ఇండియాలో తయారవుతున్న ఈ కారు కోసం పక్క దేశాల్లో ఎగబడుతున్న జనాలు.. కేవలం 4 రోజుల్లోనే 50వేల బుకింగ్స్!

భారత ఆటో మొబైల్ మార్కెట్లో పాపులర్ బ్రాండ్ అయిన మారుతి సుజుకి నుంచి వచ్చిన బెస్ట్- ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ జిమ్నీ. ఈ కారుపై ఎన్నో అంచనాలు పెట్టుకుని విడుదల చేసిందీ సంస్థ. కానీ, ఇది భారతీయుల నుంచి ఆశించినంత స్పందనను అందుకోలేకపోయింది. కానీ, ఇదే కారు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. భారతీయులు కాదన్న దాన్ని విదేశీయులు తెగ ఆరాధిస్తున్నారు. జపాన్‌లో జనవరి 30న మారుతి సుజుకి మాతృసంస్థ అయిన సుజుకి.. ఈ కారును జపనీస్ మార్కెట్లో 'జిమ్నీ నోమేడ్' పేరుతో విడుదల చేసింది.

దీనికి అక్కడి కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ సుజుకి జిమ్నీ నోమేడ్ కారును హరియాణాలోని మారుతి సుజుకి తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేసి, జపాన్‌కు ఎగుమతి చేస్తున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ కారుకు సంబంధించి 50,000ల ఆర్డర్లను దక్కించుకుంది. దీంతో ఈ సంస్థ బుకింగ్ ప్రాసెస్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇంత భారీ డిమాండ్‌కు తగ్గ సప్లై సామర్థ్యం అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Suzuki Jimny Nomade

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ జిమ్నీ నోమేడ్ ఎస్‌యూవీల డెలివరీలను జపాన్‌లో సుజుకీ సంస్థ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభించనుంది. అక్కడ ఈ కారు ధర 26,51,000 యెన్‌ల నుంచి 27,50,000 యెన్‌ల మధ్య ఉంది. భారతీయ కరెన్సీలో(రూ.14.86 లక్షల నుంచి రూ.15.41 లక్షలు)గా ఉంది. ఇందులో భారీ ఫీచర్లు కలవు. అందువల్ల జనాలు ఈ కారుని కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఐదు డోర్లతో వచ్చే ఈ జిమ్నీ కారు ఇదివరకే ఆస్ట్రేలియా, మెక్సికో, దక్షిణాఫ్రికా వంటి అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యమైన డిమాండ్‌ను సొంతం చేసుకుంది. ఈ జిమ్నీ కారు డిజైన్, పర్ఫార్మెన్స్, ఫీచర్లు కాస్త భారత్‌లో అందుబాటులో ఉన్నట్లుగానే ఉన్నాయి. అయితే విదేశాల్లో దీనికి కొన్ని కాస్మెటిక్ ఛేంజెస్ చేశారు. ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.76 లక్షల నుచి రూ.14.95 లక్షల మధ్య ఉంది.

Suzuki Jimny Abroad Response

ఇది ఆల్ఫా, జెటా అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేగాకుండా దీంట్లో 4-సీటర్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఎస్‌యూవీ 1.5- లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో ఉంటుంది. ఇది 105 PS పవర్, 134 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్/4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఇది 16 నుంచి 17 కేఎంపీఎల్ మైలేజీ అందిస్తుంది.

ఈ కారులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, అనలాగ్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 4- స్పీకర్స్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉంటాయి. సేఫ్టీ విషయానికి వస్తే ఈ కారు 6 ఎయిర్ బ్యాగులతో ఉంటుంది. దీంట్లో ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టం, EBD(ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), రియర్ వ్యూ కెమెరా వంటివి ఉంటాయి.

Suzuki Jimny Abroad Response

భారత్‌లో ఆఫ్‌రోడర్స్‌కి భారీ డిమాండ్‌ ఉంది. వీటిలో థార్‌ రాక్స్‌కి భారీ డిమాండ్‌ కలదు. ఇదే కాకుండా ఫోర్స్‌ నుంచి గూర్ఖా కూడా అందుబాటులో ఉంది. జనాలు ఎక్కువ కంఫర్ట్‌ కోసం థార్‌ రాక్స్‌ని ఎంచుకుంటున్నారు. అయితే ఫర్పామెన్స్‌లో ఫోర్క్‌ గూర్ఖా అదరగొడుతుంది. ఇక జిమ్నీకి కూడా అంతే మొత్తంలో డిమాండ్‌ పెరుగుతోంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, February 8, 2025, 12:45 [IST]
English summary
Suzuki jimny bookings crossed 50000 in japan check all details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+