ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది.. నేడు విడుదల కానున్న ఎంజీ ప్రస్టేజియస్ మోడల్

ఎంజీ మోటార్స్ విడుదల చేస్తున్న కార్లకు మార్కెట్లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తూ మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది ఎంజీ మోటార్స్.. చాలా రోజుల నుంచి ఓ ప్రస్టేజియస్ మోడల్ తీసుకొస్తున్నామంటూ కంపెనీ ఊరిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం నేడు రానే వచ్చింది. ఎంజీ విండ్‌సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కారు విడుదలకు సమయం ఆసన్నమైంది.

నేడు గ్రాండ్ గా మార్కెట్లోకి రాబోతుంది. సరికొత్త ఎస్యూవీని పరిచయం చేయడానికి కంపెనీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వినియోగదారులు కూడా ఈ కారు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా 'విండ్‌సర్ ఈవీ ప్రో' కారుకు సంబంధించిన కొన్ని కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాటిలో ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ డిజైన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

MG Windsor EV Pro Price

ఈ ఫొటోలను నిశితంగా పరిశీలిస్తే ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో స్టాండర్డ్ విండ్‌సర్ ఈవీ వలె చాలా లేటెస్ట్ డిజైన్‎ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది ఎంజీ హెక్టర్‌లో కనిపించే అల్లాయ్ వీల్స్‌ను పోలి ఉంది. దీనితో పాటు, టెయిల్‌గేట్‌పై ఏడీఏఎస్(అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) బ్యాడ్జింగ్‌ను కూడా గుర్తించవచ్చు.

కొత్త ఎంజీ విండ్‌సర్ ఈవీ ప్రో కూడా అందుబాటు ధరలో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఈ కారు ప్రారంభ ధర దాదాపు రూ. 15 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న విండ్‌సర్ ఈవీ కనీసం రూ. 14 లక్షలు..టాప్ వేరియంట్ ధర రూ. 16 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది.

MG Windsor EV Pro

కొత్త ఎంజీ విండ్‌సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కారు మరింత శక్తివంతమైన పవర్ ట్రెయిన్ ఆప్షన్ కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 50.6 కిలోవాట్ (kWh) కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండవచ్చని, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 460 కిలోమీటర్ల వరకు రేంజ్ (మైలేజ్) ఇవ్వగలదని చెబుతున్నారు. అలాగే, ఇది ఎక్కువ హార్స్‌పవర్, న్యూటన్ మీటర్ పీక్ టార్క్‌ను కూడా ఉత్పత్తి చేయగలదని భావిస్తున్నారు.

ఈ సరికొత్త్ ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు అనేక అట్రాక్టివ్ ఫీచర్లను కలిగి ఉండనుంది. ప్రస్తుతం ఉన్న విండ్‌సర్ ఈవీలో ఉన్నట్లుగానే 15.6-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, కీ లెస్ ఎంట్రీ వంటి ఫీచర్లను ఇది కూడా కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

MG Windsor EV

కొత్త ఎంజీ విండ్‌సర్ ఈవీ ప్రో ఏడీఏఎస్(అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) మాత్రమే కాకుండా అనేక సేఫ్టీ ఫీచర్లను కూడా కలిగి ఉండనుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 360 డిగ్రీ కెమెరా కూడా ఉండనున్నాయి.

కొత్త కారు స్టాండర్డ్ ఎంజీ విండ్‌సర్ ఈవీ వలె 5 సీట్లను కలిగి ఉంటుంది, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. వారాంతాల్లో, సెలవు దినాల్లో ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి వీలుగా ఇది 604 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉండనుంది. ఈ కారుకు టాటా కర్వ్, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కార్లు స్ట్రాంగ్ పోటీదారులుగా ఉండవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 6, 2025, 7:02 [IST]
English summary
Spotted before launch much awaited mg windsor ev pro arriving today whats new
Read more on: #mg motors #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+