రూ.2లక్షలు పెట్టి కొంటే బండి స్టార్టే కావట్లేదట.. దెబ్బకు అమ్మకాలు నిలిపివేసిన రాయల్ ఎన్ ఫీల్డ్

భారతదేశంలోని యువతలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఒకప్పటి ఇబ్బందికరమైన బండ్ల నుంచి ఇప్పుడు ఎలాంటి కంప్లైంట్స్ లేని అదిరిపోయే యంగ్ మోటార్‌సైకిల్స్‌ను ఈ బ్రాండ్ అందిస్తోంది. అయినా సరే, ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఏ బైక్‌నైనా బుల్లెట్ అనే ముద్దు పేరుతోనే పిలుచుకుంటారు.

350cc నుంచి 650cc వరకు ఉన్న బెస్ట్ మోడల్స్‌ను కొనడానికి జనాలు షోరూమ్‌ల ముందు క్యూ కడుతున్నారు. అయితే, వీటిలో అడ్వెంచర్ టూరర్ అయిన హిమాలయన్‌కు మాత్రం ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. దీని మధ్యలో స్క్రాంబ్లర్ స్టైల్‌లో వచ్చిన స్క్రామ్ మోడల్ కూడా బాగానే అమ్ముడవుతోంది.

Royal Enfield Scram 440

అయితే, పాత హిమాలయన్‌ను ఇష్టపడేవారి కోసం కంపెనీ ఈ ఏడాది జనవరిలో స్క్రామ్ 440ని తీసుకొచ్చింది. పాత స్క్రామ్ 411 బైక్‌కు అప్‌డేటెడ్ మోడల్‌గా వచ్చిన ఈ బండికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. కానీ, ఇప్పుడు ఈ బైక్‌ను కొనాలనుకున్న వారికి, అలాగే కొన్న వారికి కూడా నిరాశ కలిగించే వార్త రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తోంది.

కొన్ని తయారీ లోపాల కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 మోటార్‌సైకిల్ బుకింగ్‌లను, అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది కంపెనీ. కొందరు స్క్రామ్ 440 వినియోగదారులు బైక్ కొన్నప్పటి నుంచి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నారని డీలర్‌షిప్‌లకు తెలియజేశారు. ఇంజన్ కొంతసేపు నడిచినా తర్వాత స్టార్ట్ అవ్వడం లేదనేది చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.

Royal Enfield Scram 440 Price

ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఆగిన తర్వాత బైక్ మళ్లీ స్టార్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతోందని చాలా మంది రిపోర్ట్ చేశారు. మాగ్నెటోలోని వుడ్రఫ్ కీ అనే ఒక ప్రత్యేకమైన భాగంలో ఉన్న సమస్యే దీనికి కారణం. దీని ఆధారంగానే స్క్రామ్ 440 మోడల్ బుకింగ్‌లను, అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆదేశించింది.

అయితే, ఈ సమస్య బైక్ అన్ని మోడళ్లను ప్రభావితం చేయలేదని కంపెనీ చెబుతోంది. కొన్ని బైక్‌లలో మాత్రమే ఇంజన్ స్టార్ట్ సమస్య తలెత్తిందని, కాబట్టి ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇప్పటివరకు అమ్ముడైన వాటిలో కేవలం 2 శాతం బైక్‌లు మాత్రమే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని రాయల్ ఎన్‌ఫీల్డ్ అంచనా వేస్తోంది.

Royal Enfield Scram 440 Price

ఎక్కడికైనా ట్రిప్ వెళ్లినప్పుడు రైడర్‌లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ సమస్యను పరిష్కరించడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ చాలా వేగంగా పనిచేస్తోంది. ఏదేమైనా, ఈ తయారీ లోపాన్ని కంపెనీ ఉచితంగానే పరిష్కరించి ఇస్తుందని సమాచారం. సైడ్ కవర్లు, మాగ్నెటో కవర్లు తీయాల్సి వచ్చే పని కాబట్టి, సమస్య ఉన్న బైక్‌లను బాగు చేయడానికి దాదాపు 1-2 గంటలు పట్టవచ్చు.

వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి స్క్రామ్ 440 మోడల్ కోసం బుకింగ్‌లను మళ్లీ ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకుని ఎదురుచూస్తున్న వారికి డెలివరీలు కూడా త్వరలోనే పునఃప్రారంభమవుతాయని భావిస్తున్నారు. సిటీ, ఆఫ్-రోడ్ పరిస్థితులకు అవసరమైన బలమైన లో-ఎండ్ టార్క్‌తో కూడిన ఒక కొత్త 440cc LS ఇంజన్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 మోడల్‌కు అందించింది.

Royal Enfield

443cc, ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ 25.4 bhp శక్తితో గరిష్టంగా 34 Nm టార్క్ వరకు ఉత్పత్తి చేయగలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజన్‌కు 3mm పెద్ద బోర్ ఉంది. ఇది 4.5 శాతం ఎక్కువ పవర్‌ను, 6.5 శాతం ఎక్కువ టార్క్‌ను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. స్క్రామ్ 411 మోడల్‌లోని 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పోలిస్తే 440 వేరియంట్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది.

ఒక అదనపు గేర్ లభించడంతో బైక్ హైవే రైడింగ్‌ను మరింత సులభతరం చేసింది. ఆరవ గేర్ వైబ్రేషన్‌ను తగ్గించడానికి, ఇంధన వినియోగాన్ని పెంచడానికి రూపొందించబడిందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం రూ.2.08 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో ఈ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయవచ్చు. ట్రైల్, ఫోర్స్ అనే రెండు వేరియంట్‌లలో ఈ బైక్‌ను విడుదల చేశారు.

Royal Enfield Scram 440 Price

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 ట్రైల్ వేరియంట్‌ను బ్లూ లేదా గ్రీన్ కలర్ ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు, అయితే స్క్రాంబ్లర్ బైక్ ఫోర్స్ వెర్షన్‌ను బ్లూ, గ్రీన్, టీల్ రంగులలో సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొదటిది వైర్-స్పోక్డ్ వీల్స్‌తో వస్తే, రెండవది అల్లాయ్ వీల్స్‌తో రావడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ట్యూబ్‌లెస్ టైర్‌లను అందించడం వల్ల మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

FAQs
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 ధర ఎంత?

ట్రైల్ వేరియంట్ ధర రూ.2.08 లక్షల నుంచి,  ఫోర్స్ వేరియంట్ ధర  రూ.2.15 లక్షల నుంచి(ఎక్స్-షోరూమ్)

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 టాప్ స్పీడ్ ఎంత?

గరిష్ట వేగం గంటకు 120-130 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 మైలేజ్ ఎంత?

మైలేజ్ దాదాపు లీటరుకు 30-35కిలోమీటర్ల వరకు ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 బుకింగ్‌లు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయి?

కొన్ని ఇంజన్ స్టార్టింగ్ సమస్యల కారణంగా బుకింగ్‌లు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.

DriveSpark Automotive

More from DriveSpark

Article Published On: Thursday, May 8, 2025, 17:15 [IST]
English summary
Some cant start it enfield stops sales of youths 440cc bullet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+