MSR, ASR, EDL, HBA, DSR, RBS, ESBS, MCB, TPMS వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లను కూడా చెక్ రిపబ్లికన్ తయారీదారులు ఇందులో అందించారు.

More from DriveSpark

Article Published On: Monday, November 24, 2025, 14:30 [IST]
English summary
Skoda octavia rs deliveries begin why this 261 bhp sedan with 10 airbags sold out in hours
Read more on: #skoda #new car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+