ఎస్‌యూవీ Vs హ్యాచ్‌బ్యాక్స్.. 2024లో మార్కెట్లో ఇరగదీసిన కార్లు ఏవో తెలుసా?
"ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క.. వాడొచ్చాడని చెప్పు.. ఎస్‌యూవీలు వచ్చాయని చెప్పు" అన్నట్లుగానే ఉంది... భారత మార్కెట్లో ఎస్‌యూవీల హవా. ఇంతకాలం బెస్ట్ సెల్లింగ్ కార్స్‌గా హ్యాచ్‌బ్యాక్స్‌కి మంచి గుర్తింపు ఉండేది. అయితే.. ప్రస్తుతం ఈ పరిస్థితులు మారిపోయాయి. మరీ ముఖ్యంగా 2024లోనైతే ఎస్‌యూవీలే అమ్మకాల్లో టాప్‌గా నిలిచాయి. ఈ సేల్స్.. భారత వినియోగదారులు ఎస్‌యూవీలవైపు దృష్టి సారిస్తున్నారనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. అయితే.. 2024లో ఎస్‌యూవీల్లో తిరుగులేనివిగా నిలిచినవేంటి? ఏయే సంస్థలు సేల్స్‌లో టాప్‌లో నిలిచాయి? వాటిల్లో ఉండే ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతి బ్రెజా: దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి మరోసారి ఎస్‌యూవీ అమ్మకాల్లో తన సత్తా చాటింది. ఈ సంస్థ నుంచి మారుతి బ్రెజా మోడల్ కారు సేల్స్‌లో అదరగొట్టింది. సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఉండే ఫీచర్లన్నీ ఇందులో లేనప్పటికీ.. ఇది కస్టమర్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. దీనికి కారణమేంటంటే... బ్రెజా మంచి మైలేజీ అందించడమే. అందువల్ల ఇది సేల్స్‌లో అదరగొడుతుంది.

దీని టాప్ క్లాస్ మైలేజీ కారణంగా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు మారుతి సంస్థకు ఉన్న బ్రాండ్ విలువ, అలాగే దీని డిజైన్ కూడా ఎస్‌యూవీల్లో ఇతర సంస్థలకు గట్టి పోటీనిచ్చింది. అందువల్ల ఈ కార్లు మార్కెట్‌లో టాప్ ప్లేస్‌లో చోటు సంపాదించింది.
మహీంద్రా స్కార్పియో: ఎన్నో సంవత్సరాలుగా ఎస్‌యూవీల్లో మహీంద్రా స్కార్పియో కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఎస్‌యూవీలు అంటే తెలియని వారు సైతం స్కార్పియో అనగానే గుర్తుపడతారు. అంతలా ఇది వినియోగదారులకు చేరవైంది. 2024లో స్కార్పియో కొత్త వర్షన్ అయిన స్కార్పియో- ఎన్ సైతం కస్టమర్స్‌ను మరింతగా ఆకట్టుకుంది.

ఈ స్కార్పియో - ఎన్ మోడల్ ఎస్‌యూవీ.. తన ఆకర్షణీయమైన డిజైన్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కారణంగా సేల్స్‌ను రాబడుతోంది. దీంట్లోని ఫీచర్లు కూడా ఇతర ఎస్‌యూవీలకు దీటుగా ఉండడం మరో కారణం అని చెప్పవచ్చు. ఈ కారు.. డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
టాటా సంస్థ ఈసారి ఎస్‌యూవీల్లో తన పంచ్ పవర్ చూపెట్టింది. ఈ సంస్థకు చెందిన పంచ్ మోడల్ కారు.. 2024లో తన అమ్మకాలతో అదరగొట్టి బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. పంచ్ మోడల్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావడం, ఈవీ వర్షన్ తీసుకురావడం వల్ల కూడా మార్కెట్లో తన స్థానం నిలుపుకుంది. ఇందులోని డిజైన్, ఫీచర్లు, డ్యూరెబిలిటీ సహా తక్కువ ధర వల్ల ఈ మోడల్ అమ్మకాల్లో తనకు తిరుగులేదని చాటింది.

హ్యాందాయ్ క్రెటా: ఈ కారు ధర రూ.10 లక్షలకు పైగా ఉంది. అయినా కానీ హ్యాందాయ్ క్రెటా పట్ల భారత వినియోగదారులు తెగ ఆసక్తి చూపించారు. అందుకే 2024 లో అమ్ముడైన టాప్ 3 కార్లలో ఒకటిగా ఈ మోడల్ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో అప్డేటెడ్ వర్షన్‌తో వచ్చిన ఈ కారు.. తన ఫేస్ లిఫ్ట్ మోడల్‌తోనూ అమ్మకాల్లో తన జోరు ప్రదర్శించింది.
హ్యుంయ్ క్రెటా.. పెట్రోల్, డీజిల్ వర్షన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. దీని ఇంటీరియర్ కూడా ఇటీవలే అప్డేట్ చేశారు. రానున్న రోజుల్లో తన ఎలక్ట్రిక్ వర్షన్‌తో రానున్న ఈ కారు ద్వారా తమ అమ్మకాలు మరింత పెరుగుతాయని హ్యుందాయ్ సంస్థ భావిస్తోంది. ఇవే కాకుండా ఇప్పుడు అనేక ఇతర వాహన తయారీ సంస్థలు ఈ 2025లో కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లో తీసుకువచ్చి తమ సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








