Auto expo 2025: పెట్రోల్, డీజిల్ అవసరం లేని సరకు రవాణా వాహనం.. హిందూజా గ్రూప్ నుంచి సరికొత్త వెహికల్

హిందూజా గ్రూప్‌కు చెందిన భారీ వాహనాల తయారీ సంస్థ స్విచ్ మొబిలిటీ (switch mobility) భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో IeV8 అనే వాణిజ్య వాహనాన్ని విడుదల చేసింది. ఇది ఎలక్ట్రిక్ వేరియంట్. లైట్ వెయిట్‌తో వచ్చింది. భారీ వస్తువులను మోసుకెళ్లలేదు. అయితే కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, 7.2 టన్నుల బరువున్న వస్తువులను మాత్రం తీసుకెళ్లగలదు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల యుగం ప్రారంభమైన తరుణంలో కార్లు, బైక్స్ ఇప్పటికే ఈవీ వెర్షన్లలో విడుదల అవుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కు మంచి ఆదరణ లభిస్తుండటంతో భారీ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఇప్పుడు సరుకుల రవాణకు ఉపయోగించే వాణిజ్య వాహనాలను కూడా ఈవీలలో తీసుకొస్తున్నారు.

స్విచ్ మొబిలిటీ అనేది దేశంలో వివిధ రకాల వాణిజ్య వాహనాలను తయారు చేసి విక్రయిస్తుంది. మార్కెట్లో ఈవీలకు వస్తున్న ఆదరణను గమనించిన సంస్థ ఈ ఎలక్ట్రిక్ IeV8 అనే వాణిజ్య వాహనాన్ని భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో విడుదల చేసింది.

Switch Mobility Unveils Iev8 Electric Commercial Vehicle

ఐఇవీ8 (IeV8)లో కంపెనీ అత్యాధునిక శక్తివంతమైన లిథియం ఐరన్ బ్యాటరీని అందించింది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే 250 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కి.మీల వరకు ఉంది. వెనుక సరకు రవాణాకు సంబంధించి అవసరానికి అనుగుణంగా గరిష్టంగా 830 క్యూబిక్ అడుగుల వరకు పెంచుకోవచ్చు. కంపెనీ ఈ వాహనాన్ని అత్యాధునిక సాంకేతికతతో రూపొందించింది. ఎలక్ట్రో-హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ చాలా కంఫర్ట్‌గా ఉంది.

SwitchIon (iON) సదుపాయం ద్వారా దీనిలో ఏవైన రిపేర్‌లు వెంటనే గుర్తించవచ్చు. రోడ్లపై ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు, డెలివరీ సమయంలో వాహనాన్ని ఈజీగా ఆపరేట్ చేయడానికి SwitchIon సదుపాయంంతో దాదాపు 50 కంటే ఎక్కువ ఫీచర్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. డ్రైవర్లకు అవసరమైన చాలా ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. ఇది అత్యాధునిక నాణ్యమైన సేఫ్టీ ప్రమాణాలను కలిగి ఉంటుంది. సరుకులు పెట్టడానికి సరిపడినంత స్థలం వెనుక ఉంది.

Iev8 Electric Commercial Vehicle At Auto Expo 2025

లోకల్‌గా నగరాల్లో, పట్టణాల్లో కార్గో వాహనంగా బాగా ఉపయోగపడుతుంది. దీని పెర్ఫామెన్స్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుదని కంపెనీ తెలిపింది. డ్రైవర్ క్యాబిన్ మొత్తం కూడా AC సదుపాయాన్ని కలిగి ఉంది. అలాగే సీట్లు కూడా చాలా మెత్తగా కంఫర్ట్‌గా ఉంటాయి. ఇవి మడత పెట్టడానికి అనువుగా ఉంటాయి.

ముఖ్యంగా ఇది ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి, వినియోగదారులకు ఛార్జ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని అందించారు. దీంతో డ్రైవర్లు ఎక్కువ సమయం బ్యాటరీ ఛార్జ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. IEV8 ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం విడుదలపై స్విచ్ మొబిలిటీ ప్రెసిడెంట్ ధీరజ్ హిందూజా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, వాణిజ్య వాహనాల విభాగంలో ఇది సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది.

వాతావరణానికి ఎలాంటి కాలుష్యం కలగకుండా సరుకు రవాణాకు అవసరమైన వాణిజ్య వాహనాలను తయారు చేయడంలో మా నిరంతర నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ IEV8 ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం లాజిస్టిక్స్ అవసరాలను తీర్చడమే కాకుండా , పర్యావరణ అనుకూల రవాణాకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం మా డ్రైవ్‌స్పార్క్‌ సోషల్‌ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

More from DriveSpark

Article Published On: Sunday, January 19, 2025, 12:32 [IST]
English summary
Switch mobility unveils iev8 electric commercial vehicle at bharat mobility global expo 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+