పెట్రోల్ ఖర్చు తగ్గించాలనుకుంటున్నారా? అద్భుతమైన మైలేజ్‌ని ఇచ్చే సుజుకి జిమ్నీ వచ్చేస్తుంది!
మారుతి సుజుకి (maruti suzuki) తన క్లాసిక్ లుక్‌కి గల, ఆఫ్‌రోడ్ మోడల్ అయిన జిమ్నీ (Jimny) కారును మరోసారి భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. గతంలో మహీంద్రా థార్‌కి ప్రత్యామ్నాయంగా లాంచ్ చేసిన ఈ కారు, మొదట తగిన ఆదరణను పొందలేకపోయింది. దీంతో కంపెనీ ఈ సారి మరింత కొత్త అప్‌డేట్‌లతో ఈ కారును రీఎంట్రీ చేయడానికి సిద్ధం చేస్తోంది. ఈసారి ఇది కేవలం ఓ గ్లామరస్ SUVగా మాత్రమే కాకుండా మరింత స్టైలిష్, ఫీచర్-రిచ్ వేరియంట్‌తో తీసుకురానుంది. సరికొత్త హైబ్రిడ్ ఇంజిన్‌తో జిమ్నీ వస్తుందని తెలుస్తుంది. అయితే దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఆగష్టు నాటికి ఇది లాంచ్ కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పాటు సేఫ్టీ పరంగా, అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇతర టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు కూడా దీనిలో ఉండనున్నాయి.
కంపెనీ 2018లో జిమ్నీని ప్రపంచ మార్కెట్ కోసం విడుదల చేసింది. దాదాపు ఏడేళ్లుగా ఇది అంతర్జాతీయంగా అమ్మకాల్లో కొనసాగుతోంది. ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఉన్న 3-డోర్ వెర్షన్‌ను భారతదేశంలోనే తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. అయితే ఇండియన్ కస్టమర్ల కోసం, ప్రత్యేకించి కుటుంబ వినియోగదారుల కోసం, రెండు సంవత్సరాల క్రితం 5-డోర్ వెర్షన్‌ను ఇండియాలో విడుదల చేశారు. అయితే, ఈ ఐకానిక్ SUV ఆశించిన స్థాయిలో మార్కెట్‌ను ఆకర్షించలేకపోయింది.

2018లో 4వ తరం మోడల్‌గా లాంచ్ అయిన ఈ SUV, గత 7 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. అయితే, ఈ ఏడు సంవత్సరాల్లో పెద్దగా మార్పులు చేయకుండా కొనసాగింది. ఆఫ్‌రోడ్ ప్రియుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జిమ్నీ, ఇప్పుడు తన ప్రయాణంలో మరో కీలక మలుపు తీసుకోబోతోంది. ఇప్పుడు మారుతీ జిమ్నీకి మిడ్-లైఫ్ అప్‌డేట్ తీసుకురావాలని సిద్ధమవుతోంది. ఇది మంచి మైలేజ్ ఇవ్వనుందని సమాచారం.
ఇది ఫుల్ మోడల్ ఛేంజ్ కాకపోయినా, కొన్ని కీలక ఫీచర్లు, సాంకేతిక అప్‌డేట్లు, వినియోగదారులకు కావలసిన చిన్న మార్పులతో రిఫ్రెష్ మోడల్‌గా విడుదల కానుందని సమాచారం. డిజైన్ పరంగా ఎలాంటి భారీ మార్పులు చేయకుం*, కంపెనీ ఎలాంటి రిస్క్ లేకుండా నెమ్మదిగా ముందుకు సాగాలనే దిశలో ఉందట. అంటే, జిమ్నీకి ఉన్న డిజైన్ సొగసే కాకుండా, ఇప్పటికే మంచి గుర్తింపును పొందిన లుక్‌ను కొనసాగించనుంది.

ప్రస్తుతం సుజుకి 0.6-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 3-డోర్ జిమ్నీని, 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌తో జిమ్నీ సియారాను, సుజుకి సేఫ్టీ సపోర్ట్ టెక్నాలజీతో 5-డోర్ జిమ్నీ నోమాడ్‌ను విక్రయిస్తోంది. ఈ మూడు వేరియంట్లు తమ లక్ష్య మార్కెట్‌కి తగ్గట్టే ఉండగా, కొత్త మిడ్-లైఫ్ అప్‌డేట్ కూడా ఇంజిన్ లేదా ఇంటీరియర్ ఫీచర్ల పరంగా కొన్ని పటిష్టమైన మెరుగుదలలతో రానుందని ఊహిస్తున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం, డ్యూయల్ కెమెరా బ్రేకింగ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక డ్రైవింగ్ అసిస్టెన్స్ ఫీచర్లు (ADAS) కొత్త మోడల్‌లో భాగం కాబోతున్నాయి. అంతేకాక, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సాంకేతికత ప్రత్యేకంగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌పై అందుబాటులోకి రానుందని సమాచారం. దీని వల్ల దూర ప్రయాణాల్లో డ్రైవింగ్ మరింత సులభం అయ్యే అవకాశం ఉంది.

ఈ అన్ని అప్‌గ్రేడ్‌లతో ఇది ఆగస్టులో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి రానుందని తెలుస్తుంది. ప్రత్యేకించి జపాన్, యూరప్, ఆస్ట్రేలియా మార్కెట్లలో ప్రారంభమయ్యే అవకాశముంది. భారత్‌లో వస్తుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. గతంలో జిమ్నీకి గ్లోబల్ డిజైన్‌ను తీసుకుని ఇండియాలో 5-డోర్ వేరియంట్ రూపొందించిన తరహాలో, ఈ సారి కూడా అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త మోడల్‌కు లభించే స్పందనను బట్టి, అదే అప్‌డేట్ భారత్‌కి కూడా వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








