ఇంత మంచి కారును కేవలం ఒక్కరంటే ఒక్కరే కొన్నారు.. ఇది అంతు చిక్కని రహస్యం..

ప్రముఖ వాహన తయారీ కంపెనీ స్కోడా ఇండియాలో కార్ల విక్రయాల్లో ప్రతి ఏడాది కూడా మెరుగైన గణంకాలు సాధిస్తుంది. ఈ సంస్థ నుంచి విడుదలయ్యే వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే తాజాగా ఒక మోడల్ మాత్రం అనుకున్నంత సేల్స్‌ను సాధించలేదు. అదే, స్కోడా సూపర్బ్ (2025 Skoda Superb) సెడాన్. ఇది గత ఏడాది డిసెంబర్‌లో అమ్మకాల పరంగా చాలా నిరాశపరిచింది. కంపెనీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ కారును 2024 డిసెంబర్ నెలలో కేవలం ఒక్కరంటే ఒక్కరే కొనుగోలు చేశారు. దీంతో దేశీయంగా ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్‌ల జాబితాలో చివరి స్థానం పొందింది. సాధారణంగా సెడాన్ కార్లకు ఇండియాలో మంచి ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో స్కోడా సూపర్బ్ అమ్మకాల పరంగా మంచి స్థానంలో ఉంటుందని స్కోడా ఇండియా అంచనాలు పెట్టుకున్నప్పటి దానికి భిన్నంగా ఒక్క కారు అమ్ముడుపోవడం గమనార్హం.

ఇదే నెలలో ఇతర కంపెనీలకు చెందిన సెడాన్‌లు మాత్రం అమ్మకాల పరంగా మెరుగైన సంఖ్యలను నమోదు చేయగా, స్కోడా సూపర్బ్ మాత్రం వెనుకబడి ఉంది. ఇదే నెలలో అతిపెద్ద వాహన తయారీదారు మారుతీ సుజుకీ డిజైర్ 16,000 కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేయగా, మరో దిగ్గజ కంపెనీ హ్యుందాయ్‌ ఆరా (Aura), హోండా అమేజ్ (Amaze) కార్స్‌ను దాదాపు 4,000 కంటే ఎక్కువ మంది కస్టమర్లు కొనుగోలు చేశారు.

Skoda Superb Sedan

స్కోడా సూపర్బ్ కారు కూడా వీటిలో ఉన్నట్లుగానే అధునాతన ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉన్నప్పటికి కూడా వినియోగదారులు ఈ మోడల్‌ను ఆదరించలేదు. దీనికి గల కారణాలపై ప్రస్తుతం అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ కారు గురించిన మరిన్ని వివరాలను ఒకసారి తెలుసుకుందాం.. స్కోడా సూపర్బ్ సెడాన్ శక్తివంతమైన 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దీని పెర్ఫామెన్స్ మెరుగ్గా ఉంటుంది.

ఈ ఇంజిన్ 190 bhp పవర్, 320 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్ ద్వారా పవర్‌ను అన్ని వీల్స్‌కు సరఫరా చేస్తుంది. కారు లోపల అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. దీనిలో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. ప్రయాణికులకు సీట్లు చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. క్యాబిన్ కూడా అందంగా డిజైన్ చేయబడి ఉంటుంది. లోపల ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి.

Skoda Superb Sedan Sales Report

స్కోడా సూపర్బ్ సెడాన్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎంటర్‌టైన్ మెంట్ కోసం 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌, ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, వెంటిలెటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ప్రయాణిలకు సేఫ్టీకి సంబంధించి 9 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ , చుట్టు చూడటానికి 360-డిగ్రీ కెమెరా ఉంటుంది.

ఈ కారులో అత్యుత్తమైన భద్రత ప్రమాణాలు ఉన్నాయి. దీనికి నిదర్శనంగా Aero Necbలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది. ఈ కారు ధర భారతీయ మార్కెట్లో రూ. 54 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్. ధర పరంగా ఎక్కువగా ఉండటం వలన తక్కువ అమ్మకాలను నమోదు చేసిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Skoda Superb Sedan December 2024 Sales

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, January 24, 2025, 9:00 [IST]
English summary
Skoda superb sedan car december 2024 sales report check here
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+