పాపులర్ సుజుకి జిమ్నీ డెలివరీ అక్కడ ఆగిపోయింది.. బుకింగ్ అమౌంట్ కూడా తిరిగి వెనక్కి!
మారుతి సుజుకి జిమ్నీ (Maruti suzuki jimny) 5-డోర్ భారతదేశంలో ఆదరణ పొందిన కాంపాక్ట్ ఆఫ్-రోడ్ SUVల్లో ఒకటి. దేశీయ మార్కెట్లో మంచి పోటీని ఎదుర్కొంటూనే, నిరంతరం అమ్మకాల్లో తన స్థాయిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రత్యేకంగా ఆఫ్-రోడింగ్ అభిమానులకు, ఈ కారు ఒక చిన్న కానీ శక్తివంతమైన భాగస్వామిలా నిలుస్తోంది. భారతదేశంలో తయారు చేసే ఈ జిమ్నీ 5-డోర్ మోడల్‌కి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది. కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పలు దేశాలకు కూడా దీన్ని ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఇది సుజుకి జిమ్నీ XL అనే పేరుతో విక్రయానికి అందుబాటులో ఉంది. అక్కడి మార్కెట్లో కూడా ఈ కారు డిమాండ్ పొందింది.
అయితే, ఇటీవల ఆస్ట్రేలియాలో జిమ్నీ XL 5-డోర్ డెలివరీలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. స్టాక్‌యార్డ్ యూనిట్ సమస్యలని సమాచారం. అసలు సమస్య ఏమిటి అనే విషయాన్ని సుజుకి ఆస్ట్రేలియా స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో ఇప్పటికే కారు కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా, జిమ్నీ XL కోసం బుకింగ్ చేసిన సమయంలో కస్టమర్లు చెల్లించిన అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని సుజుకి ఆస్ట్రేలియా అధీకృత డీలర్‌షిప్‌లకు సూచించినట్లు తెలిసింది.

అంటే, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆస్ట్రేలియాలో జిమ్నీ XL కొనుగోలు చేయాలనుకునే వారికి నిరీక్షణ తప్పనిసరిగా మారింది. ఈ పరిణామం ఒక్క ఆస్ట్రేలియా మార్కెట్లోనే కాకుండా, అంతర్జాతీయ ఆటోమొబైల్ రంగంలో కూడా చర్చకు దారి తీసింది. భారతదేశంలో తయారైన ఒక ప్రధాన SUVని ఇంతటి మార్కెట్లకు ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో, ఇలాంటి సమస్యలు తలెత్తడం కొంత ఆందోళన కలిగించే అంశం.
అయినప్పటికీ, జిమ్నీ తన ప్రత్యేకమైన డిజైన్, కాంపాక్ట్ ఆఫ్-రోడ్ సామర్థ్యం వల్ల ఎప్పటికీ ఆఫ్-రోడింగ్ ప్రేమికుల కలల కారుగానే కొనసాగుతోంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న కాంపాక్ట్ ఆఫ్-రోడ్ SUVలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ధర పరంగా ఇది రూ. 12.76 లక్షల నుండి రూ. 14.96 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండగా, ఆల్ఫా, డెల్టా అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త జిమ్నీ శక్తివంతమైన 1.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 105 PS హార్స్‌పవర్, 134 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత విభిన్నంగా చేసేందుకు, ఇది రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో అందుబాటులో ఉంది. దీని వల్ల నగర డ్రైవింగ్‌కి అనువుగా ఉండటమే కాకుండా, ఆఫ్-రోడింగ్‌లో కూడా సరైన అనుభవాన్ని ఇస్తుంది.
ఇది సాధారణ కార్లలాగే 16 నుండి 17 kmpl మైలేజీని ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 155 కి.మీ.లు కాగా, 0 నుండి 60 కి.మీ.ల వేగాన్ని కేవలం 4.5 సెకన్లలో అందుకోవడం దీని వేగాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కాంపాక్ట్ SUV అయినప్పటికీ, లోపల ప్రయాణికులకు సరిపడా సౌకర్యం కల్పించేలా 4 సీట్లు అందించబడ్డాయి. కాబట్టి, చిన్న కుటుంబాలు లేదా స్నేహితులతో ప్రయాణాల కోసం ఇది సరైన ఎంపిక అవుతుంది.

ఈ కారులో ప్రయాణికుల భద్రత పరంగా ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 6 ఎయిర్‌బ్యాగులు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), 3-పాయింట్ సీట్ బెల్టులు, హిల్ హోల్డ్ కంట్రోల్, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి మొదలగు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








