జస్ట్ స్టైల్ కాదు.. పర్ఫార్మెన్స్ కూడా.. నవంబర్‌లో స్కోడా నయా మోడల్.. స్పీడ్ పిచ్చోళ్లకు కిక్కిచ్చే కారు
భారతీయ రోడ్లపై స్పీడు, స్టైల్‌ను మిక్స్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం స్కోడా ఒక అద్భుతమైన కారును సిద్ధం చేసింది. స్కోడా నవంబర్ 2025 నాటికి ఇండియాలో కొత్త అక్టేవియా ఆర్‌ఎస్ (Octavia RS) సెడాన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు కేవలం స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, అద్భుతమైన పర్ఫామెన్స్తో స్పీడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ కారు ఇంజిన్, ఫీచర్లు, ధర, విడుదల తేదీ గురించి వివరంగా తెలుసుకుందాం.
స్కోడా నవంబర్ 2025 నాటికి భారతీయ రోడ్లపై కొత్త అక్టేవియా ఆర్‌ఎస్ సెడాన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ పర్ఫార్మెన్స్ సెడాన్‌ను పరిమిత సంఖ్యలో సీబీయూ రూపంలో తీసుకురానున్నారు. దీని అధికారిక ధర రాబోయే నెలల్లో ప్రకటించబడుతుంది. అయితే, మీడియా నివేదికల ప్రకారం.. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.50-55 లక్షలు ఉంటుందని అంచనా. ఈ కారు స్పోర్ట్స్ సెడాన్ విభాగంలో ఒక బెంచ్‌మార్క్‌ను నెలకొల్పే అవకాశం ఉంది.

స్కోడా అక్టేవియా ఆర్‌ఎస్ అతిపెద్ద ప్రత్యేకత దాని పవర్ఫుల్ పవర్ ట్రెయిన్. ఈ నాలుగో తరం మోడల్‌లో అడ్వాన్సుడ్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది గరిష్టంగా 265 బీహెచ్‌పి పవర్, 370 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ ప్రపంచ ప్రఖ్యాత వోక్స్‌వాగన్ గోల్ఫ్ జీటీఐలో కూడా ఉపయోగిస్తున్నారు.
ట్రాన్స్‌మిషన్ కోసం వేగవంతమైన, సున్నితమైన 7-స్పీడ్ డీసీటీ (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చారు. ఇందులో ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD) సిస్టమ్, మెరుగైన ట్రాక్షన్‌ను అందించడానికి ముందు భాగంలో ఎలక్ట్రానిక్‌గా కంట్రోల్ చేయబడే లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్ (eLSD) ఉంటుంది.
ఈ పర్ఫార్మెన్స్ సెడాన్ కేవలం 6.4 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఇది చాలా వేగవంతమైన యాక్సిలరేషన్. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గంగా ఉంటుంది. దీని బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందువైపు 340 x 30 మిమీ, వెనుకవైపు 310 x 22 మిమీ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇవి అత్యుత్తమ బ్రేకింగ్ కెపాసిటీని అందిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మోడల్‌లో డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (డీసీసీ) అడాప్టివ్ సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నప్పటికీ, భారతదేశంలో విడుదలయ్యే వెర్షన్‌లో ఈ సౌకర్యం ఉండదు. ఇది కారు ధరను కంట్రోల్ చేసేందుకు తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు.
స్కోడా అక్టేవియా ఆర్‌ఎస్ లోపలి భాగంలో అనేక ప్రీమియం ఫీచర్లు, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో వస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 13 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సాటిలైట్ నావిగేషన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ (వర్చువల్ కాక్‌పిట్), స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటివి ఉన్నాయి.
కాంట్రాస్టింగ్ రెడ్ స్టిచింగ్, కార్బన్ డెకార్‌తో కూడిన స్పోర్ట్ సీట్లు, అల్యూమినియం పెడల్స్, ఫ్లాట్-బాటమ్ ఆర్‌ఎస్ స్టీరింగ్ వీల్, ట్రై-జోన్ క్లైమేట్ కంట్రోల్ (మూడు వేర్వేరు టెంపరేచర్ జోన్‌లు), హీటెడ్ ఫ్రంట్, రియర్ సీట్లు, మరియు పనోరమిక్ సన్‌రూఫ్ (కొన్ని వేరియంట్లలో ఐచ్ఛికం) వంటివి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. క్యాబిన్ స్పోర్టీ లుక్‌ను కలిగి ఉండి, ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది.
సేఫ్టీ విషయంలో కూడా స్కోడా అక్టేవియా ఆర్‌ఎస్ చాలా ముందంజలో ఉంది. ప్రయాణికులకు అత్యున్నత స్థాయి రక్షణను అందిస్తుంది. అనేక ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్, ప్యాసింజర్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటి ఫీచర్లు ప్రమాదాల తీవ్రతను తగ్గిస్తాయి.
సిటీ ఎమర్జెన్సీ బ్రేకలతో ఫ్రంట్ అసిస్ట్ (అధిక వేగంతో ప్రమాదాలను నివారించడానికి), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ముందున్న వాహనం వేగానికి అనుగుణంగా కారు వేగాన్ని సర్దుబాటు చేస్తుంది), లేన్ అసిస్ట్ (కారు లేన్ నుండి బయటపడకుండా చేస్తుంది), డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ (డ్రైవర్ అలసిపోతే హెచ్చరిస్తుంది), బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఇందులో 600 లీటర్ల బూట్ స్పేస్ ఉంది, ఇది లగేజీకి సరిపడా స్థలాన్ని అందిస్తుంది. వెనుక సీట్లను మడతపెట్టి దీనిని 1,555 లీటర్ల వరకు పెంచుకోవచ్చు, ఇది పెద్ద వస్తువులను రవాణా చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
ఎక్స్‌టీరియర్ డిజైన్ విషయానికి వస్తే, స్కూడా అక్టేవియా ఆర్‌ఎస్ స్పోర్టీ, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బ్లాక్ కలర్ డీటైలింగ్‌తో కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, స్పోర్టీ ఆర్‌ఎస్-నిర్దిష్ట ఫ్రంట్, రియర్ బంపర్‌లు, కొత్త క్రిస్టలైన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఎల్‌ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు (DRLs) కారుకు దూకుడు స్వభావాన్ని ఇస్తాయి.
స్టైలిష్ అలాయ్ వీల్స్, బ్లాక్ సైడ్ మిర్రర్లు, ఆర్‌ఎస్ బ్యాడ్జింగ్ కారు స్పోర్టీ లుక్‌ను పూర్తి చేస్తాయి. యానిమేటెడ్ ఇండికేటర్లతో కూడిన కొత్త ఎల్‌ఈడీ రియర్ లైట్లు, స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్, మోషన్-యాక్టివేటెడ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. మొత్తం మీద, అక్టేవియా ఆర్‌ఎస్ డిజైన్ దాని హై-పర్ఫార్మెన్స్ సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది.


Click it and Unblock the Notifications








