మే 21న టాటా వాళ్లు మరోసారి మార్కెట్ ను దున్నేయడానికి వచ్చేస్తున్నారు.. ఈ సారి మోడల్ అంతకుమంచి ఫీచర్లతో..

టాటా మోటార్స్ (Tata Motors) స్వదేశానికి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ, దేశీయ మార్కెట్‌లో చిన్న కార్ల నుంచి భారీ ట్రక్కుల వరకు అనేక రకాల వాహనాలను అందిస్తోంది. ముఖ్యంగా, టాటా మోటార్స్ సేఫ్టీ, క్వాలిటీ, వినియోగదారుల అవసరాలను అనుగుణంగా కార్లను రూపొందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.

టియాగో, టిగోర్, నెక్సాన్, హారియర్, పంచ్, సఫారి వంటి మోడళ్లతో టాటా మోటార్స్ భారతీయ వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. ఈ కార్లు వాటి ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, బడ్జెట్ ధరలతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా టాటా మోటార్స్ తనదైన ముద్ర వేస్తోంది. నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ వంటి విజయవంతమైన మోడళ్లను విడుదల చేసింది.

Tata Altroz Facelift Launch Date

దేశీయ అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన సాంకేతికతను అందిస్తూ, పర్యావరణ అనుకూల వాహనాలను అభివృద్ధి చేయడంలో టాటా మోటార్స్ ముందుంది. వినియోగదారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, గ్లోబల్ NCAP వంటి సంస్థల నుంచి అత్యధిక రేటింగ్‌లను పొందిన కార్లను టాటా అందిస్తోంది. మొత్తానికి, టాటా మోటార్స్ ఒక స్ట్రాంగ్ భారతీయ బ్రాండ్‌గా నిలిచింది.

ఇది నాణ్యమైన ఉత్పత్తులు, విశ్వసనీయ సేవలతో లక్షలాది మంది భారతీయుల నమ్మకాన్ని చూరగొంది. తాజాగా, కంపెనీ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'ఆల్ట్రోజ్' ఫేస్‌లిఫ్ట్, అంటే అప్ డేటెడ్ మోడల్‌ను అతి త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Tata Altroz

కొత్త టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ (Tata Altroz Facelift) హ్యాచ్‌బ్యాక్ వచ్చే నెల మే 21న గ్రాండ్‌గా విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కారు బడ్జెట్ ధరలో కూడా అందుబాటులో ఉండనుందని అంచనా. దీని ధర రూ. 6 లక్షల నుండి రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు.

కొత్త టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ బయటి భాగంలో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. కొత్త గ్రిల్, రీ డిజైన్ చేసిన బంపర్, చూడగానే ఆకట్టుకునే LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, ఫాగ్ ల్యాంప్‌లు, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుందని భావిస్తున్నారు.

Tata Altroz Facelift

ఈ టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇది ప్రస్తుత మోడల్‌లో ఉన్న ఇంజన్ ఆప్షన్స్‌తోనే రానుంది. ప్రస్తుతం ఉన్న ఆల్ట్రోజ్ కారు 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 88 PS పవర్, 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ DCT (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

మరో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 90 PS పవర్, 200 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆఫ్షన్ మాత్రమే కలిగి ఉంది. ఇక 1.2-లీటర్ CNG ఇంజన్ 73.5 PS పవర్, 103 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

Tata Altroz Launch Date

కొత్త టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కారు లీటరుకు 19 నుండి 26 కిమీ వరకు మైలేజ్ ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు. ఇందులో కూడా 5 సీట్లు ఉండనున్నాయి. ప్రయాణికులు హాయిగా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి 345 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉండే అవకాశం కూడా ఉంది.

ఈ కారు అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, ఆటో ఏసీ, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్స్, 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 29, 2025, 13:12 [IST]
English summary
Tata altroz facelift launch date revealed coming soon at an attractive price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+