బంగారం లాంటి కారు.. జిల్ జిగేల్ అంటూ వచ్చేసింది.. గోల్డెన్ షేడ్ లుక్ అదిరిపోయిందిగా!
ఆటోమేటిక్ కార్ల వాడకం విషయంలో విదేశాల కంటే భారత్ కాస్త వెనకబడి ఉంది. ఎప్పుడైతే మారుతి సుజుకి సంస్థ సెలెరియో కారును లాంచ్ చేసిందో ఇక అప్పటి నుంచి భారత్‌లో ఆటోమేటిక్ కార్ల వాడకం జోరందుకుంది. సరసమైన ధరలో, ఆటోమేటిక్ గేర్ ఆప్షన్‌తో ఉన్న సెలెరియో కారు.. భారత్‌లో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ కారుకు సంబంధించి ప్రీమియం ఫీచర్లతో న్యూ జనరేషన్ కోసం స్పెషల్ ఎడిషన్ కారును మారుతి సంస్థ ఇటీవలే తీసుకువచ్చింది. సెలెరియో మిలానో వెర్షన్ పేరుతో వచ్చిన ఈ కారు స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొడుతోంది. ఆ సంగతులేంటో చూసేద్దాం.
థాయ్‌లాండ్‌లో సెలెరియో పాత మోడల్‌తో పాటు, దాని స్పోర్టీయర్ వెర్షన్ అయిన సెలెరియో జీఎల్ యూపీ అమ్మకాలు సైతం జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం జపాన్‌లో ఇదే సెలెరియోకు సంబంధించి మిలానో ఎడిషన్‌ను కొత్తగా సుజుకి ప్రవేశపెట్టింది. ఇది డ్యూయల్ టోన్ షేడ్‌లో ఉన్న ఈ కారు చూడగానే ఎవరినైనా ఆకట్టుకునేలా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో యాక్సెసరీస్ కూడా అధికంగా ఉన్నాయి.

ప్రస్తుతం సెలెరియో మోడల్ కంటే మిలానో ఎడిషన్ మరింత అట్రాక్టివ్ లుక్‌లో కనిపిస్తోంది. ఓల్డ్ జనరేషన్ సెలెరియో రెట్రో చార్మ్ లుక్‌లో ఉండగా... మిలానో ఎడిషన్‌లో ఈ రెట్రో చార్మ్ డిజైన్‌కు మరిన్ని అదనపు హంగులు జోడించి తీసుకువచ్చింది మారుతి సుజుకి సంస్థ. ఇందులో రూఫ్ క్యారియర్ వంటి యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి.
సెలెరియో మిలానో వెర్షన్ బేస్ కలర్ వైట్‌తో వస్తుండగా.. దీనికి టీల్ (బ్లూ- గ్రీన్), గోల్డెన్ షేడ్స్‌ని జోడించింది. ఇక ఈ కారు చుట్టూ పిన్ స్ట్రైప్ అదనపు ఆకర్షణగా ఉంటుంది. ఈ పిన్‌స్ట్రైప్ హెడ్‌లైట్ల ముందు నుంచి మొదలుకుని డోర్ హ్యాండిల్స్ వరకు కారు చుట్టూరా చక్కగా అమర్చి ఉంది. ఈ కారు రెండు ORVMలు సహా 5-డోర్ హ్యాండిల్స్‌లోనూ అన్ని లోగోలు, బ్రాండింగ్‌లపై గోల్డెన్ షేడ్‌తో కనిపిస్తుంది.

స్టాక్ అల్లాయ్ వీల్స్ కూడా టీల్, గోల్డ్ షేడ్స్‌లో డ్యూయల్-టోన్ ఆప్షన్‌ని కలిగి ఉంటాయి. ఇక రూఫ్ విషయానికి వస్తే దీని బేస్ వైట్ కలర్ ఉండి, నిలువు గోల్డెన్ లైన్స్‌తో డ్యూయల్-టోన్ ఎఫెక్ట్‌తో వస్తుంది. రూఫ్ క్యారియర్ వైట్, గోల్డెన్ షేడ్స్‌లో ఉంటుంది. థాయిలాండ్‌కి చెందిన సెలెరియో వెర్షన్‌ను గమనిస్తే ఇది 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది.
ఇందులోని ఇంజిన్ 68 ps పవర్, 90Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సీవీటీ యూనిట్ అందుబాటులో ఉంటుంది. ఇన్ని సౌకర్యాలతో ఇది ఆకర్షణంగా ఉన్నప్పటికీ భారతీయులు దీన్ని సొంతం చేసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే! ఎందుకంటే భారత్‌లో దీని విడుదలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దేశంలో సెలెరియో మోడల్స్ తమ అమ్మకాల జోరుని కొనసాగిస్తున్నాయి.

ప్రస్తుతం మారుతి సుజుకి సెలెరియే ఎక్స్ షోరూమ్ ధరలు రూ.4.99 లక్షలుగా ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇది మోస్ట్ ఫ్యూయల్ ఎఫీషియంట్ మోడల్‌గా పేరుగాంచింది. ఈ సెలెరియో మోడల్‌కి మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఈ ప్రత్యేక స్టైలింగ్ కలిగి ఉన్న కొత్త ఎడిషన్ కోసం భారతీయులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








