టాటా పంచ్‌కు బలమైన ప్రత్యర్థి.. చిన్న కారు కావాలనుకునే వారికి బెస్ట్.. అక్కడ లాంచ్ చేసిన సుజుకి

ఎంతో అట్టహాసంగా కొనసాగుతున్న 2025 జపాన్ మొబిలిటీ షోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన తయారీదారులు తమ సరికొత్త ఆవిష్కరణలను, భవిష్యత్ వాహనాలను ప్రదర్శిస్తున్నారు. ఈ వేదికపై సుజుకి కూడా పలు ఆసక్తికరమైన మోడళ్లను ఆవిష్కరించింది. వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మారుతి సుజుకి XBEE లేదా జపాన్ మార్కెట్‌లో ప్రసిద్ధిగా పిలిచే క్రాస్బీ (Crosby). ఈ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ SUV 2017లోనే జపాన్‌లో తొలి సారిగా పరిచయం అయి, చిన్న SUV విభాగంలో తన ప్రత్యేకమైన డిజైన్‌ద్వారా మంచి గుర్తింపును సంపాదించింది. ఇప్పుడు 2025లో సుజుకి దీనికి కొత్త రూపాన్ని, మరింత ఆధునికమైన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకువచ్చింది. కొత్త XBEE ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్‌లో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి.

ముందు భాగంలో మరింత శార్ప్‌గా కనిపించే LED హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా ఆకృతీకరించిన గ్రిల్‌, ఆకర్షణీయమైన బంపర్ డిజైన్‌ దీని లుక్‌ను పూర్తిగా మార్చేశాయి. అలాగే బాడీ కలర్ ఆప్షన్లు, డ్యూయల్-టోన్ ఫినిషింగ్, స్టైలిష్ అలాయ్ వీల్స్, ఇవన్నీ కలిపి దీన్ని యువతరాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాయి. వెనుక భాగంలో కూడా కొత్త LED టెయిల్‌ల్యాంప్‌లు, రిఫ్రెష్ చేసిన టెయిల్‌గేట్ డిజైన్‌ ఉన్నాయి. ఇంటీరియర్‌లో కూడా పలు మార్పులు ఉన్నాయి.

Suzuki Xbee New Facelift Model Showcased At Japan Mobility Show 2025

కారు లోపల సుజుకి దీన్ని మరింత ప్రీమియమ్ టచ్‌తో అప్‌డేట్ చేసింది. కొత్త XBEE లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, మరింత సౌకర్యవంతమైన సీటింగ్‌, మెరుగైన క్యాబిన్ లభిస్తాయి. ప్రస్తుతం XBEE జపాన్ మార్కెట్‌కే పరిమితమైనప్పటికీ, భారత మార్కెట్‌ కోసం కూడా రావచ్చు. దీని పరిమాణం, డిజైన్‌, ఫీచర్లను బట్టి చూస్తే మార్కెట్‌లో టాటా పంచ్ వంటి వాటితో పోటీ పడే స్థాయిలో ఉంటుంది.

2025 అప్‌డేట్‌తో సుజుకి క్రాస్బీ మరింత ఆధునికంగా, శక్తివంతంగా మారింది. కొత్త మోడల్‌లో సుజుకి 1.2-లీటర్, 3-సిలిండర్ మైల్డ్-హైబ్రిడ్ Z12E పెట్రోల్ ఇంజిన్ను ప్రవేశపెట్టింది. ఈ ఇంజిన్ 81 bhp పవర్, 109 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ ట్యూనింగ్‌లో సుజుకి చేసిన మెరుగుదలతో డ్రైవింగ్ అనుభవం మరింత సాఫీగా మారింది, అలాగే మైలేజ్ కూడా గణనీయంగా పెరిగింది. హైబ్రిడ్ టెక్నాలజీతో పర్యావరణహితంగా ఉండడం మరో అంశం.

Suzuki Xbee New Facelift Model Showcased At Japan Mobility Show 2025

క్రాస్బీ కొత్త ఫేస్‌లిఫ్ట్ సింపుల్ అయినా స్టైలిష్‌గా కనిపించే రూపకల్పన దీని ప్రత్యేకత. ఇది భారత మార్కెట్లో విక్రయించే మారుతి S-ప్రెస్సోతో పోలిస్తే ఆకృతిలో కొంత సమానంగా కనిపించినప్పటికీ, దాదాపు 200 మిల్లీమీటర్లు ఎక్కువ పొడవు కలిగి ఉంటుంది. దీని వల్ల కారు అంతర్గతంగా మరింత విస్తారమైన స్థలం అందిస్తుంది. ప్రతి అంగుళం స్పేస్‌ను సద్వినియోగం చేసుకునేలా క్యాబిన్ డిజైన్ చేయబడింది.

వెనుక సీట్లు స్లైడ్ అయ్యే విధంగా ఉండటం వల్ల లెగ్‌రూమ్ లేదా లగేజ్ స్పేస్‌ను మన అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా, అండర్ ఫ్లోర్ స్టోరేజ్, ఫ్లాట్-ఫోల్డింగ్ రెండవ వరుస సీట్లు వంటి ఫీచర్లు నగర జీవితానికి బాగా సరిపోతాయి. షాపింగ్ బ్యాగ్‌లు, స్పోర్ట్స్ గేర్ లేదా ట్రావెల్ లగేజ్ తీసుకెళ్లడానికి ఇది చాలా అనువైన సెటప్. భద్రత పరంగా కూడా క్రాస్బీ గణనీయమైన అప్‌గ్రేడ్లను పొందింది.

Suzuki Xbee New Facelift Model Showcased At Japan Mobility Show 2025

ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి సుజుకి తాజా సాంకేతిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇవి డ్రైవర్‌కు మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి, ట్రాఫిక్ పరిస్థితుల్లో భద్రతను పెంచుతాయి. ఇదిలా ఉంటే, XBEE జపాన్‌లో మాత్రమే అమ్ముడవుతోంది. సుజుకికి ఈ కారును భారతదేశానికి తీసుకురావాలనే ఆలోచన లేదు. ఒకవేళ దానిని ఇండియాలో కూడా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లయితే కంపెనీ అధికారికంగా ప్రకటిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 31, 2025, 10:40 [IST]
English summary
Suzuki xbee new facelift model showcased at japan mobility show 2025
Read more on: #maruti suzuki
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+