కొత్త కారు కొనేవారు ఆగండి.. టాటా నుంచి కొత్త ఆల్ట్రోజ్.. దీనికి బ్రేక్ వేయడం ఎవరి తరం కాదు!
ప్రయాణికుల సేఫ్టీ కోసం అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేయడంలో దేశీయంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) కొత్త మోడళ్లను విడుదల చేయడంపై సన్నాహాలు చేస్తుంది. కంపెనీ కస్టమర్ల కోసం త్వరలో ఆల్ట్రోజ్(Altroz) కొత్త ఫేస్‌లిఫ్ట వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. టాటా విడుదల చేసే ప్రతి వాహనంపై ప్రజలకూ, పరిశ్రమకు కూడా ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉండటం సహజం. అలాంటి నమ్మకాన్ని తిరిగి నిరూపించేందుకు ఇప్పుడు టాటా ఆల్ట్రోజ్ కొత్త అవతారంలో రానుంది. ఈ కొత్త మోడల్‌పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కారు విడుదలకు ముందే దీనికి సంబంధించిన డిజైన్, ఫీచర్స్ అంశాలు కొన్ని లీక్ అయ్యాయి. టాటా తన ప్రసిద్ధ కారును మే 22న మార్కెట్లోకి ప్రారభించనుంది.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ 2025 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మరింత పోటీని తీసుకురానుంది. పాత దానితో పోలిస్తే ఎక్స్‌టీరియర్‌లో కొన్ని మార్పులు చూడవచ్చు. డైనమిక్ లైన్స్‌తో, మరింత స్పోర్టీ, లేటెస్ట్ ఆలోచనల రూపంతో ఇది రూపొందించబడిందని చెప్పవచ్చు. ముందుభాగంలోని గ్రిల్ డిజైన్, షార్ప్ హెడ్‌లాంప్స్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లో ఇంటిగ్రేట్ చేసిన LED DRLలు కారు అందాన్ని పెంచుతున్నాయి. బంపర్ కింది భాగంలో కట్స్, బ్లాక్డ్-అవుట్ యాక్సెంట్లు జోడించారు.

ఎక్స్‌టీరియర్‌తో పాటు ఇంటీరియర్ కూడా చాలా అందంగా ఉంటుంది. పూర్తిగా అప్‌డేట్ చేయబడిన డాష్‌బోర్డ్ అమర్చారు. స్టీరింగ్ వీల్ కూడా కొత్తది. పలు ఫంక్షన్లను ఆపరేట్ చేయడానికి వీలుగా స్టీరింగ్ వీల్‌పై టచ్-ఆపరేటెడ్ బటన్‌లతో డిజిటల్ లోగో ఉంటుంది. అలాగే, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 10.2-అంగుళాల యూనిట్, మరో 10.2-అంగుళాల TFT స్క్రీన్ దీనిలో ఉన్నాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్లలో టాటా మూడు భిన్నమైన ఆప్షన్లను అందించనుందని తెలుస్తుంది. ఒకటి 1.2 లీటర్ సాధారణ పెట్రోల్ ఇంజిన్, మరొకటి 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ వేరియంట్, దీనితో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉండటం, ఎక్కువ ప్రయాణించే వారికి లేదా మెరుగైన మైలేజ్ కావాలని కోరుకునే వినియోగదారులకు ఇది గొప్ప ఆప్షన్‌గా నిలుస్తుంది.

ఆల్ట్రోజ్‌ను వేరే లెవెల్‌లో నిలబెట్టే అంశం మాత్రం దాని డీజిల్ ఇంజన్ ఆప్షన్. ఇది ఈ విభాగంలో డీజిల్ ఇంజిన్‌ను అందించే ఏకైక కారుగా నిలుస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో తన స్థానం సంపాదించుకున్న బాలెనో, గ్లాంజా, హ్యుందాయ్ i20 వంటి బలమైన పోటీదారులతో ఇది పొటీని ఎదుర్కొనుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికల విషయానికి వస్తే, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCT)ని కూడా కలిగి ఉంది.
ఇక CNG వేరియంట్‌లో కూడా లభించనుందని సమాచారం. పెట్రోలు ధరల నేపథ్యంలో ఇది మరో ఆప్షన్‌గా నిలవనుంది. 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చూడటానికి 360 డిగ్రీల కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగులు, స్టెబిలిటీ కంట్రోల్, ABS వంటి ఫీచర్లు ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను రక్షించడానికి ఉపయోగపడుతాయి.

ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్, భద్రత పరంగా కుటుంబాలకు ఒక నమ్మకమైన ఎంపికగా నిలుస్తుంది. అంతేకాకుండా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా అమర్చిన AC వెంట్స్ వంటివి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. వాయిస్-యాక్టివేటెడ్ సన్‌రూఫ్ ఫీచర్ టెక్నాలజీ ప్రియులకు ఇష్టపడే అంశం. వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వంటి హైటెక్ సదుపాయాలు కూడా ఈ కారులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








