భారత్‌లో పుట్టి విదేశీ పోలీసులకు సహాయం చేస్తున్న జిమ్నీ.. అక్కడి వారికి మన కారు బాగా నచ్చింది!

భారత్‌లో తయారైన కార్లకు ఇటివలీ కాలంలో విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇంతకుముందు పలు మోడళ్లు జపాన్ వంటి దేశాల్లో బాగా అమ్ముడుపోయాయి. ఇప్పుడు తాజాగా జిమ్నీ (jimny) కారు కూడా ఈ జాబితాలో చేరింది. మహీంద్రా థార్‌కు పోటీగా ఇది ఇండియాలో అంతగా ఆదరణ సంపాదించలేదు. రఫ్ అండ్ టఫ్ బాడీ, బలమైన లెగసీ, ఆఫ్-రోడ్ సామర్థ్యం కలిగిన జిమ్నీ భారత్‌లో ఎక్కువ ధర కారణంగా సేల్స్ తగ్గాయి. అందులోనూ, మహీంద్రా థార్ ROXX వంటి బలమైన ప్రత్యర్థులు వచ్చే సరికి, జిమ్నీకి ఆ విభాగంలో నిలబడటం మరింత కష్టమయ్యింది. తక్కువ సమయంలోనే దీని అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, భారతీయుల కలలకు జిమ్నీ ఇచ్చిన జవాబు కొంచెం నిరాశ కలిగించేదే.

అయితే ఈ మధ్య దీని సేల్స్ క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో జిమ్నీకి విదేశాల్లో కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. దేశీయంగా వినియోగదారులు పెద్ద స్థాయిలో ఆదరించకపోయినా ఇతర చోట్ల తన సత్తాను చాటుతుంది. తాజాగా ఆ ఆఫ్‌రోడ్ కారు ఆస్ట్రేలియాలో అక్కడి పోలీసు విభాగంలో చేరింది. మాక్వేరీ పోలీస్ క్రైమ్ ప్రివెన్షన్ యూనిట్‌లో విధులు నిర్వహిస్తోంది. సార్జెంట్ జిమ్ అనే ఇంట్రస్టింగ్ పేరు కూడా దానికి పెట్టారు.

Suzuki Jimny Made In India Suv Joined Australian Police

పోలీసు విధులు నిర్వర్తించే చిన్న కారుగా మారింది. ముఖ్యంగా గర్వించాల్సిన విషయం, ఇది మేడ్ ఇన్ ఇండియా(Made in India) మోడల్. మన దేశంలో తయారై, వేల కొలమీటర్ల దూరం ఆస్ట్రేలియా వెళ్లి పోలీస్ వాహనంగా సేవ చేయడం, భారత ఆటోమొబైల్ పరిశ్రమ సాంకేతికతకు ఒక గొప్ప గుర్తింపు. భారత్‌లో జిమ్నీ ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం సాధించకపోయినా, ప్రపంచంలో దీని ప్రత్యేకతను, సామర్థ్యాన్ని గుర్తించేవాళ్లు చాలా మంది ఉన్నారు.

భారతదేశంలో తయారైన సుజుకీ జిమ్నీ 5-డోర్ల SUV, అక్కడి మార్కెట్లో జిమ్నీ XLగా ప్రసిద్ధి చెందింది. కొంచెం చిన్నది, కానీ గట్టిగా, కష్టతర పరిస్థితుల్లోనూ సులభంగా నడిచే సామర్థ్యం కలిగిన వాహనం, ఆస్ట్రేలియాలో పోలీస్ యూనిట్‌లో చేరడం విశేషం. న్యూ సౌత్ వేల్స్‌లోని మాక్వేరీ పోలీస్ క్రైమ్ ప్రివెన్షన్ యూనిట్, జిమ్నీని నేరస్థులను వెంటాడేందుకు కాకుండా, పాఠశాలల్లో, సమాజాల్లో ప్రజలతో సానుకూల సంబంధాలు ఏర్పరచడానికి, అవగాహన కార్యక్రమాల కోసం వినియోగిస్తోంది.

suzuki in Australia police

ఇది ఇప్పుడు ఆస్ట్రేలియన్ పోలీస్ ఫ్లీట్‌లోని BMW 5 సిరీస్, కియా స్టింగర్ లాంటి పెద్ద, శక్తివంతమైన వాహనాలతో కలసి విధులు నిర్వర్తిస్తోంది. ఈ పరిమాణంలో ఉండి, అంతటి ప్రతిష్టాత్మక వాహనాల సరసన నిలిచిన జిమ్నీకి మరొక గుర్తింపు. జిమ్నీని సాధారణ వాహనంలా కాకుండా పూర్తిస్థాయి పోలీస్ SUVగా మార్చడానికి ప్రత్యేకంగా కలర్, డిజైన్ ఇచ్చారు. తెల్ల బాడీపై ఎరుపు, నీలం రంగు స్టికర్లు వేసి, పసుపు హైలైట్‌లను జోడించారు.

ఈ కాంబినేషన్ SUVకి కాస్త కొత్త లుక్ కూడా తెచ్చింది. అవసరమైన సమయంలో వేగంగా సేవలో ఉండేందుకు, సౌండ్‌తో కూడిన సైరన్‌లు, మెరిసే ఎరుపు-నీలం లైట్లు అమర్చబడ్డాయి. భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు, సుజుకి నమ్మకానికి ఇది ఒక ప్రతీక. మనదేశంలో తయారై, వేల కిలోమీటర్ల దూరం ఆస్ట్రేలియాలోకి వెళ్లి పోలీస్ యూనిట్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఈ జిమ్నీ, నిజంగా మనకెంత గర్వకారణమో చెప్పడంలో సందేహం లేదు.

Suzuki Jimny Made In India Suv

పోలీసు విధుల్లో వినియోగిస్తున్న జిమ్నీ గురించి ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, దానికి ఏవైనా యాంత్రిక మార్పులు చేశారా లేదా అన్నది సుజుకి ఇప్పటివరకు బయటపెట్టలేదు. వాటిలో మార్పులు జరిగే అవకాశాలు చాలా తక్కువ అని భావిస్తున్నారు. ఇది ఇరుకైన రోడ్లపై, గల్లీల్లో సులభంగా మలుపులు తీయగలదు. ఆస్ట్రేలియన్ మోడల్ సుజుకీ జిమ్నీ XLలో భారత్‌లోనూ ప్రసిద్ధి పొందిన అదే 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 30, 2025, 17:29 [IST]
English summary
Suzuki jimny made in india suv joined australian police force details inside
Read more on: #suzuki
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+