తక్కువ ధర అని ఊరించారు.. ఇప్పుడు ధర భారీగా పెంచారు.. నమ్మించి మోసం చేసిన స్కోడా కంపెనీ

భారతీయులను ఆకర్షించేందుకు తక్కువ ధరలో కొత్త కారు మోడల్‌ను స్కోడా కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దాని ధరను పెంచడం చాలా మందిని ఆశ్చర్యానికి, షాక్‎కు గురి చేస్తుంది.. స్కోడా కైలాక్ (Skoda Kylaq) అనే సబ్-కాంపాక్ట్ SUV మోడల్‌ను మొదట కేవలం రూ. 7 లక్షల 89 వేల బడ్జెట్ ధరకు ఇంట్రడ్యూస్ చేశారు.

ప్రీమియం ఫీచర్స్, ఎట్రాక్టీవ్ డిజైన్ తో వచ్చిన ఈ కారుకు భారతీయుల నుంచి మంచి స్పందన లభించింది. ఫిబ్రవరిలో 3,636 యూనిట్లు, మార్చి నెలలో 5,327 యూనిట్లను విక్రయించగలిగింది.. ఇలాంటి పరిస్థితుల్లో స్కోడా కంపెనీ ఈ కారు ధరను పెంచడం చాలా మందికి షాకింగ్‎గా ఉంది.. ఇప్పుడు దీని ప్రారంభ ధరను రూ. 8 లక్షల 25 వేలకు పెంచారు.

Skoda Kylaq Price Hike India

ఒక్కసారిగా రూ. 36 వేలు పెంచడం చాలా మందికి మింగుడు పడడం లేదు. ముఖ్యంగా తక్కువ ధరలో కారు కొనాలనుకునే వారికి ఇది నిజంగా బాధాకరమైన విషయమే. పైన చూసినవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఆన్-రోడ్ ధర దీని కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి.

స్కోడా కైలాక్ భారతదేశంలో క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టేజ్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో క్లాసిక్ వేరియంట్ మినహా మిగిలిన మూడు వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లు ఉన్నాయి.

Skoda Kylaq Price

అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. స్కోడా కంపెనీ కొన్ని టాప్-ఎండ్ వేరియంట్ల ధరలను తగ్గించింది కూడా. అవును, బేస్ మోడల్ ధరను పెంచినట్లే కొన్ని హై-ఎండ్ వేరియంట్ల ధరలను కూడా తగ్గించారు. ముఖ్యంగా ప్రెస్టేజ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ధరను అత్యధికంగా రూ. 46 వేల వరకు తగ్గించారు.

ఇది కేవలం మాన్యువల్ ఆప్షన్‌లో చేసిన తగ్గింపు మాత్రమే. అలాగే ప్రెస్టేజ్ వేరియంట్ ఆటోమేటిక్ ఆప్షన్ ధరను కూడా రూ. 41 వేలు తగ్గించారు. అంతేకాకుండా, సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ ధరను కూడా తగ్గించారు. ముఖ్యంగా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ధరను రూ. 15 వేలు తగ్గించారు. అలాగే, దీని ఆటోమేటిక్ ఆప్షన్ ధరను రూ. 5 వేలు తగ్గించారు.

Skoda Kylaq Price Side

కానీ సిగ్నేచర్ వేరియంట్ మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్ల ధరలను మాత్రం రూ. 26 వేల నుండి రూ. 36 వేల వరకు పెంచారు. దీంతో వాటి కొత్త ధరలు ఇప్పుడు రూ. 9.85 లక్షలు, 10.95 లక్షలుగా ఉన్నాయి. ప్రతి నెలా కైలాక్ అమ్మకాలు పెరుగుతున్న ఈ సమయంలో, స్కోడా కంపెనీ ఈ ధరల తగ్గింపు, పెరుగుదల వంటి మిశ్రమ చర్యలు చేపట్టింది.

కాబట్టి ఈ కారు అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కైలాక్ SUV చాలా ఎక్కువ ప్రీమియం ఫీచర్లను కలిగి ఉన్న కారు మోడల్. ఈ కారులో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ నుండి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ వరకు అనేక ఫీచర్లు ఉన్నాయి.

అంతేకాకుండా, క్రోమ్ గార్నిష్, ఆర్మ్ రెస్ట్, పార్సెల్ ట్రే, క్రూయిజ్ కంట్రోల్, వెనుకవైపు డీఫాగర్ వంటి ఫీచర్లను కూడా స్కోడా ఈ కారులో అందిస్తోంది. దీనితో పాటు 6 ఎయిర్ బ్యాగులు, EBD, ABS, ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్, ISOFIX సీట్ యాంకర్లు కూడా కైలాక్‌లో ఉన్నాయి. అంతేకాకుండా, టిల్ట్ అడ్జస్ట్ చేసే వీలున్న స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉంది.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ కారులో ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ ఉంది. ఇది 115 bhp పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0 లీటర్ TSI మోటార్. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ కారును భారతీయుల్లో మరింతగా ప్రాచుర్యం పొందించడానికి స్కోడా కంపెనీ ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాల్లో డెలివరీ చేసే జెప్టోతో ఇటీవల చేతులు కలిపింది. తమ కార్లను కస్టమర్‌లకు వెంటనే డెలివరీ చేసేందుకే ఈ భాగస్వామ్యాన్ని కొన్ని నెలల క్రితం ప్రారంభించింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారతదేశంలో ఇటీవల వాహన తయారీదారులు తమ వాహనాల ధరలను పెంచుతూనే ఉన్నారు. వాహన నిర్మాణ వ్యయం నిరంతరం పెరుగుతూ ఉండటమే దీనికి కారణమని వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్కోడా తన తక్కువ ధర కారు ధరను పెంచడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో ఇంతకుముందు కాస్త తక్కువ ధరలో ఉన్న కైలాక్ ఇప్పుడు కాస్త ఖరీదైన కారుగా మారింది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, May 3, 2025, 7:02 [IST]
English summary
Skoda promised low price but now this massive price hike for popular kylaq suv
Read more on: #skoda #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+