ఓరి నాయనో! ఎస్‌యూవీల కొనుగోలుకు ఎగబడుతున్నారే! మార్చి లెక్కలు ఇవే!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇప్పుడు ఎవరి హవా నడుస్తోంది? చిన్న కార్లా? సెడాన్లా? కానే కాదు! ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీలదే రాజ్యం. పెద్ద సైజు, పవర్ఫుల్ లుక్స్‌తో ఇవి యువతను, ఫ్యామిలీలను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. మార్చి 2025 అమ్మకాల గణాంకాలు చూస్తే మీకే అర్థమవుతుంది..ఏ కార్లు టాప్‌లో నిలిచాయో, ఏ కంపెనీ దుమ్మురేపిందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే!
దేశంలో ఇప్పుడు ఎస్‌యూవీల హవా నడుస్తోంది. సెడాన్ కార్లతో పోలిస్తే భారతీయ వినియోగదారులు ఎస్‌యూవీలనే ఎక్కువగా కొంటున్నారని తాజా అమ్మకాల గణాంకాలు మరోసారి తేల్చి చెప్పాయి. ఎస్‌యూవీలు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. గత కొన్ని నెలలుగా మార్కెట్ తీరును చూస్తే కొనుగోలుదారులు ఎస్‌యూవీలకే ఓటు వేస్తున్నారు.

వాటిలో హ్యుందాయ్ క్రెటా గత మూడు నెలలుగా వరుసగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత టాటా పంచ్, మారుతి బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా స్కార్పియో వంటి ఎస్‌యూవీలు ఎక్కువగా అమ్ముడయ్యాయి. భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను మొదటి నుండి శాసిస్తున్న హ్యుండాయ్ క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
కేవలం పెట్రోల్, డీజిల్ వేరియంట్లే కాకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలోనూ ఈ ఎస్‌యూవీ విడుదల కావడంతో కంపెనీకి భారీ లాభాలు వస్తున్నాయి. గత మార్చి నెలలో ఏకంగా 18,059 యూనిట్ల క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు కంపెనీకి ఇంతలా కలిసొస్తుండడానికి మరో కారణం ఏమిటంటే, పెట్రోల్, డీజిల్ క్రెటాను ఇటీవల కొత్త అప్‌డేట్లతో విడుదల చేయడం.

ఎస్‌యూవీ అదే లుక్‌తో మరిన్ని ఆకర్షణీయమైన కాస్మెటిక్ మార్పులతో విడుదల కావడంతో అమ్మకాలలో దూసుకుపోతోంది. ఇది భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ల తయారీదారుగా హ్యుందాయ్ తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి సహాయపడింది. హ్యుందాయ్ క్రెటా తర్వాత స్థానంలో టాటా పంచ్ ఉంది. ఈ కారు టాటా మోటార్స్‌కు భారీ విజయాన్ని అందించింది.
మార్చి 2025లో ఏకంగా 17,714 యూనిట్ల పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. టాటా పంచ్ 2025 ఆర్థిక సంవత్సరంలో రెండవ అత్యధికంగా అమ్ముడైన వాహనంగా మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌ను కూడా వెనక్కి నెట్టింది. పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో టాటా పంచ్ అందుబాటులో ఉండటం దాని పోటీదారుల కంటే ఒక అడుగు ముందు నిలబెట్టింది.

టాటా పంచ్ తర్వాత మారుతి సుజుకి బ్రెజా కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. నివేదికల ప్రకారం, గత మార్చి నెలలో మారుతి బ్రెజా 16,546 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మారుతి సుజుకి బ్రెజా కారు పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే మారుతి బ్రెజా తర్వాత స్థానంలో టాటా నెక్సాన్ ఎస్‌యూవీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది.
గత మార్చి నెలలో టాటా నెక్సాన్ 16,366 యూనిట్ల అమ్మకాలను సాధించింది. టాటా నెక్సాన్ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

మార్చి 2025లో అత్యధికంగా అమ్ముడైన మొదటి ఐదు ఎస్‌యూవీల జాబితాలో మహీంద్రా స్కార్పియో కూడా ఉంది. ఇది గత సంవత్సరం కంటే బలమైన అమ్మకాలను నమోదు చేసింది. మహీంద్రా స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ అనే రెండు మోడళ్లలో అమ్ముడవుతోంది. ఈ రెండూ కలిపి మొత్తం 13,913 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








