Strong Hybrid Cars ఈ కారు 30 కి.మీ కంటే మైలేజీ తక్కువ ఇవ్వవు! అన్ని తోపు కార్లు!
కారు కొనేటప్పుడు ఎవరైనా సరే దాని డిజైన్, బ్రాండతో పాటు ముఖ్యంగా చూసే అంశం మైలేజీ. అసలే ఫ్యూయల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనం ఉంటే.. ఖర్చులను కొంతైనా తగ్గించుకోగలం. అందుకే మార్కెట్లో మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్లకు డిమాండ్ ఎక్కువ. తయారీదారులు కూడా వీలైనంత మేరకు ఇలాంటి కార్లను తయారు చేసేందుకే ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం దేశంలో స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల హవా కొనసాగుతోంది. ఈ సెగ్మెంట్‌లో మరిన్ని ఆప్షన్ల కోసం వినియోగాదారులు ఎదురు చూస్తున్నారు. దీంతో దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు తమ బ్రాండ్ నుంచి కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఏయే కార్లు మార్కెట్లో హల్‌చల్ చేయనున్నాయో చూసేద్దాం.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా 7- సీటర్: మధ్య తరగతి నుంచి బిలియనీర్స్ వరకు అన్ని వర్గాల వారికి సరిపడా వాహనాలన తయారు చేసే మారుతీ సుజుకీ ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల తయారీలో ముందు వరుసలో ఉంది. తమ సంస్థ నుంచి పాపులర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ అయిన గ్రాండ్ విటారాను 7 సీటర్‌తో భారత్‌లో త్వరలోనే లాంచ్ చేయనుంది.

దీని లాంచ్ తేదీని మారుతి సుజుకి సంస్థ కచ్చితంగా వెల్లడించకపోయినప్పటికీ.. ఈ ఏడాది తొలి అర్ధభాగంలోనే దీన్ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రూ.20 నుంచి రూ.25 లక్షల మార్కెట్ ధరతో దీన్ని అందుబాటులోకి తీసకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 5 సీటర్ మోడల్ కంటే రానున్న కొత్త మోడల్‌లో రియర్ ఎండ్ రీడిజైన్ చేసి తీసుకురానున్నారు.
దీని వీల్‌బేస్ కూడా మరింత విస్తరించి తీసుకురానున్నారు. ఇక దీని పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే... ఇది పాత మోడల్ తరహాలోనే ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించిన 1.5 లీటర్ పెట్రోల్ యూనిట్‌తో రానుంది. ఇది మంచి మైలేజీని ఇవ్వనుంది. మంచి స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు కావాలనుకునేవారు దీని కోసం వెయిట్ చేయవచ్చు.

టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ 7 సీటర్: మారుతి సుజుకి, టయోటా సంయుక్త భాగస్వామ్యంలో ఈ కారు తీసుకురానున్నారు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఆధారంగా దీన్ని తయారు చేయనున్నారు. ఈ అర్బన్ క్రూజర్ హైరైడర్ 7 సీటర్‌ను ఈ ఏడాది మధ్య నాటికి లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కారు ధర రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.
అయితే లగ్జరీ విషయంలో హైరైడర్ 7 సీటర్ మార్కెట్లో ఉన్న ప్రస్తుతం ఉన్న కార్ల కంటే కాస్త విభిన్నంగా ఉండనుంది. దీని పవర్‌ట్రెయిన్ 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ఉండనుంది. ఇది 114 bhp పవర్ ఉత్పత్తి చేయనుంది. దీని ట్రాన్సిమిషన్ డ్యూటీస్.. సీవీటీ గేర్ బాక్స్‌తో అనుసంధానించి ఉంటాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్: మారుతి సుజుకి నుంచి ఫ్రాంక్స్ మోడల్ ఎంత ఫేమస్సో అందిరికీ తెలిసిందే! ఇప్పుడు ఈ ఫ్రాంక్స్ కారుకు ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకురానున్నారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ అయిన ఈ కారు.. ఈ ఏడాది మధ్యనాటికి భారత్ మార్కెట్లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కొత్త కారులో 1.2 లీటర్ త్రీ- సిలిండర్ Z12E పెట్రోల్ మోటార్‌తో ఉంటుంది.
అయితే ఇది వీల్స్‌కు పవర్ అందించదు. అందుకు బదులుగా ఇందులోని ఇంజిన్ జనరేటర్‌గా పనిచేసి, బ్యాటరీలను ఛార్జ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్‌తో ఈ వాహనాల వీల్స్ పనిచేస్తాయి. ఈ కారు ఫ్యూయల్ ఎఫీషియన్సీ లీటర్‌కు 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది కూడా మంచి కారుగా పరిగణించవచ్చు.
కియా సెల్టోస్ స్ట్రాంగ్ హైబ్రిడ్: ఈ కారు 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించి ఉంటుంది. దీని పవర్ ట్రెయిన్ విషయానికి వస్తే ఇది 141 bhp గరిష్ఠ శక్తి, 265 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేయనుంది. 6-స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్‌తో రానున్న ఈ కారు 18.1 నుంచి 19.8 kmpl మైలేజీ అందించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








