నిన్న మొన్నటి వరకు పట్టించుకోలేదు... ఉన్న ఫళంగా ఆ మోడల్ మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసింది ఏంటి జనాలకు

ఒకప్పుడు అంతగా డిమాండ్ లేని ఒక మారుతి SUV ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తక్కువ ధర, మంచి ఫీచర్లు ఉన్నప్పటికీ కొనుగోలుదారులు పెద్దగా పట్టించుకోని ఈ కారుకు ఏప్రిల్ నెలలో మాత్రం ఊహించని స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఇంతకీ ఆ కారు ఏంటి? దానికి ఒక్కసారిగా ఎందుకంత డిమాండ్ పెరిగింది? ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.

మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) ఒక పాపులర్ ఆఫ్-రోడ్ SUVగా గుర్తింపు పొందింది. ఇది చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను, అద్బుతమైన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది అందుబాటు ధరలోనే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అయినప్పటికీ, ఈ SUV అమ్మకాల సంఖ్య మాత్రం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. కానీ, ఇదే ఏప్రిల్‌లో 'జిమ్నీ'ని కొనుగోలుదారులు ఎగబడి కొన్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Maruti Suzuki Jimny

గత నెలలో (ఏప్రిల్-2025) మారుతి సుజుకి దాదాపు 431 యూనిట్ల 'జిమ్నీ' SUVలను విక్రయించింది. 2024లోని ఇదే కాలంలో 257 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలను పోల్చి చూస్తే, అమ్మకాల పరిమాణం ఏడాది నుంచి ఏడాదికి (YoY) 67.70శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఈ సంవత్సరం మొదటి నెలల్లో కూడా 'మారుతి సుజుకి జిమ్నీ' SUVల అమ్మకాల సంఖ్య అంత బాగా లేదు. అక్కడ కూడా అనేక హెచ్చుతగ్గులు కనిపించాయి. మార్చిలో 261 యూనిట్లు, ఫిబ్రవరిలో 385 యూనిట్లు, జనవరి నెలలో 163 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Maruti Suzuki Jimny

మారుతి సుజుకి జిమ్నీ ప్రత్యేకతలు ఏమిటి?
ఈ SUV కాస్త తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో మధ్యతరగతి వినియోగదారులు సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 12.76 లక్షల నుంచి రూ. 14.96 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇందులో 4 సీట్లు ఉండడంతో ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

కొత్త జిమ్నీ SUV ధరకు తగిన శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఎంపికను కలిగి ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండి, 105 PS హార్స్‌పవర్, 134.2 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్/ 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది లీటరుకు 16 నుంచి 17కిలో మీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.

Maruti Suzuki Jimny

కొత్త మారుతి జిమ్నీ SUV వెలుపలి భాగంలో మరింత ఆధునికమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, పెర్ల్ ఆర్కిటిక్ వైట్‌తో సహా వివిధ రంగుల ఎంపికలలో కూడా లభిస్తుంది. ఇది బీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వారాంతాల్లో, సెలవు దినాల్లో ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి ఇది 211 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

ఈ SUV టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్/ స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), 3-పాయింట్ సీట్ బెల్ట్‌లను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 20, 2025, 11:50 [IST]
English summary
Surprise hit this underrated maruti suv saw massive sales growth in april
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+