లగ్జరీ, సేఫ్టీ రెండూ కలిగి ఉన్న పాపులర్ మోడల్ ధరను భారీగా తగ్గించిన స్కోడా కంపెనీ.. కొత్తది ఎంతంటే ?
కొన్నేళ్ల కిందటి వరకు ఎక్కువగా జనాలు సెడాన్ కార్లను ఉపయోగించే వారు. కానీ కాలం మారిన కొద్దీ ఇప్పుడు జనాలంతా ఎస్‌యూవీల వెంటపడుతున్నారు. అయితే ఇప్పటికీ కొందరు మాత్రం పాత మోడల్స్‌ను ఇష్టపడుతుంటారు. కాబట్టి సెడాన్ మోడల్స్ కు గతంలో ఉన్నంత డిమాండ్ లేదు. ఒకప్పుడు ఉన్నంత ప్రజాదరణ లేకపోయినా త్రి బాక్స్ టైప్ వెహికల్స్ నేటికీ బాగానే అమ్ముడవుతున్నాయి. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు(ఎస్యూవీ) లకు ఉన్న రైడింగ్ కంఫర్ట్. చెక్ రిపబ్లిక్ ఆటోమేకర్ స్కోడా అనేది దాని సెడాన్లతో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ కారు ఎంట్రీ సమయంలో ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుందన్న విమర్శలు వచ్చినప్పటికీ స్కోడా మన దేశంలో యూరోపియన్ క్వాలిటీ గల కార్లను ఉత్పత్తి చేసింది. ఆక్టేవియా, సూపర్బ్, రాపిడ్ ఈ కార్లన్నీ దీనికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కానీ నేటి ఎస్‌యూవీల కాలంలో ఇవేవీ కంపెనీకి తగినంత బలంగా కనిపించడం లేదు. దీంతో స్లావియా ఒక్కటే కంపెనీని నిలబెట్టే మోడల్‌గా కనిపిస్తోంది.

భారతదేశంలోని మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో అత్యంత సేఫ్టీ మోడల్స్‌లో స్లావియా ఒకటి. అయితే, ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వంటి SUV లతో పోల్చినప్పుడు వాస్తవంగా అంత ఎట్రాక్టివ్ గా కనిపించదు. అందుకోసం స్కోడా కంపెనీ ఓ పరిష్కారాన్ని కనుగొంది. స్కోడా స్లావియా 2025 మోడల్ ఇటీవలే మార్కెట్లో విడుదలైంది. మెకానికల్, డిజైన్ లేదా ఫీచర్ పరంగా ఎటువంటి మార్పులను కంపెనీ చేయలేదు.
కాకపోతే స్కోడా తన సి సెగ్మెంట్ సెడాన్ ధరను భారీగా తగ్గించింది. దీనిని కొనాలని భావిస్తున్న వారు గత్రంలో రూ.10.69 లక్షల (ఎక్స్-షోరూమ్)కు బదులు ఇప్పుడు రూ.10.34 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. స్లావియా ప్రారంభ ధరను రూ. 35,000 వరకు తగ్గించింది. ఈ సెడాన్ ప్రస్తుతం క్లాసిక్, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, మోంటే కార్లో, ప్రెస్టీజ్ వంటి 5వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో కంపెనీ మొదటి రెండు వేరియంట్ల ధరలను సవరించింది.

ముందుగా క్లాసిక్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం.. ఈ మోడల్ ధర రూ. 10.34 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ మోడల్‌ను మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి జత చేయవచ్చు. ఈ వేరియంట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది. LED DRLతో కూడిన హాలోజెన్ హెడ్ లైట్స్, అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్లతో వస్తుంది.
ఖర్చులను తగ్గించేందుకు స్కోడా స్లావియా క్లాసిక్‌ను వీల్ కవర్లతో కూడిన స్టీల్ వీల్స్‌తో మార్కెట్ చేస్తున్నారు. బేస్ వేరియంట్‌లో టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, వైర్డు ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మాన్యువల్ అడ్జస్టమెంట్ ఫాబ్రిక్ సీట్స్, 4స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. అలాగే ఆటో స్టార్ట్ స్టాప్ ఆఫ్షన్ కూడా అందించింది.

సేఫ్టీ పరంగా స్లావియా క్లాసిక్ బేస్ మోడల్‌ను యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఎమర్జెన్సీ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ట్రాక్షన్ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్ అందించింది.
స్కోడా స్లావియా సెకండ్ సిగ్నేచర్ వేరియంట్ ధరను కంపెనీ రూ.40వేల మేర తగ్గించింది. ఈ మోడల్ లో LED టెయిల్‌లైట్లు, డోర్ హ్యాండిల్స్‌పై క్రోమ్ యాక్సెంట్స్, బేస్ మోడల్‌పై స్టైలిష్ 16ఇంచుల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర 1.0-లీటర్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌కు రూ. 13.59 లక్షలు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్‌కు రూ. 14.69 లక్షలుగా నిర్ణయించింది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. క్యాబిన్ యాంబియంట్ లైటింగ్, లెదర్ కోటెడ్ స్టీరింగ్ వీల్ , ముందు వెనుక ఆర్మ్‌రెస్ట్‌లతో మరింత ప్రీమియం ఫీలింగ్ అందించే విధంగా స్లావియాను రూపొందించారు. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 10ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3.5ఇంచుల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ కూడా అధిక ధరకు అందుబాటులో ఉంది.
స్కోడా ఆడియో సిస్టమ్ కోసం 8 స్పీకర్లను ఉపయోగించింది. ప్రయాణీకులు వెనుక ఏసీ వెంటలతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎంజాయ్ చేయవచ్చు. అదనంగా స్కోడా స్లావియా సిగ్నేచర్ వేరియంట్ క్రూయిజ్ కంట్రోల్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్, బ్యాక్ వ్యూ కెమెరా వంటి ఎక్స్ ట్రా ఫీచర్లును కూడా అందిస్తుంది.


Click it and Unblock the Notifications








